కడుపుతో ఉన్నప్పుడు పెల్విక్ (కటిభాగం) నొప్పిని సమర్థవంతంగా ఎదుర్కోవటం

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ప్రెగ్నెన్సీ టాపిక్ యే మహిళల్లో ఉత్సాహాన్ని సృష్టిస్తుంది. వారు వారి పాపాయిని తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చేతుల్లోకి తీసుకోటానికి ఉవ్విళ్ళూరుతారు కానీ ఆ దశ కూడా ఏ నొప్పి, సమస్యలేకుండా పూర్తవ్వాలని ఆశిస్తారు.

కడుపుతో ఉన్న సమయంలో ప్రతి స్త్రీ శరీరం వేర్వేరుగా స్పందిస్తుంది. కొంతమంది స్త్రీలు కొన్ని రకాల లక్షణాలు కనబరిస్తే, మరికొంతమందికి అవేంటో కూడా తెలియకుండానే ఆ దశ గడిచిపోతుంది.

అందుకే ప్రెగ్నెన్సీ అంటే ఇంకా చాలా అయోమయం , అపోహలు ఉంటున్నాయి.

Handling Pelvic Pain During Pregnancy

కడుపుతో ఉన్నప్పుడు స్త్రీ శరీరంలో అవయవాలన్నీ గర్భాశయంలో పెరుగుతున్న బేబీకి స్థానం ఇవ్వటం కోసం కొంచెం పక్కకి జరుగుతాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో కటి ప్రదేశంలో నొప్పిని సమర్థవంతంగా ఎదుర్కోవటం

ఇది తల్లికి గ్యాస్ సమస్య, మలబద్ధకం, తరచూ మూత్రం, యాసిడ్ వెనక్కి తన్నటం, గుండెల్లో మంట వంటి అనేక ఇబ్బందులు కలిగిస్తుంది.

రెండవ త్రైమాసికంకి వచ్చేసరికి, గర్భాశయం పక్కటెముకల వరకు చేరుతుంది. ఈ సమయంలో బేబీ కదలికలు ఎక్కువై, తల్లిని ఎక్కడపడితే అక్కడ తన్నటం వలన తల్లికి చాలా సమస్యగా మారుతుంది.

కిడ్నీలపై కూడా అదనపు వత్తిడి పడుతుంది ఎందుకంటే అవి బేబీ వ్యర్థపదార్థాలను కూడా వడబోసి వేరుచేయాల్సి వస్తుంది. చర్మం నెలలు నిండే కొద్దీ తన సామర్థ్యాన్ని మించి సాగుతుంది, ఫలితంగా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి.

శరీరంపై కొన్ని ప్రదేశాలలో హార్మోన్ల మార్పుల వలన ఎక్కువ రంగు మచ్చలు ఏర్పడతాయి.

కడుపుతో ఉన్నప్పుడు పొట్ట ప్రాంతంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. పైన చెప్పిన అన్ని మార్పులేకాక, స్త్రీలకి రెండు, మూడు త్రైమాసికాలలో నడుంనొప్పి, కటి ప్రాంతంలో పెల్విక్ నొప్పి కూడా వస్తుంది.

బేబీ బరువుకి తగ్గట్టుగా వెన్నెముక వంపు మారుతుంది. అందుకే, నడుంనొప్పి కడుపుతో ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది.

అందరికీ నడుంనొప్పి గురించి తెలిసినా, కటి ప్రదేశంలో పెల్విక్ నొప్పి మాత్రం అందరికీ ఆందోళన కలిగిస్తుంది.

పెల్విక్ (కటి ప్రదేశం) నొప్పి అంటే ఏమిటి?

Handling Pelvic Pain During Pregnancy

పెల్విక్ నొప్పి కటి ప్రదేశంలో ఉన్న కీళ్ళు చుట్టూ అసౌకర్యంగా ఉండటంగా అన్పిస్తుంది. దీనినే చాలామంది స్త్రీలు పురిటినొప్పులుగా భావిస్తారు. దీన్ని పురిటి సంబంధిత పెల్విక్ గర్డిల్ పెయిన్ (పిపిజిపి) అని అంటారు.

ఇది పురిటినొప్పి కన్నా పూర్తిగా వేరైనది. ఇది బేబీకి హానికారకం కాకపోయినా, తల్లికి మాత్రం ఇబ్బంది తప్పక కలిగిస్తుంది.

పెల్విక్ (కటి ప్రదేశ నొప్పి) ఎలా వస్తుంది?

పాపాయి పెరుగుతున్నప్పుడు, మెల్లగా కటి ప్రదేశంవైపు కదులుతుంది, ఆ కదలిక సమయంలో మీ మూత్రాశయం, పిరుదులు మరియు కిందవైపు పొట్టపై ఎక్కువ వత్తిడి పడుతుంది. దీని వలన మీ పెల్విక్ కీళ్ళపై కూడా ఎక్కువ భారం పడి, నొప్పి కలుగుతుంది.

ఈ నొప్పి వలన మీ నడక, మెట్లు ఎక్కడం, బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఒక కాలిపై నిలబడటం ఇవన్నీ సమస్యగా మారి కుదరకపోవచ్చు. అందుకని ఈ నొప్పిని సమర్థవంతంగా భరించటం నేర్చుకోవటం ముఖ్యం.

మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ పెల్విక్ నొప్పిని ఎలా ఎదుర్కోవాలో కొన్ని పద్ధతులు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అవేంటో చదవండి.

ప్రెగ్నెన్సీ సమయంలో కటి ప్రదేశంలో నొప్పిని సమర్థవంతంగా ఎదుర్కోవటం

1) కటి ప్రదేశానికి సంబంధించి పెల్విక్ వ్యాయామాలు

మీరు పెల్విక్ నొప్పికి సంబంధించి గైనకాలజిస్టును సంప్రదిస్తే, మొట్టమొదటగా వారు చెప్పేది మీ పిరుదులను వదులుచేసే, విశ్రాంతినిచ్చే కొన్ని వ్యాయామాలు చేయమని సూచిస్తారు. ఈ వ్యాయామాలు మీ కటి ప్రాంతంలో కండరాలకు విశ్రాంతినిచ్చి, నొప్పిని తగ్గిస్తాయి. ఈ టెక్నిక్కులను మంచి నిపుణుడి పర్యవేక్షణలో క్రమం తప్పకుండా పాటించడం వలన, మీ నొప్పికి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.

Handling Pelvic Pain During Pregnancy

2)ఆక్యుపంచర్;

ఈ పద్ధతి ఈ మధ్య కడుపుతో ఉన్నవారిలో ఎక్కువ ప్రాచుర్యం పొందుతోంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన నొప్పిని తగ్గించటంలో ఈ పద్ధతి చాలా ప్రభావం చూపిస్తోంది. మంచి ఆక్యుపంచర్ నిపుణుడుని వెతకడం వలన మీకే నొప్పి తగ్గి, ఈ ప్రెగ్నెన్సీ దశ కొంచెం సులువవుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో కటి ప్రదేశంలో నొప్పిని సమర్థవంతంగా ఎదుర్కోవటం

3)గోరువెచ్చని నీటితో స్నానం;

ప్రెగ్నెన్సీ సంబంధిత ఏ నొప్పికైనా జవాబు గోరువెచ్చని నీటితో స్నానం. మీకు కటి ప్రదేశంలో నొప్పి రాగానే గోరువెచ్చని నీటితో నింపిన బాత్ టబ్ లో విశ్రాంతి పొందండి. నీరు నిండిన టబ్ లో విశ్రాంతి తీసుకోవటం వలన మీ బిడ్డ పొత్తికడుపు కటి ప్రదేశం నుంచి కొద్దిసేపు కదిలే అవకాశం ఉండి, మీకు నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.

4) పొట్టకి కట్టుకునే స్లింగ్ ;

క్రచెస్ లేదా పొట్టకి కట్టుకునే స్లింగ్స్ వంటి పరికరాల వలన మీ పొట్ట బరువుకి సపోర్ట్ లభించి మీకు, మీ కటి కండరాలకు కొంచెం వత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. పెల్విక్ సపోర్ట్ బెల్స్ కూడా ఇలాంటి కేసుల్లో మంచి సపోర్టును ఇస్తాయి.

Handling Pelvic Pain During Pregnancy

5) విశ్రాంతిః

మీకు పెల్విక్(కటి) నొప్పి రావడం మొదలవగానే, అన్ని పనులనూ వదిలేసి అప్పటికప్పుడు నేల మీద పడుకుని, నిజంగా నిద్రపోవటం కూడా మంచిది. కటి కండరాలపై ఆపకుండా వత్తిడి కలిగించటం నొప్పిని మరింత పెంచుతుంది. మీకు నొప్పిగా ఉన్నప్పుడు, మీ శరీరం మీకేదో చెప్పాలనుకుంటోందని గ్రహించండి. దానిని వినండి మరియు విశ్రాంతి తీసుకోండి. మీ శరీరం మీకు దానికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది.

కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, పెల్విక్ నొప్పిని పురిటినొప్పిగా అపోహ పడకండి. పెల్విక్ నొప్పి సాధారణంగా స్త్రీలలో రెండవ ట్రైమిస్టర్ లోనే వస్తుంది,కొంతమందిలో మాత్రం మూడవ త్రైమాసికం చివరి వరకూ నొప్పి కలగదు.

సాధారణంగా మీరు వరసగా శారీరక శ్రమ ఉండే పనులు చేయకుండా, పడుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ కటి భాగం పెల్విక్ నొప్పి అదే తగ్గిపోతుంది. ఆందోళన పడకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అసలు నొప్పి ఎందుకు వస్తుందో అర్థం చేసుకుని ఆ పనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

మీ గైనకాలజిస్టును సంప్రదించకుండా ఏ పెయిన్ కిల్లర్స్ మందులు తీసుకోకూడదని గుర్తుంచుకోండి, అవి మీ బిడ్డకు తీవ్రంగా హానికారకం కూడా కావచ్చు.

ఇంకా, ఇలాంటి కేసుల్లో మీ కుటుంబం అండ కూడా చాలా అవసరం. మీ దగ్గరివారితో కలిసి వుండటం వలన మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు, అలాగే మీ బిడ్డ కూడా!

English summary

Handling Pelvic Pain During Pregnancy

Handling Pelvic Pain During Pregnancy,During pregnancy, the internal organs of a woman move slightly to accommodate the growing baby in the womb.This creates numerous problems for the mother, which results in gastric issues, constipation, frequent urination, acid reflux, heart burn etc.Among whicg pelvic pain is the
Story first published: Tuesday, February 20, 2018, 12:00 [IST]