For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 5 ముఖ్య కారణాలే వల్లే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఏడుస్తారు !

ఈ 5 ముఖ్య కారణాలే వల్లే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఏడుస్తారు !

|

మీరు గర్భవతి అయినప్పుడు, భయంతో కొన్నిసార్లు బిగ్గరగా, పెద్దగా అరుస్తూ కేకలు వెయ్యాలని భావిస్తారు. ఎలాంటి కారణం లేకుండానే గర్భిణీ స్త్రీలు తరచుగా ఏడుస్తుంటారు. గర్భిణీ స్త్రీలు ఎందుకు ఏడుస్తున్నారో అన్న విషయాలను వివరించడం చాలా కష్టం కానీ, మనం దానిని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం !

కొన్నిసార్లు, మీరు క్యాబ్ డ్రైవర్ కు చెల్లించడానికి సరైన చిల్లరి లేని కారణంగా కూడా మీరు చాలా తీవ్రంగా ఏడుస్తుంటారు. ఇలాంటి సంబంధంలేని అనేక విషయాలకు గర్భిణీ స్త్రీలు ప్రతిస్పందించడానికి గల కారణం వారి శరీరంలో చోటు చేసుకున్న హార్మోన్ల ప్రభావం & శారీరక అసౌకర్యం వంటి పరిస్థితుల కలయిక వల్ల వీళ్ళకి తరచుగా కన్నీళ్లు వస్తాయి.

Pregnant Women Cry | Why Crying Affect Pregnant Women

గర్భిణి స్త్రీలు ఎక్కువగా ఏడవడానికి గల కొన్ని కారణాలు ఎక్కడ ఉన్నాయి ! అవి,

అలసట :-

అలసట :-

గర్భిణీ స్త్రీలు చాలా అరుదుగా మంచి నిద్రను కలిగి ఉంటారు. అందువల్ల వారు మొదటి & మూడవ త్రైమాసికంలో ఎక్కువ సమయం అలసిపోయి ఉంటారు. ఇలా వారి శారీరక అలసట కారణంగా, వారి ఆలోచనల సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయి ఉంటారు. ఇలాంటి సమయాల్లో వారికి ఏమౌతుందో తెలియక సతమతమవుతూ ఏడుస్తారు.

శారీరక అసౌకర్యం :-

శారీరక అసౌకర్యం :-

వికారం, వేవిళ్ళ వంటివి గర్భిణీ స్త్రీలకు సంతోషకరమైన భావాలు కావు. అలాంటి మరికొన్ని పరిస్థితులు అనగా మలబద్ధకం, వెన్నునొప్పి & తలనొప్పి వంటివి మిమ్మల్ని మరింత ఉక్కిరిబిక్కరి చేస్తాయి. ఈ కారణాలు చాలు ఒక మనిషి ఎక్కువగా ఏడవడానికి, అందువల్ల మీరు గర్భిణీ స్త్రీలను అనవసరంగా నిందించవలసిన పని లేదు.

హార్మోన్లలో వచ్చే మార్పులు :-

హార్మోన్లలో వచ్చే మార్పులు :-

మీరున్న పరిస్థితిని మరింత పెద్దది చేయటంలో హార్మోన్ల పాత్ర ముఖ్యంగా ఉంటుంది. మీరు ఒకవేళ గర్భవతి కాకపోయినట్లయితే, కన్నీటికి కారణమైన గ్రంథులపై మీరు తీవ్రమైన నియంత్రణను కలిగి ఉంటారు. కానీ మీరు గర్భం దాల్చిన తర్వాత మీ శరీరంలోని ప్రతి కండరాలపై స్వచ్ఛంద నియంత్రణను కలిగి ఉండే హార్మోన్ల ప్రభావాన్ని కోల్పోతుంది. అందుకే గర్భిణీలు చాలా త్వరగా ఏడుస్తారు, ఆ పరిస్థితిని వీరు నియంత్రించలేరు.

అభద్రతాభావం :-

అభద్రతాభావం :-

గర్భిణీలు తరచుగా అభద్రతాభావానికి లోనవుతారు. ఇందుకు కారణం వారి బరువు పెరగడమే. అలా వారు బరువు పెరగటం వల్ల అందంగా కనపడరేమో అన్న భావన వారిని మరింతగా కృంగదీస్తుంది. అలాగే వారు వారి జాబ్ విషయంలో అంతకుముందులా ఎక్కువగా పని చేయలేరు. ఇలా వీరు వారి జాబు పట్ల అభద్రతా భావానికి లోనవుతారు. ఈ కారణం వల్ల కూడా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఏడిచేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

భయం :-

భయం :-

గర్భణీ స్త్రీలుగా ఉన్నప్పుడు హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా కొన్ని భయాలు అసహజంగానే ఏర్పడతాయి. గర్భస్రావం / పురిటి నొప్పులు / సాధారణంగా నవజాత శిశువును కలిగి ఉండటం వంటివి చాలా సహజమైన భయాలు. ఇలాంటివి చెప్పుకుంటూపోతే ఇంకా చాలానే ఉన్నాయి.

ఏడుపు అనేది గర్భిణీ స్త్రీలు & వారి పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, మీరు మీ గర్భధారణ సమయంలో చాలా సంతోషంగా ఉండటమనేది చాలా ముఖ్యం. కానీ దీనిని చేయడం కన్నా - చెప్పడం చాలా సులభం. మీకు మేము సూచించే సలహా ఏమిటంటే, ప్రతీ విషయాల్లోనూ మిమ్మల్ని మీరు తప్పుగా ఆలోచిస్తూ జడ్జి చేసుకుంటూ ఆందోళనకు గురి కావొద్దు.

English summary

Pregnant Women Cry | Why Crying Affect Pregnant Women

When you are pregnant, you sometimes feel a terrible urge to just cry out loud or yell at someone. Pregnant women cry a lot and often for no reason at all. It is difficult to explain why pregnant women cry so much but let us give it a try.Sometimes, you find yourself in a perfectly normal situation like not having the change to pay the cab driver and you want to really cry your lungs out. Pregnant women cry at these seemingly irrelevant situations because of a combination of pregnancy hormones and physical discomfort.
Story first published:Tuesday, August 7, 2018, 17:34 [IST]
Desktop Bottom Promotion