గర్భధారణ సమయంలో మూత్ర విసర్జన ఆపుకొవడం కోసం పాటించవలసిన చిట్కాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక స్త్రీ తాను గర్భవతియని తెలుసుకున్నప్పుడు, ఆమెలో తెలియని అనంతమైన ప్రేమను పుట్టబోయే బిడ్డపై చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది.

కానీ గర్భధారణ అనేది మహిళలలో చాలా కష్టతరమైన కాలము. వారు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు చేయకూడని పనుల గూర్చి (లేదా) తినకూడని ఆహార పదార్థాలు గూర్చి గల అన్ని రకాల విషయాలను ముందుగానే హెచ్చరించారు. ఇంట్లో ఉన్న ఇతర మహిళలు, అనగా గర్భిణుల తల్లులు, గర్భిణుల కోసం నిర్దేశించబడిన ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారం పనిచేస్తారు. అలా చాలామంది మహిళలు గర్భవతుల కోసం తమ పూర్తి సమయాన్ని వెచ్చిస్తారు.

మరింత కిందకు దిగజార్చాబడే విషయమేమంటే, గర్భిణీ స్త్రీలు కొన్ని చికాకులను మరియు ఇబ్బందికరమైన అసౌకర్యాలను ఎదుర్కొంటారు. అలాంటి వాటిలో మూత్ర విసర్జనను ఆపుకోలేకపోవడం అనేది ఒకటి. అంటే, మూత్రము అసంకల్పితముగా రావడం అని అర్థం.

గర్భిణీ స్త్రీలలో ఉండే 'కటి కండరములు' చాలా మృదువైనవి, అలానే వారి కడుపులో ఉన్న బిడ్డ బరువు - మూత్రాశయం మీద ఒత్తిడిని కలిగించును. స్త్రీల వయస్సు ప్రకారం, ఆమె శరీర ద్రవ్యరాశి సూచిక అనేది ఆమె గర్భధారణ సమయంలో మూత్రమును ఆపుకొనలేని పరిస్థితికి దోహదపడే అంశాలుగా చెప్పవచ్చు.

ఒత్తిడి, అధికమైన చురుకుతనము వంటి ఈ రెండింటి ద్వారా గర్భధారణ సమయంలో మూత్రము ఏర్పడే ఈ అసహజమైన పరిస్థితికి కారణమవుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, దీనికి ఎలాంటి చికిత్స లేదు. కానీ ఈ సమస్యను అధిగమించడం ఎలాగో మనము ఇప్పుడు తెలుసుకుందాం.

Urinary Incontinence During Pregnancy, Deal With Urinary Incontinency, Pregnancy Care Tips,

జాబితాను సిద్ధం చేసుకోండి :

మీరు గర్భధారణ సమయంలో ఉన్నప్పుడు మూత్రమును ఆపుకొనలేని వ్యవహారంతో వ్యవహరించేటప్పుడు, మీరు బాత్రూమ్కి వెళ్ళే సమయాల తాలూకా జాబితాను సిద్ధం చేయండి. కొంతకాలం తర్వాత, మీరు ఏ సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లలో (లేదా) ఆపుకోవాలో అనే విషయాలను మీరే బాగా తెలుసుకోవచ్చు.

మూత్రాశయమునకు శిక్షణ:

గర్భధారణ సమయంలో మూత్రమును ఆపుకొనలేని పరిస్థితికి చికిత్సను అందించడంలో ఇది ఒక రకము, ఇందులో మీరు బాత్రూంలోకి వెళ్ళే సమయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మొదటగా, మీరు బాత్రూంకి వెళ్ళిన సమయాన్ని బట్టి, ఆ తర్వాత బాత్రూంకి వెళ్లే సమయాన్ని కొద్దికొద్దిగా పెంచుకుంటూ ఉండండి.

పాసరీ శస్త్రచికిత్స :

ఇది మహిళలలో మూత్రాన్ని నిరోధించడానికి (లేదా) కటి కండరాలను బలోపేతం చేయడానికి ఉపయోగించే పరికరం. మీ గర్భధారణ సమయంలో మూత్రమును ఆపుకోలేని పరిస్థితుల్లో ఈ పద్ధతి మీకు సహాయం చేస్తుంది. కానీ ఈ పాసరీ శస్త్రచికిత్స అనేది కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే ఉపయోగంలో ఉంది.

మందులు :

మూత్రమును ఆపుకొనలేని మీ పరిస్థితికి సహాయపడే కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ, గర్భిణీ స్త్రీలు మొదటిసారి తమ డాక్టర్ని సంప్రదించకుండా ఇలాంటి ఔషధాలను ఉపయోగించకూడదు.

కేగెల్ వ్యాయామాలు:

గర్భధారణ సమయంలో మూత్రమును ఆపుకొనలేని పరిస్థితి నుంచి బయటపడేందుకు, కేగెల్ వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి. ఇది మీ మూత్ర సమయాల్లో, మూత్రమును కొంత సమయం వరకు నియంత్రిస్తుంది. ఇది కటి కండరాలను కూడా బాగా బలపరుస్తుంది.

మీ శరీర బరువు పెరుగుట:

గర్భధారణ సమయంలో మహిళలు బరువు పెరగడం అనేది అత్యంత ఆవశ్యకము. కానీ ఇది ఉత్తమమైనదిగాను, మితమైనదిగానూ ఉండాలి. గర్భధారణ సమయంలో ఈ అదనపు బరువు వల్ల మూత్రమును ఆపుకొనలేని పరిస్థితికి దారితీస్తుంది.

మీకు శక్తినిచ్చే పానీయాలను త్రాగండి:

మీరు ఎదుర్కొంటున్న ఈ ప్రస్తుత పరిస్థితికి భయపడి చాలామంది స్త్రీలు తీసుకోవలసిన అత్యంత ఆవశ్యకమైన పానీయాలను తీసుకోవడం మాని వేస్తున్నారు. కాని ఇది మీలో డీహైడ్రేషన్కు కారణం అవుతుంది అలాగే మీ మూత్రాశయమును చికాకు పెడుతుంది. కాబట్టి మీరు తప్పక ఈ పానీయాలను తాగాలని గుర్తుంచుకోండి.

వీటిని మానివేయండి :

ఈ పరిస్థితి నుంచి మీరు బయట పడటానికి కొన్ని రకాల పానీయాలను నివారించవలసి ఉంది. వాటిలో కాఫీ మద్యము, ఇతర చల్లని పానీయాలు ఉన్నాయి. వాటితోపాటు సిట్రస్ ఆమ్లాలను కలిగిన పానీయాలను కూడా తాగడం మానేయండి.

శానిటరీ ప్యాడ్స్ :

గర్భాశయ సమయంలో మూత్రాశయపు లోపలి నుంచి మూత్రము బయటకు రాకుండా శోషించటానికి శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ టాంపాన్లు మూత్రాన్ని గ్రహించవు, అలాగే ఇవి మీ యోనికి చికాకును కలిగిస్తాయి కాబట్టి వీటిని ఉపయోగించకండి.

English summary

Urinary Incontinence During Pregnancy | Deal With Urinary Incontinency | Pregnancy Care Tips

When a woman discovers that she is pregnant, there arises a glow within her out of the boundless love for her unborn baby.But pregnancy is also a difficult time for women. They have to be careful at all times. Pregnant women are warned about all the things they shouldn't do or shouldn't eat. Other women in the house, usually their own mothers, will work out a schedule for them. On top of all that many women will be juggling a full time career too.
Story first published: Thursday, March 15, 2018, 17:00 [IST]