For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు వీటికి దూరంగా ఉండాలి

|

మాతృత్వాన్ని పొందాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. నిజానికి ఇది ఒక వరం. గర్భం దాల్చిన దగ్గర నుంచి గర్భస్థ శిశువు గురించే గర్భిణీ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తినే ఆహారంపై శ్రద్ధ పెడతారు. కదలికలపై జాగ్రత్త వహిస్తారు. చదివేవాటిపై అలాగే ఎమోషన్స్ ను కూడా జాగ్రత్తగా మానిటర్ చేస్తారు. వీటన్నిటికీ ఒక మంచి కారణం ఉంది. మీ శరీరంలో ప్రాణం పోసుకుంటున్న చిన్ని ప్రాణిని భూమిమీదకు ఆరోగ్యంగా ఆహ్వానించడమే మీ ఉద్దేశ్యం. చిన్న చిన్న పొరపాట్ల వలన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మీరు ప్రయత్నిస్తారు.

గర్భం దాల్చిన తరువాత మీ జీవితంలో గొప్ప మార్పులు చోటుచేసుకుంటాయి. ఆహారం విషయంలో మార్పులు అవసరమవుతాయి. బంధుమిత్రుల నుంచి అలాగే కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువగా సలహాలు అందుతాయి. తన గర్భంలో ప్రాణం పోసుకుంటున్న శిశువుకు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

Things That You Must Not Do When Pregnant

ఈ విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. అలాగే, కొన్ని విషయాలను ప్రెగ్నెన్సీ సమయంలో అవాయిడ్ చేయవలసి వస్తుంది. ముఖ్యంగా డైట్ విషయంలోకి వస్తే ఆల్కహాల్ ను అవాయిడ్ చేయాలి. అలాగే కెఫైన్ మరియు స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. వీటితో పాటు మీరు కొన్ని యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు.

ఈ రోజు గర్భిణీలు తమ ఆరోగ్యంతో పాటు గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ చదవడం ద్వారా మీకు ఈ జాగ్రత్తలపై అవగాహన ఏర్పడుతుంది.

 • క్రేజీ అమ్యూజ్మెంట్ పార్క్ లో రైడ్ ని ప్రయత్నించవద్దు

• క్రేజీ అమ్యూజ్మెంట్ పార్క్ లో రైడ్ ని ప్రయత్నించవద్దు

స్ట్రెస్ ని తగ్గించుకునేందుకు అమ్యూజ్ మెంట్ పార్క్ లు చక్కటి డెస్టినేషన్స్ లా కనిపిస్తాయి. అయితే, గర్భిణీలు ఈ ప్రదేశాలలో రైడింగ్ ను ఎట్టిపరిస్థితులలోనూ ప్రిఫర్ చేయకూడదు. రోలర్ కోస్టార్ రైడ్స్ నుంచి దూరంగా ఉండాలి. వాటర్ స్లైడ్స్ తో పాటు ఆకస్మిక కుదుపులున్న మిగతా రైడ్స్ ను కూడా అవాయిడ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.

లేదంటే, గర్భస్థ శిశువుకు గాయమయ్యే ప్రమాదం ఎదురవవచ్చు. లేదా మిస్ క్యారేజ్ కు కూడా గురయ్యే ప్రమాదం తలెత్తవచ్చు. రోటరీ మోషన్ కలిగిన రైడ్స్ ను కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఇవి కూడా మీకు డిజ్జీ నెస్ ను కలిగిస్తాయి. తద్వారా, మీరు పడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

• స్పోర్ట్స్ లో పాల్గొనవద్దు:

• స్పోర్ట్స్ లో పాల్గొనవద్దు:

గర్భిణీలకు అన్ని రకాల స్పోర్ట్స్ హానికరం కాకపోయినా కాంటాక్ట్ స్పోర్ట్స్ కి గర్భిణీలు దూరంగా ఉండటం మంచిది. ఫుట్ బాల్, క్రికెట్ మరియు వాలీబాల్ వంటి కాంటాక్ట్ స్పోర్ట్స్ ను అవాయిడ్ చేయాలి. వీటిలో గాయలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బాల్ వలన గాని లేదా ఇతర ప్లేయర్స్ వలన గాని గాయలవుతాయి. లిగమెంట్ లేదా మజిల్ ఇంజురీ సమస్య తలెత్తే ప్రమాదం కూడా ఉంది.

• బైసైకిల్ ను రైడ్ చేయకండి:

• బైసైకిల్ ను రైడ్ చేయకండి:

సైక్లింగ్ అనేది గొప్ప ఎక్స్పీరియన్స్. అయితే, గర్భిణీలు సైక్లింగ్ కు దూరంగా ఉండాలి. ఈ యాక్టివిటీస్ ను సాధారణంగా ఉండే రోజులలోనే ప్రిఫర్ చేయడం మంచిది. గర్భిణీలు వీటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. సైకిల్ ను రైడ్ చేస్తున్నప్పుడు గర్భిణీలు బాలన్స్ ను కోల్పోయే ప్రమాదం ఉంది. డిజ్జీనెస్ వలన కూడా బాలన్స్ తప్పే ప్రమాదం ఉంది.

గర్భిణీగా ఉన్నప్పుడు బైక్ మీంచి పడిపోవడం అనేది అత్యంత ప్రమాదకరం. బిజీ రోడ్ పై లేదా దారి సరిగ్గా లేని ప్రాంతంలో ఇలా జరిగే అవకాశం మరింత ప్రమాదకరం. ఒకవేళ పెడలింగ్ పై తీవ్రంగా మనసుపడితే స్టేషనరీ బైక్స్ ను ప్రిఫర్ చేయండి.

• బరువును ఎత్తడం వంటి వ్యాయామాలకు అలాగే పొట్టపై ఒత్తిడిని కలిగించే వ్యాయామాలకు దూరంగా ఉండండి:

• బరువును ఎత్తడం వంటి వ్యాయామాలకు అలాగే పొట్టపై ఒత్తిడిని కలిగించే వ్యాయామాలకు దూరంగా ఉండండి:

గర్భం దాల్చిన తరువాత యాక్టివ్ లైఫ్ స్టైల్ ను పాటించడం మంచిదే. అయితే, బరువును ఎత్తడం ఆలాగే పొట్టపై ఒత్తిడిని కలిగించడం వంటి వ్యాయామాలకు దూరంగా ఉండండి. ఇవన్నీ గర్భిణీలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అలాగే గాయాన్ని కూడా కలిగించే ప్రమాదం ఉంది. వీటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

• పరిగెత్తకండి:

• పరిగెత్తకండి:

గర్భం దాల్చకముందు మీరు పరుగుని ఎంజాయ్ చేసి ఉండుంటారు. ఐతే, గర్భం దాల్చాక మీరు ఈ వ్యాపకం నుండి దూరంగా ఉండాలి. ముఖ్యంగా, రెండవ అలాగే మూడవ ట్రైమిస్టర్స్ లో మీరు పరుగులు పెట్టకూడదు. ఎందుకంటే, రన్నింగ్ కు బాలన్స్ ఎక్కువగా అవసరం. గర్భం దాల్చాక మీకు బాలన్స్ మిస్ అవుతుంది. మీరు పడిపోయి గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే, మీరు హైడ్రేటెడ్ గా ఉండాలి. మీ శరీరం ఓవర్ హీట్ అవకూడదు.

• కష్టమైన భంగిమలు కలిగిన యోగాసనాలను ప్రయత్నించకండి:

• కష్టమైన భంగిమలు కలిగిన యోగాసనాలను ప్రయత్నించకండి:

యోగాను సాధన చేయడం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు. ఇది మీకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, గర్భం దాల్చాక కొన్ని యోగాసనాలు దూరంగా ఉండాలి. కష్టమైన భంగిమలు కలిగిన యోగాసనాలను అవాయిడ్ చేయాలి. ఈ జాగ్రత్తలను తీసుకుంటే మీ ప్రెగ్నెన్సీ దశ మీకు మధురానుభూతులను అందిస్తుంది. మీరు పండంటి పాపాయికి జన్మనిస్తారు.

English summary

Things That You Must Not Do When Pregnant

Pregnancy is that time of a woman's life when the unborn baby becomes the centre of all concern. You watch what you eat, how you move, what you read and even your emotions are closely monitored. It is all for a good reason. The tiny life that is taking root within you can be affected by every little thing you do or sometimes, don't do.
Story first published: Sunday, July 22, 2018, 16:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more