ప్రెగ్నన్సీ ద్వారా మహిళల్లో కలిగే పది మార్పులు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

తల్లయ్యే వరం మగువలకు మాత్రమే సొంతం. తల్లి అవడం ద్వారానే మగువ జీవితానికి ఒక అర్థం వస్తుంది. నవమాసాలు మోసి ఒక ప్రాణాన్ని ఈ భూమి మీదకి తెచ్చే సామర్థ్యం మగువలకే కలదు. ప్రెగ్నన్సీలో అనేక నొప్పులు, సమస్యలు అలాగే ఇష్యూలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యలన్నీ పాపాయి కల్మషం లేని చిరునవ్వును చూడటంతో తగ్గిపోతాయి. అయితే, ప్రెగ్నన్సీ ద్వారా మగువలలో కలిగే మార్పులను ఏ మాత్రం ఇగ్నోర్ చేయకూడదు.

ప్రెగ్నన్సీ ద్వారా మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే చిన్న చిన్న అవాంతరాలను దాటవలసి వస్తుంది. లక్ష్యం సాధించే ముందు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే, కొన్నిటిని ఇగ్నోర్ చేయడం వలన తల్లిబిడ్డల ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు.

How Pregnancy Affects A Woman | Changes During Pregnancy | Maternal Changes During Pregnancy

పువ్వుకు ముళ్ళులాగా ప్రెగ్నన్సీ వలన మహిళలు శారీరక ఆలాగే మానసిక మార్పులకు గురవుతారు. ఇది మీకు రెండవ లేదా మూడవ ప్రెగ్నన్సీ అయితే ప్రెగ్నన్సీలో జరిగే మార్పులు మీకు తెలిసే ఉంటాయి. కొత్తగా తల్లవుతున్న వారికి మాత్రం ప్రెగ్నన్సీ అనేది కాస్త తికమక కలిగిస్తుంది. స్ట్రెస్ అనేది ప్రెగ్నన్సీపై ఎటువంటి ప్రభావం కలుగుతుందో కొత్తగా తల్లవుతున్న వారు తెలుసుకోవాలి. ఇక్కడ ప్రెగ్నన్సీ వలన మహిళల్లో ఏర్పడే మార్పుల గురించి వివరించాము.

1. శారీరక మార్పులు:

1. శారీరక మార్పులు:

ప్రెగ్నన్సీ వలన కలిగే శారీరక మార్పులు ఈ పాటికే మీకు అర్థమయి ఉంటాయి. నెలలు పెరుగుతున్న కొద్దీ మీ కడుపు పెద్దదవుతూ వస్తుంది. ప్రెగ్నన్సీ అనగానే అందరికీ గుర్తుకువచ్చే మొట్టమొదటి మార్పు ఇదే.

2. ఇంటర్నల్ ఆర్గాన్స్ పై ప్రెగ్నన్సీ ప్రభావం:

2. ఇంటర్నల్ ఆర్గాన్స్ పై ప్రెగ్నన్సీ ప్రభావం:

ప్రెగ్నన్సీ వలన మహిళల ఇంటర్నల్ ఆర్గాన్స్ పోసిషన్ లో అలాగే వాటి పనితీరులో మార్పులు ఏర్పడతాయి. ఇంకొక ప్రాణాన్ని గర్భంలో మోస్తున్నందుకు లంగ్స్ కాస్తంత కుచించుకుపోతాయి. బ్రెస్ట్ లో వాపు ఏర్పడుతుంది. రిబ్ కేజ్ అనేది సాధారణం కంటే పెద్దగా మారుతుంది.

3. బరువులో పెరుగుదల:

3. బరువులో పెరుగుదల:

జీవితంలో ఎప్పుడైనా బరువును నియంత్రణలో ఉంచుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రెగ్నన్సీలో మాత్రం అదనపు బరువును అదుపులో చేయలేరు. గర్భస్థ శిశువు అలాగే ఆమ్నాయిటిక్ ఫ్లూయిడ్ లు ఈ బరువుకు కారణం. అయితే, గర్భస్థ శిశువు ఆరోగ్యం కోసం ఈ మార్పు మంచిదే కదా!

4. స్ట్రెచ్ మార్క్స్:

4. స్ట్రెచ్ మార్క్స్:

ప్రెగ్నన్సీ వలన మహిళల అబ్డోమిన్ పై ఇరిటేటింగ్ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. గర్భం దాల్చినప్పుడు చర్మం అనేది సాగుతుంది. అందువలన, ప్రసవం తరువాత అటువంటి స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనబడతాయి.

5. శిరోజాలలో మార్పులు:

5. శిరోజాలలో మార్పులు:

ప్రెగ్నన్సీ తరువాత హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుంది. కొంతమంది ప్రెగ్నన్సీ తరువాత తమ హెయిర్ టెక్స్చర్ అనేది మార్పులకు గురయిందని అంటుంటారు. ఆయిలీ గా లేదా డ్రై గా తమ హెయిర్ మారిపోయిందని అంటుంటారు. అలాగే, కొంతమంది తమ హెయిర్ కలర్ లో మార్పును కూడా గమనించి ఉండుంటారు.

6. ఏకాగ్రత సమస్య:

6. ఏకాగ్రత సమస్య:

శరీరంలో తలెత్తే మార్పులు ఒకవైపైతే, మానసిక మార్పులు మరోవైపు. మార్నింగ్ సిక్నెస్ మరియు నాజియా వలన కాన్సన్ట్రేషన్ సమస్యలు అలాగే మతిమరుపు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

7. డిప్రెషన్

7. డిప్రెషన్

ఇది అత్యంత సాధారణ సమస్య. మీరెంత కష్టపడినా కొన్ని సార్లు ప్రెగ్నన్సీలో స్ట్రెస్ ను అధిగమించలేము. ప్రెగ్నన్సీలోని స్ట్రెస్ వలన శారీరక అలాగే మానసిక సమస్యలు తలెత్తుతాయి. డిప్రెషన్ భావనలు పెరుగుతాయి. ఈ లక్షణాలను మీరు గమనిస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించండి. వారి సూచనలను పాటించండి.

8. హార్మోన్ల మార్పులు:

8. హార్మోన్ల మార్పులు:

మీ శరీరంలో ప్రెగ్నన్సీ వలన అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మీ మూడ్ పై కూడా ప్రెగ్నన్సీ ప్రభావం ఉంది. అనవసర విషయాలకి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. సడెన్ మూడ్ స్వింగ్స్ కు గురవుతున్నారు. ఇవన్నీ, ప్రెగ్నన్సీ వలన శరీరంలో తలెత్తిన హార్మోన్ల మార్పుల ప్రభావమని వైద్యులంటున్నారు.

9. ప్రొఫెషనల్ ఛేంజెస్:

9. ప్రొఫెషనల్ ఛేంజెస్:

ఇది ఆశ్చర్యకరమే. కానీ నిజం. ప్రెగ్నన్సీ వలన కెరీర్ లో కాంప్రమైజ్ అవటం తప్పదు. ప్రెగ్నన్సీ అంటే 10 నెలల జర్నీ. అలాగే, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా ఇంకా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. కాబట్టి, మీరు మీ కెరీర్ లో కీలకమైన దశలో ఉంటే ప్రెగ్నన్సీని వాయిదా వేయటం మంచిది.

10. రిలేషన్ షిప్ లో మార్పులు:

10. రిలేషన్ షిప్ లో మార్పులు:

బిడ్డను గర్భంలో మోస్తున్నప్పటినుంచి మహిళ తల్లిగా మారుతుంది. అయితే బిడ్డను చేతిలోకి మొదటి సారి తీసుకున్నప్పుడే పురుషుడు తండ్రిగా మారతాడు. ప్రెగ్నన్సీలో ప్రేమానురాగాలను తన భాగస్వామి నుంచి మహిళ ఆశిస్తుంది. అవి కరువైనప్పుడు కలతచెందుతుంది. ఇది చాలా దురదృష్టకరం.

English summary

How Pregnancy Affects A Woman | Changes During Pregnancy | Maternal Changes During Pregnancy

Being a mother is the growth of a girl to the perfect womanhood. It gives you the great feelings to create a little life after nourishing it for ten long months in your own body. The pains, problems, issues you face during your pregnancy seem nothing when you see the giggling smile in your baby’s face. But that doesn't mean that you can ignore the changes of how the pregnancy affects a woman.