గర్భధారణ సమయంలో నీరు పగలడాన్ని సూచించే చిహ్నాలు

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

గర్భధారణ ఆఖరి మూడు నెలల్లో ఉమ్మ నీరు చిమ్మడం అనేది స్త్రీలకు కంగారుకు గురిచేసి సహాయానికై పరుగులు పెట్టిస్తుంది. మూడవ త్రైమాసికంలో ఇది సాధారణంగా జరిగే విషయమే! ఉమ్మనీరు పోవడమనేది బిడ్డ జన్మించడానికి తయారుగా చెప్పే సంకేతం. స్త్రీ తాను బిడ్డకి జన్మనిచ్చే సమయం ఆసన్నమైనది అని అర్ధం. కొంతమందిలో ఉమ్మనీరు కొద్దికొద్దిగా బయటకు పోతే మరి కొంతమందిలో ఒక్కసారిగా అమ్నియోటిక్ సాక్ పగిలిపోతుంది. కొని సార్లు ఇది పెను ముప్పుగా పరిణమించవచ్చు. కనుక ముందు నుంచే ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలి.

డాక్టర్లు నిర్ధారించిన ప్రసవ తేదీ ఎల్లప్పుడూ సరైనది కాకపోవచ్చు. కొంతమంది మహిళల్లో ప్రసవం ముందుగానే జరుగుతుంది. అమ్నియోటిక్ సాక్ పగిలినప్పుడు ఒక్కసారిగా బకెట్ల కొద్దీ నీరు కాళ్ళ మధ్య నుండి క్రిందికి ప్రవహిస్తుంది. కానీ ఇలా జరుగుతుంది అని ముందుగానే ఎలా తెలుస్తుంది? కొన్ని ముందుస్తు లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

ముందుగానే తయారవ్వండి: మీకు కనుక అమ్నియోటిక్ సాక్ పగిలే అవకాశం ఉందనిపించినా కంగారు పడకండి. ఆ ద్రవం యొక్క రంగు రూపు గమనించండి. అది జరిగిన సమయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇలా జరిగిన తరువాత ఏ సమయంలో అయినా ప్రసవం జరిగే అవకాశం ఉంది.

Water Break During Pregnancy | Amniotic Fluid Pregnancy | Gush Pregnancy

గమనించండి: మీ క్రింది భాగంలో ఎటువంటి శబ్దం వినిపించినా, కొద్దికొద్దిగా ద్రవం మెల్లగా కారుతున్నట్లనిపించినా అమ్నియోటిక్ సాక్ పగిలిన చిహ్నంగా గుర్తించండి. అంటే కాక యోని ద్వారా బొడ్డు తాడు బయటకు వచ్చినట్లైతే వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి.

తెల్లని ద్రవం: నీరు పగిలినప్పుడు తెల్లని, ఎటువంటి వాసన లేని ద్రవం బయటకు వస్తుంది. అదే కనుక పసుపు రంగులో, అమ్మోనియా లేదా కుళ్ళిన గుడ్ల వాసనతో ఉంటే అది మూత్రమని గుర్తించండి.

ప్రసవ వేదనలు: కొన్నిసార్లు నీరు పగలడానికి కొన్ని గంటల ముందే ప్రసవ వేదన మొదలవుతుంది. మీకు కనుక నెప్పులు మొదలయితే ప్రసవానికి తయారుగా ఉండండి.

డాక్టర్ ను సంప్రదించండి: ద్రవాలు కనుక ఆకు పచ్చగా లేక గోధుమ రంగులో ఉంటే సత్వరమే డాక్టర్ ని సంప్రదించండి. ఇలా కనుక జరిగితే గర్భ సంచిలోనే బిడ్డకు మలవిసర్జన జరిగినట్టు అర్ధం

హాస్పిటల్ కు వెళ్లేెందుకు బ్యాగ్ సర్దుకోండి:మీకు నొప్పులు ప్రారంభమవ్వడానికి మునుపే బ్యాగ్ సర్దిపెట్టుకోవడం మంచిది. లేకుంటే నీరు పగిలిన లక్షణాలు కనిపించిన వెంటనే హాస్పిటల్ బ్యాగ్ సర్దుకుని తయారుగా ఉండండి.

ఇవి గర్భధారణ సమయంలో నీరు పగలడానికి సంబంధించిన కొన్ని చిహ్నాలు. వీటిని గమనించినప్పుడు భయపడకుండా ఉంటే తల్లికి బిడ్డకు క్షేమం. మీ భాగస్వామి యొక్క సహాయం తీసుకోండి. నీరు పగిలినప్పుడు డాక్టర్ ను సంప్రదిస్తే ఆ ద్రవం యొక్క లక్షణాలను బట్టి అది అమ్నియోటిక్ ద్రావమా? లేక తెల్ల బట్టా? అని డాక్టర్ నిర్ధారిస్తారు.

English summary

Water Break During Pregnancy | Amniotic Fluid Pregnancy | Gush Pregnancy

Water Break During Pregnancy , Amniotic Fluid Pregnancy, Gush Pregnancy,Here are few signs that will help you know that your water has broke.
Story first published: Wednesday, March 14, 2018, 17:30 [IST]