For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒవ్యులేషన్ సమయంలో ఫాలికల్ సైజ్ ప్రాధాన్యత

ఒవ్యులేషన్ సమయంలో ఫాలికల్ సైజ్ ప్రాధాన్యత

|

ఆరోగ్యకరమైన రీప్రొడక్టివ్ సైకిల్ ని మెయింటెయిన్ చేసేందుకు ప్రతి మహిళ బయలాజికల్ సైకిల్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న విధానాల గురించి కనీస అవగాహన కలిగి ఉండాలి. మొదటగా, అసలీ ఫాలికల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలా మంది మహిళలు ఈ ఫాలికల్స్ ను ఎగ్స్ గా భావిస్తారు. అయితే, ఫాలికల్స్ అనేవి ఎగ్స్ కావు. అసలీ ఫాలికల్స్ అంటే ఏంటి? ఒవ్యులేషన్ లో వీటి పాత్ర ఏంటి? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.

ఫాలికల్స్ అంటే ఏంటి?
ద్రవంతో నిండిన సాక్ లో ఊసైట్ కలిగి ఉంటుంది. ఇది మెచ్యూర్ అయినప్పుడు ఎగ్ గా మారుతుంది. మెచ్యూర్డ్ ఎగ్ యొక్క సాధారణ ఎదుగుదలకు అవసరమైన ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ని ఉత్పత్తి చేసే మిగతా సెల్స్ యొక్క పనితీరులో ఫాలికల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

What Are Follicles? Number, Growth And Other Characteristics

ఓవరీయన్ సైకిల్
ఈ సైకిల్ లో ఫాలిక్యులార్ ఫేజ్, ఒవ్యులేషన్ మరియు కార్పస్ ల్యూటియమ్ (ల్యూటియల్ ఫేజ్) లు కలవు. ఫిమేల్ ఎంబ్రియో లైఫ్ యొక్క ప్రారంభ వారాలలో ఎగ్స్ యొక్క ఎండోమెంట్ అనేది నిర్ణయించబడుతుంది. మొదటి మెన్స్ట్రువేషన్ నుంచి ప్రతి సైకిల్ లో ఎగ్ అనేది సెలెక్ట్ అవుతుంది. మొదటి సెలక్షన్ లో ఎగ్స్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది. రాను రాను, తరువాతి సైకిల్స్ లో ఎగ్స్ క్వాలిటీ అనేది తగ్గుముఖం పడుతుంది. అందువలన, వయసై పోయిన మహిళలు గర్భం దాల్చడానికి ఇబ్బందికి గురవుతారు. అందువలన, మిస్ క్యారేజ్ రేట్ కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

సంఖ్య మరియు లక్షణాలు
ఫిమేల్ ఫెర్టిలిటీ గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు మొదటగా ఒవేరియన్ రిజర్వ్ గురించి అవగాహన తెచ్చుకోవాలి. హార్మోనల్ అనాలిసిస్ (ఏ ఎం హెచ్ హార్మోన్, ఎల్ హెచ్, ఎఫ్ ఎస్ హెచ్, ఏస్ట్రాడాయిల్ వంటి వాటిని) అంచనా వేయడం అలాగే వెజీనల్ అల్ట్రా సౌండ్ ద్వారా ఒవేరియన్ రిజర్వ్ గురించి అవగాహన అనేది లభిస్తుంది. ఒవేరియన్ రిజర్వ్ ను మెన్స్ట్రువల్ సైకిల్ లోని (రెండవ రోజు నుంచి ఐదవ రోజు వరకు) ఒక ఓవరీకి ఎన్ని ఫాలికల్స్ వస్తాయన్నా అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అంచనా వేయవచ్చు. ఈ ఫాలికల్స్ ను ఆంట్రల్ అనంటారు. అల్ట్రా సౌండ్ అనేది ఈ ఫాలికల్స్ వృద్ధి మరియు ఎదుగుదలను స్పాంటేనియస్ సైకిల్ అలాగే స్టిమ్యులేటెడ్ సైకిల్ లో గమనించేందుకు తోడ్పడుతుంది.

ఒక మహిళలో తగినంత ఒవేరియన్ రిజర్వ్ ఉందని ఆంట్రల్ ఫాలికల్స్ సంఖ్యను బట్టి నిర్ధారణకు రావచ్చు. ఒకవేళ ఈ కౌంట్ అనేది 6 నుంచి 10 లోపు ఒవేరియన్ రిజర్వ్ సాధారణ స్థాయిలో ఉందని అర్థం. 6 కంటే సంఖ్య తక్కువగా ఉంటే ఒవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉందని తెలుస్తుంది. ఈ కౌంట్ అనేది 12 కంటే ఎక్కువగా ఉంటే ఒవేరియన్ రిజర్వ్ ఎక్కువగా ఉందని అర్థం. ఈ దశలో ఫాలిక్యులార్ సైజ్ అనేది 2 నుంచి 10 మిల్లీమీటర్లు ఉంటుంది. తక్కువ ఒవేరియన్ రిజర్వ్ కలిగిన మహిళలు ఎటువంటి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కైనా తక్కువగా స్పందిస్తారు. మరోవైపు, ఒవేరియన్ రిజర్వ్ ఎక్కువగా ఉన్న మహిళలు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కు ఎక్కువగా స్పందిస్తారు.


ఒవ్యులేషన్ సమయంలో ఫాలికల్ సైజ్ ఎదుగుదలకు అవసరమయ్యే సమయం

సాధారణ పరిస్థితులలో, సహజమైన సైకిల్ అనేది ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు డామినంట్ ఫాలికల్ ను ఆంట్రల్ ఫాలికల్స్ నుంచి సేకరిస్తారు. డామినెంట్ ఫాలికల్ అనేది ఇతర ఫాలికల్ కంటే సైజ్ లో అలాగే వృద్ధి రేట్ లో భిన్నంగా ఉంటుంది. మెచ్యూర్ ఫాలికల్ అనేది ఒవ్యులేట్ అవడానికి సిద్ధమవుతుంది. మిగతావి క్రమేణా చనిపోతాయి లేదా అదృశ్యమవుతాయి. ఒవ్యులేషన్ అవడానికి ముందు, డామినెంట్ ఫాలికల్ యావరేజ్ డయామీటర్ అనేది దాదాపు 22 నుంచి 24 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఓవ్యులేషన్ ను ఎంతో సులభంగా గుర్తించవచ్చు.

హార్మోనల్ ట్రీట్మెంట్స్ జరిగేటప్పుడు దాన్ని స్టిమ్యులేటెడ్ సైకిల్ గా పరిగణిస్తారు. ఈ ప్రాసెస్ లో ఆంట్రల్ ఫాలికల్స్ అన్నీ వృద్ధి చెందుతాయి. అయితే, గ్రోత్ రేట్ అనేది భిన్నంగా ఉంటుంది. మెజారిటీ అనేవి 18 మిల్లీమీటర్ల సైజ్ కు చేరినప్పుడు హెచ్ సి జీని హార్మోన్ రూపంలో అడ్మినిస్టర్ చేస్తారు. అదే ఒవ్యులేషన్ ను ప్రేరేపిస్తుంది.

ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ లో ఈ హార్మోన్ ని శరీరంలోకి పంపించిన 36 గంటల తరువాత ఎగ్స్ ను సేకరిస్తారు. బాగా మెచ్యూర్ అయిన ఎగ్స్ ను సేకరించడమే ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ప్రధాన ఉద్దేశ్యం. వాటిని స్పెర్మ్ చేత ఫెర్టిలైజ్ చేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే ఫాలికల్ లో ప్రతీ సారి మెచ్యూర్ ఎగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము.

ఫాలిక్యులార్ మానిటరింగ్:

ఒవేరియన్ ఫాలికల్స్ కి సంబంధించి సీరియల్ అల్ట్రాసోనిక్ మానిటరింగ్ జరుగుతుంది. ఇది ఎగ్స్ యొక్క మెచ్యురేషన్ ప్రాసెస్ ను గమనించేందుకు తోడ్పడుతుంది. ఈ ప్రొసీజర్ అనేది ఎగ్ ఎదుగుదలకు తోడ్పడే ఫాలికల్ యొక్క సైజ్ ను గమనించేందుకు సహకరిస్తుంది. యుటెరిన్ లైనింగ్ థిక్నెస్ ను తెలుసుకునేందుకు కూడా ఈ విధానం తోడ్పడుతుంది.

ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ను కోరే మహిళలు లేదా ఫెర్టిలిటీ మెడికేషన్ ను తీసుకుంటున్న వారిలో ఫాలికల్ ని మానిటర్ చేయాలి. తద్వారా, ట్రీట్మెంట్ కు వారెంత రెస్పాండ్ అవుతున్నారో తెలుసుకోవచ్చు. తద్వారా, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఆరోగ్యకరమైన పద్దతిలో సాగుతుంది. ఒవ్యులేట్ అవుతున్న ఎగ్స్ సంఖ్యను అలాగే ఈస్ట్రాడాయిల్ స్థాయిని గమనించడం ముఖ్యం. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కు మహిళ ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు అల్ట్రా సౌండ్ ఎగ్జామినేషన్ తో పాటు హార్మోన్ లెవెల్స్ స్థాయిలను పరిగణలోకి తీసుకోవాలి.

మహిళ ఈ ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అయ్యే తీరును పరిగణలోకి తీసుకుని ఫెర్టిలిటీ మెడికేషన్ డోస్ ను అడ్జస్ట్ చేస్తారు. ఈస్ట్రాడియోల్ లెవెల్స్ అనేవి మరీ ఎక్కువగా చేరకూడదు. అలా చేరితే ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం తలెత్తుతుంది.

ఫాలికల్ మానిటరింగ్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మెచ్యూర్ అయిన ఎన్ని ఎగ్స్ ఒవ్యులేట్ అవడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుసుకోవడం. అదే సమయంలో ఒవ్యులేషన్ పద్దతి సజావుగా సాగేలా చూడటమనేది ఫాలికల్ మానిటరింగ్ ప్రధాన ఉద్దేశ్యం. ఎగ్స్ మెచ్యూర్ అయినప్పుడు మహిళ కన్సీవ్ అవడానికి డాక్టర్లు కొన్ని విధానాలను తెలుపుతారు. లేదా ఇంట్రా యుటెరైన్ ఇస్నేమినేషన్ప్రాసెస్ గురించి వివరిస్తారు. ఇన్ వట్రో ఫెర్టిలైజేషన్ సైకిల్ ను ఎంచుకుంటే ఈ స్టేజ్ లో ఎగ్ కలెక్షన్ జరుగుతుంది.

ఫాలిక్యులార్ మానిటరింగ్ సమయంలో మూడు లేదా నాలుగు సార్లు క్లినిక్ ను సందర్శించాల్సి వస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్ లోని రెండవ రోజు మొదటి స్కానింగ్ జరుగుతుంది. ఆ తరువాత ఆరవ అలాగే తొమ్మిదవ రోజున స్కాన్స్ జరుగుతాయి. ఈ స్కాన్ రిజల్ట్స్ ను దృష్టిలో పెట్టుకుని తదుపరి స్కాన్స్ ను షెడ్యూల్ చేస్తారు.

English summary

What Are Follicles? Number, Growth And Other Characteristics

To maintain a healthy reproductive cycle, it's important that every woman is aware about the processes involved in the biological cycle. To start with, it is crucial to know what exactly follicles are. One of the most common confusions among women is that follicles are eggs. This belief is entirely incorrect. Read on to know what exactly follicles are and what role it plays in ovulation.
Story first published:Friday, August 3, 2018, 23:05 [IST]
Desktop Bottom Promotion