సమ్మర్ లో గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ కంఫర్ట్ ని కోరుకుంటారు. భరించలేని ఎండలు శరీరాన్ని ఇబ్బందికి గురిచేస్తాయి అనడంలో సందేహం లేదు. సాధారణమైన వారే ఎండకు ఇబ్బందులకు గురవుతున్నప్పుడు గర్భిణీలు ఎదుర్కొనే సమస్యల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ప్రెగ్నన్సీ అనేది గుడ్ న్యూస్ తో మొదలై గుడ్ నోట్ తో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో గర్భిణీలు అనేక యాతనలు పడతారు. ప్రత్యేకించి, ఎండాకాలంలో ప్రెగ్నన్సీ దశ కొనసాగుతూ ఉంటే గర్భిణీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవటం ద్వారాఎండాకాలంలో గర్భిణీలు కొన్ని అసౌకర్యాలని ఎంతో సులభముగా దాటగలుగుతారు.

Pregnancy Precautions During Summer

ప్రెగ్నన్సీ దశ ఆరోగ్యంగా దాటి ప్రసవం సజావుగా జరిగి తల్లీ బిడ్డా క్షేమం అన్న వార్త వింటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ఈ కింద వివరించబడిన జాగ్రత్తలను గర్భిణీలు తీసుకుంటే తల్లీ బిడ్డా క్షేమంగా ఉంటారు. ఎండాకాలంలో గర్భిణీల అవస్థ కాస్తంత తగ్గుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయాలి:

క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయాలి:

వ్యాయామానికి సమయాన్ని కేటాయించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే, ఎటువంటి వ్యాయామాలు చేయాలో మీ వైద్యులను అడిగి తెలుసుకోండి. మీ కంఫర్ట్ జోన్ ప్రకారం వ్యాయామం చేయడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. తెల్లవారుజామున టెంపేరేచర్ తక్కువగా ఉన్న సమయంలో వ్యాయామం చేయడం ద్వారా గర్భిణీలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

సూతింగ్ స్నాక్స్:

సూతింగ్ స్నాక్స్:

ఎండాకాలం వేడిని అధిగమించడానికి ఎక్కువగా స్నాక్స్ ను తీసుకోవాలి. వాటర్ మెలన్స్, స్మూతీస్ వంటి రిఫ్రెషింగ్ స్నాక్స్ ని ఎక్కువగా తీసుకోవడం వలన ఎండ వేడిని తట్టుకోగలిగే సామర్థ్యం లభిస్తుంది. అలాగే, ఈ స్నాక్స్ అనేవి మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు మీకు ప్రశాంతతను కలిగిస్తాయి.

సేద తీర్చే పనిలో లీనమవ్వండి

సేద తీర్చే పనిలో లీనమవ్వండి

ఎండాకాలంలో బోర్ డమ్ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే కొన్ని పనులను కల్పించుకుని వాటిలో సేద తీరండి. మీ ఇంటిని కొత్తగా రాబోయే పాపాయి కోసం అలంకరించడం ప్రారంభించండి. ఇటువంటి యాక్టివిటీస్ లో లీనమవడం వలన మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఎండ వేడి మిమ్మల్ని బాధించదు.

స్పా సెషన్స్ ను పునరాలోచించండి

స్పా సెషన్స్ ను పునరాలోచించండి

స్పా సెషన్ కి వెళ్ళినప్పుడు ఓవర్ హీట్ ని చేసే సానాస్ తో పాటు హాట్ టబ్ మసాజ్ లను మీరు అవాయిడ్ చేయాలి. స్పా కి వెళ్ళినప్పుడు ఈ మెజర్స్ గురించి స్పష్టంగా వివరించండి. తద్వారా, మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నవారవుతారు.

నీళ్లు తగినన్ని తీసుకుని హైడ్రేటెడ్ గా ఉండండి:

నీళ్లు తగినన్ని తీసుకుని హైడ్రేటెడ్ గా ఉండండి:

ఎండాకాలం అనేది అనేక ప్రయాసలను తీసుకొస్తుంది. నీళ్లను తాగడం ద్వారా శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. డిహైడ్రేట్ సమస్య అనేక ఇబ్బందులను తీసుకువస్తుంది. కాబట్టి, హైడ్రేటెడ్ గా ఉండేందుకు తగినన్ని నీళ్లను తాగుతూ ఉండండి. మీతో పాటు గర్భంలో ఉన్న మీ పాపాయికి కూడా నీళ్లు అవసరమే. మీరు తగినన్ని నీళ్లు తీసుకుంటే పాపాయికి కూడా నీరు అందుతుంది.

వాపు : ఫుట్ కేర్

వాపు : ఫుట్ కేర్

ఎండాకాలంలో ఫుట్ స్వెల్లింగ్ అనేది గర్భిణీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యకు చింతించనవసరం లేదు. మీ కాళ్లకు రెస్ట్ ని ఇవ్వండి. తలగడపై పాదాలను ఆనించి ఉంచడం ద్వారా పాదాలకు తగినంత రెస్ట్ అందుతుంది. అలాగే, కుర్చునేటప్పుడు కూడా మీ పోశ్చర్ ని గమనించండి. పాదాలను పై ఉంచేలా చూసుకోండి. తీసుకునే సాల్ట్ మోతాదును తగ్గించుకోండి. ఒకవేళ ఈ స్వెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటే మెడికల్ అటెన్షన్ ను ఇవ్వడం మానుకోకండి.

ఎండతో పాటు హానికర కిరణాలు: డైరెక్ట్ సన్ లైట్ ను అవాయిడ్ చేయండి:

ఎండతో పాటు హానికర కిరణాలు: డైరెక్ట్ సన్ లైట్ ను అవాయిడ్ చేయండి:

ఎండవేడిలో బయటకు వెళ్లడాన్ని ప్రెగ్నెంట్ లేడీ అవాయిడ్ చేయాలి. లేదంటే వికారంతో పాటు డిజ్జీనెస్ వంటి అసౌకర్యాలు తలెత్తవచ్చు. డైరెక్ట్ సన్ లైట్ వలన ఫుట్ స్వెల్లింగ్ తో పాటు డీహైడ్రేషన్ సమస్య వేధించవచ్చు.

అవుట్ డోర్ యాక్టివిటీస్ : ఎండలో కాదు

అవుట్ డోర్ యాక్టివిటీస్ : ఎండలో కాదు

గర్భిణీలు కవుచ్ పొటాటోలా లేజీగా ఉండకుండా అవుట్ డోర్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఉండాలి. తమ ఆరోగ్యస్థితిని గమనిస్తూ వైద్యుల పర్యవేక్షణలో కొన్ని ఎక్సర్సైజులను చేస్తూ ఉండాలి. అయితే, ఎండాకాలంలో తెల్లవారుజామున అలాగే సాయంత్రం పూట వాకింగ్ చేయడం మంచిది. అవుట్ డోర్ యాక్టివిటీస్ అనేవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి శరీర బరువును నియంత్రణలో ఉంచుతాయి.

చల్లగా ఉండేందుకు స్విమ్మింగ్ చేయండి:

చల్లగా ఉండేందుకు స్విమ్మింగ్ చేయండి:

గర్భిణీలకు స్విమ్మింగ్ అనేది మంచి ఎక్సర్సైజులా పనిచేస్తుంది. ఎండాకాలంలో, స్విమ్మింగ్ అనేది శరీరాన్ని చల్లగా, ప్రశాంతంగా ఉంచి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. వాటర్ ఏరోబిక్స్ ను పెర్ఫామ్ చేయవచ్చు. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేసి ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

ఆరోగ్యంగా తినండి: రెగ్యులర్ మరియు ఫ్రీక్వెంట్ మీల్స్ ను ప్రిఫర్ చేయండి

ఆరోగ్యంగా తినండి: రెగ్యులర్ మరియు ఫ్రీక్వెంట్ మీల్స్ ను ప్రిఫర్ చేయండి

స్పైసీ మరియు ఆయిలీ ఫుడ్స్ ను అవాయిడ్ చేయండి. తాజా కార్బోహైడ్రేట్స్ తో పాటు పోషకాలు కలిగిన కూరగాయలను అలాగే పండ్లను తీసుకోండి. వేడిని తట్టుకునేందుకు తాజా పండ్ల రసాలను తీసుకోండి. ఎండాకాలంలో దోసకాయలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కాబట్టి, వాటిని ప్రతి రోజూ మీ డైట్ లో భాగంగా చేసుకోండి. మీ మెటబాలిజం రేట్ ను కంట్రోల్ లో ఉంచేందుకు మీల్స్ ను ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి.

లైట్ క్లాత్స్ ని ధరించండి: కూల్ గా కనిపించండి:

లైట్ క్లాత్స్ ని ధరించండి: కూల్ గా కనిపించండి:

గర్భిణీలు డార్క్ కలర్ క్లాత్స్ ని ధరించడం మానివేయాలి. అలాగే నైలాన్ లేదా పాలిస్టర్ ను ఎండాకాలంలో ధరించకూడదు. లైట్ కలర్ క్లాత్స్ ను అలాగే బరువు తక్కువగా ఉండే తేలికపాటి క్లాత్స్ ను ధరించాలి. మెటర్నిటీ గౌన్స్ మరియు మాక్సిస్ ను ధరించడం వలన గాలి బాగా ఆడుతుంది. టైట్ బట్టలను ధరిస్తే ఉక్కిరి బిక్కిరి అవుతారు. కాబట్టి, దుస్తులలో ఈ మార్పులను చేయడం ద్వారా గర్భిణీలు సౌకర్యవంతంగా ఉంటారు.

మధ్యాహ్నం కునుకులు: ఫ్రీక్వెంట్ గా రెస్ట్ తీసుకోండి

మధ్యాహ్నం కునుకులు: ఫ్రీక్వెంట్ గా రెస్ట్ తీసుకోండి

మధ్యాహ్నం నిద్రకు ప్రాముఖ్యతనివ్వండి. ఏసీను మీ శరీరానికి అనుగుణంగా ఉండే టెంపరేచర్ కు అడ్జస్ట్ చేసుకోండి. సౌకర్యవంతంగా నిద్రించండి. తగినంత నిద్ర ఉండటం వలన ఒత్తిడి తగ్గుతుంది. రెస్ట్ వలన గర్భిణీలకు ఒత్తిడి తగ్గుతుంది.

హెయిర్ అండ్ స్కిన్ కేర్: అందానికి ప్రాధాన్యతనివ్వండి

హెయిర్ అండ్ స్కిన్ కేర్: అందానికి ప్రాధాన్యతనివ్వండి

గర్భిణీలు ఫ్యాషన్ కి కూడా తగినంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎండాకాలంలో ఫ్యాషన్ ను కంఫర్ట్ జోన్ కి అనుగుణంగా పాటించండి. కాబట్టి, చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు సరైన సన్ స్క్రీన్ ను అలాగే స్కార్ఫ్ ను ధరించండి. బయటికి వెళ్ళినప్పుడు హై పోనీటైల్ లేదా బన్ లేదా సింపుల్ క్యూట్ షార్ట్ హెయిర్ కట్ ను ప్రిఫర్ చేయండి. ప్రతి సమయంలో, చల్లగా ఉండేందుకు ప్రిఫరెన్స్ చేయండి.

English summary

Pregnancy Precautions During Summer

Pregnancy Precautions During Summer,Are you feeling the kicks and pokes in your ribs and feeling that your baby is taking turns? If yes, then it is time for your baby to arrive soon. Eighth month of pregnancy is a very crucial time. You would start feeling the contractions pretty regularly, colostrum leakage in your br