For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోలార్ గర్భధారణ ప్రమాదకరమా?

|

వైద్యపరంగా మోలార్ గర్భాన్ని, గర్భాశయ ట్రోపోబ్లాస్టిక్ వ్యాధి లేదా GTD అని పిలుస్తారు ప్రతి సంవత్సరం భారతదేశంలో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది మహిళలు ఈ వ్యాధి మూలంగా ప్రభావితం అవుతున్నారు. ఈ మహిళలలో కణజాలం ఒక కణితిలా ఏర్పడుతుంది. దీనిని హైడతిఫామ్ మోల్ అని పిలుస్తారు.సాధారణంగా ఈ కణితిలో, క్యాన్సర్ లక్షణాలు ఉండవు. బాధాకరమైన విషయం ఏమిటంటే, మోలార్ గర్భ సమస్యకు ఎటువంటి నివారణ లేదు.

ఈ వ్యాసంలో మనం, మోలార్ గర్భాలలో వివిధ రకాలు మరియు ఈ వ్యాధి నిర్ధారణా విధానం, చికిత్స పద్ధతులు గురించి తెలుసుకుందాం.

మోలార్ గర్భధారణ ప్రమాదకరమా?:

• మోలార్ గర్భం అంటే ఏమిటి? ఇది ఎలా సంభవిస్తుంది?

సగటు మనిషికి అర్ధమయ్యేట్టు చెప్పాలంటే, మోలార్ గర్భం అనేది గర్భాశయంలోని అసాధారణ కణజాల పెరుగుదల అని చెప్పవచ్చు. ఈ కణజాలంలో పెరుగుదల, సాధారణ పిండం కంటే త్వరగా జరుగుతుంది. చాలా సందర్భాల్లో, మోలార్ గర్భధారణలో అసలు అభివృద్ధి చెందుతున్న పిండమే ఉండదు. వైద్య శాస్త్రం ప్రకారం, మోలార్ గర్భాలు, రెండు ప్రధాన రకాలు: సంపూర్ణ మోలార్ గర్భం మరియు పాక్షిక మోలార్ గర్భం.

is-molar-pregnancy-dangerous

1. సంపూర్ణ మోలార్ గర్భం

ఈ పరిస్థితి, ఒక శుక్రకణం ఒక నిస్సారమయిన అండంతో ఫలదీకరణం చెందినప్పుడు ఏర్పడుతుంది. అండం నిస్సారమయినది కనుక, శిశువు యొక్క అభివృద్ధి జరగదు. అయినప్పటికీ, ఫలదీకరణం జరిగినందున, కణజాలం అభివృద్ధి చేయబడుతుంది. కనుక, గర్భధారణ హార్మోన్ల ఉత్పత్తి సాధారణంగానే సాగుతుంది. ఈ రకమైన మోలార్ గర్భంలో, ప్రారంభ దశలోనే అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా పిండం లేదని నిర్ధారణ అవుతుంది.

2. పాక్షిక మోలార్ గర్భం

పూర్తి మోలార్ గర్భధారణతో పోలిస్తే, ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ మోలార్ గర్భధారణలో, అభివృద్ధి చెందిన కణజాలంలో, పిండానికి సంబంధించిన కణాలు మరియు అసహజ కణాలు రెండు ఉంటాయి. అటువంటి నిర్మాణ అమరికల వలన, పిండంలో తీవ్రమైన జననార్ధ లోపాలు ఉంటాయి.

అధికభాగం కేసులలో, అసాధారణ కణాల పెరుగుదల, పిండం పెరుగుదల కంటే చాలా త్వరగా జరుగుతుంది కనుక, పిండం కన్నా అసహజ కణాలు ఎక్కువ అయ్యి, గర్భం ఆకస్మికంగా ముగుస్తుంది.

పాక్షిక మోలార్ గర్భధారణలో, కొన్నిసార్లు అరుదుగా కవలలు ఉండి ఉండవచ్చు. అందులో ఒకట పిండం సాధారణంగా, ఆరోగ్యవంతంగా ఉంటే, ఇంకొక పిండం మోల్ గా అభివృద్ధి చెందుతుంది. ఈ సందర్భంలో కూడా మోల్ కణజాల వృద్ధి వేగవంతంగా జరిగి, ఆరోగ్యకరమైన పిండంను ఎదగనివ్వకపోవడం చేత గర్భం ముగుస్తుంది.

• మోలార్ గర్భధారణలను ఎలా గుర్తించాలి?

మోలార్ గర్భధారణ యొక్క కొన్ని ప్రారంభ లక్షణాలు, సాధారణ గర్భధారణను పోలి ఉంటాయి. దీనిలో కూడా hCG స్థాయిలు పెరుగుతాయి మరియు వికారం మరియు వాంతులు వంటి హార్మోనల్ అసౌకర్యాలు తలెత్తుతాయి.

అందుకే దీనిని గుర్తించడానికి, సంక్లిష్ట లక్షణాలైన, యోని స్రావాలు లేదా రక్తస్రావం, పిండంలో అస్సలు కదలికలు లేకపోవడం వంటి లక్షణాలను గమనించాలి. సాధారణ గర్భంతో అలా జరగదు.

• మోలార్ గర్భంలో మీరు శిశువు ఏ హృదయ స్పందనను గుర్తించలేరు. గైనకాలజిస్ట్, కటి భాగం పరీక్షలు చేసి , శరీరంలో hCG స్థాయి అసాధారణంగా అధిక మొత్తంలో ఉందని చెప్పగలరు. గర్భాశయ పరిమాణం సాధారణం కన్నా చిన్నగా లేదా పెద్దగా (ఇది మోలార్ గర్భధారణకు సంకేతం) ఉంటే, ఈ పరీక్షలో అది కూడా గుర్తించవచ్చు.

• గర్భిణీ స్త్రీలలో , సోనోగ్రాం చాలా సాధారణంగా జరిపే ఒక పరీక్ష. ఒక స్త్రీ మోలార్ గర్భం కలిగి ఉన్నట్లయితే, ఆమె యొక్క సోనోగ్రాంలో ఒక 'ద్రాక్షపండ్ల గుత్తు' మాదిరి రూపం కనిపిస్తుంది. ఇది అసాధారణ ప్లాసెంటాకు సంకేతం.

• మోలార్ గర్భానికి కారణాలు:

జన్యు పరమైన కారణాల వలన ఈ వ్యాధి కలుగుతుంది కనుక, మీ దగ్గరి బంధువులు గతంలో ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే, మీకు కూడా అలా జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ మాత్రలు దీర్ఘకాలికంగా ఉపయోగించైనా లేదా పలుమార్లు గర్భస్రావాలు జరిగినా కూడా మోలార్ గర్భాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న మహిళలు మరియు 35 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా ఈ పరిస్థితికి తలెత్తే ప్రమాదం ఉంది.

English summary

is-molar-pregnancy-dangerous

Molar pregnancy is the growth of abnormal mass within the uterus. This mass is a bunch of tissues that tend to grow faster than a normal foetus. In most of the cases, a molar pregnancy does not involve a developing embryo at all. There are 2 ways to treat molar pregnancy.
Story first published: Saturday, August 25, 2018, 13:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more