TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
గర్భనిరోధక మాత్రల గురించి మరి కొన్ని వాస్తవాలను మీరు తెలుసుకోండి !
స్త్రీ, పురుషులిద్దరూ ఒకరికి ఒకరు చాలా భిన్నంగా ఉంటారు. అందులో ఒకరు కలిగి ఉన్న బ్యాంకు బ్యాలెన్సు గురించి మరియు గాడ్జెట్లు, ఇతర సాంకేతిక అంశాల గురించి చింతించేవారు కాగా; మరొకరు జీవితంలో చాలా ముఖ్యమైన విషయాల గురించి అనగా గర్భనిరోధక పద్ధతులను ఉపయోగించడం ఎంతవరకు సురక్షితం అనే అంశము గూర్చి భయపడుతున్నారు.
మహిళలు లైంగికంగా చురుకుగా పాల్గొని, లైంగిక పరిపక్వతకు చేరుకున్న తర్వాత ఏర్పడే గర్భస్రావం అనేది మహిళల జీవితంతో ముడిపడి ఉన్న ముఖ్యమైన అంశము. లైంగిక చర్య గూర్చి భాగస్వాములు చురుకుగా చర్చించుకోవలసిన విషయమే అయినా పురుషులకు గర్భనిరోధక ప్రాముఖ్యత గురించి ఎక్కువ జ్ఞానం లేకపోవడం వల్ల, ఆ బాధ్యతను మహిళలు తమ చేతుల్లోకి తీసుకోవాలి. (మేము చెప్పదలచుకున్న విషయం మీకు అర్థమైందని భావిస్తున్నాం!)
లైంగిక అంశము మరియు దానికి సంబంధించి ఏదైనా విషయము గూర్చి సామాజిక నిషేధం ఉన్న కారణంగా, మహిళలు న్యాయనిర్ణేతగా వ్యవహరించేందుకు తరచుగా భయపడటం వల్ల సురక్షితమైన గర్భనిరోధక పద్ధతుల గూర్చి తెలుసుకోవడానికి, డాక్టర్ నుండి సరైన సలహాలను తీసుకోరు.
అందువలన, వారు తమకు తాముగానే గర్భనిరోధకత పై స్వీయ నియంత్రణను సూచించే అంశాలను ప్రయత్నించండి. గర్భనిరోధకతకు సంబంధించి టీవీలో వచ్చే ప్రకటనలు మరియు ఇంటర్నెట్లో లభించే విషయాల వల్ల మరింత జ్ఞానాన్ని సులభంగా పొందవచ్చు
మార్కెట్లో ఈ గర్భనిరోధక మాత్రలు చాలా సులభంగానూ మరియు విస్తృతంగానూ అందుబాటులో ఉన్నాయి, అలా వాటి యొక్క వినియోగ అవకాశాలను మరింత పెంచుతుంది. జంటలుగా ఉన్న వారు ఈ గర్భనిరోధక పద్ధతులను చాలా సులభంగా అనుసరించవచ్చు.
లైంగిక చర్యలో చురుకుగా ఉన్న మహిళలు ఈ అవాంఛిత గర్భం నుండి దూరంగా ఉండటం కోసం గర్భనిరోధక మందులను వాడుతున్నారు. ఈ మందులు మానవ శరీరంలో ,అండోత్సర్గ ప్రక్రియను ప్రేరేపించే ఈస్ట్రోజెన్ (లేదా) ప్రోజెస్టిన్లను అణచివేయడం ద్వారా పని చేస్తాయి.
అండాశయము నుండి విడుదలైన గుడ్లను ముందుకు వెళ్ళనివ్వకుండా అక్కడే నిరోధించడం ద్వారా ఫలదీకరణ ప్రక్రియను నిరోధిస్తుంది. ఈ గర్భ నిరోధక మందులు మన శరీరంలో ఉన్న హార్మోన్లతో ప్రతి చర్యను చూపడం వలన, వీటిని మనమే స్వయంగా వాడటం చాలా ప్రమాదకరం ఎందుకంటే, ఏవైనా ప్రమాదాలు జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
గర్భస్రావ మాత్రలను తీసుకునే విషయంలో తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి.
1) గర్భనిరోధక మాత్రలలో చాలా రకాలు ఉన్నాయి:
మీ స్నేహితురాలు సిఫార్సు చెయ్యబడిన ఒక ప్రత్యేకమైన బ్రాండ్ కలిగిన గర్భనిరోధక మాత్రలు అనేవి మీకు సరిగా పని చేయకపోవచ్చు. ఎందుకంటే మీ శరీరం ఆమె శరీరం కన్నా భిన్నంగా ఉంటుంది మరియు ఆమె మీద అవి ప్రభావవంతంగా పని చేయవచ్చు, అలా మీ విషయంలో జరగకపోవచ్చు. ఈ గర్భనిరోధక మాత్రలు ఈస్ట్రోజెన్ను కలిగి ఉంటాయి మరియు వాటి యొక్క ప్రతికూల ప్రభావానికి మహిళలు భయపడుతూ ఉంటారు. అందువలన, మీ శరీరానికి సరిపడ మాత్రలను వాడటం కోసం, ముందుగా డాక్టర్ను సంప్రదించడం చాలా ఉత్తమము.
2) అవి 99% ప్రభావవంతమైనవి :
ఈ గర్భనిరోధక మాత్రలు బాగా సమర్థవంతంగా పనిచేస్తాయన్న ప్రాచుర్యమును బాగా పొందాయి. కానీ మీరు అంతటి ఖచ్చితత్వం గల ఫలితాలను పొందడానికి, డాక్టర్ సూచించిన విధంగా ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలి. ఈ మందులను రోజుల్లో సూచించబడిన నిర్దిష్టమైన సమయానికి, ప్రతిరోజు ఖచ్చితంగా తీసుకోవాలి. అలా మీరు ఖచ్చితమైన షెడ్యూల్ను తప్పక పాటించండి.
3) అవి STDs నుండి మిమ్మల్ని కాపాడలేదు:
పైన చెప్పిన వాక్యము, ఈ మాత్రలు యొక్క క్రింది భాగంలో వ్రాయబడి ఉంటుంది. అయినప్పటికీ, ఇవి గర్భధారణ అవకాశాలను నిరోధిస్తుంది కానీ, హెర్పెస్ (లేదా) ఎయిడ్స్ వంటి STDs లకు వ్యతిరేకమైన రక్షణను అందించలేవు. కాబట్టి మీరు ఇతరులతో లైంగిక చర్యలో పాల్గొంటే గనక మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ( మీ నమ్మకమైన భాగస్వామితో తప్ప! )
4) అవి మీ రుతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తాయి :
ఈ గర్భ నిరోధక సాధనాలు, పీరియడ్స్ సక్రమంగా లేని మహిళలకు ఒక వరం లాంటిది. ఈ గర్భనిరోధక మాత్రలు వాడే వారి రుతుచక్రాన్ని చక్కగా నియంత్రిస్తాయి. వాస్తవానికి, 21 రోజుల సాధారణ ఋతుచక్రం తర్వాత ఈ మాత్రలను కొనసాగించడం వల్ల, రాబోయే కాలంలో మీరు హాజరు కావలసిన ముఖ్యమైన కార్యక్రమానికి, మీకు ఎదురయ్యే పీరియడ్స్ను మరింత ఆలస్యం చేస్తుంది.
5) ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది :
పాలిసిస్టిక్ ఒవారీస్, ఎండోమెట్రియోసిస్ మరియు మోటిమలు వంటి అనేక ఇతర వైద్య రుగ్మతలను చికిత్స చేయడానికి కూడా ఈ గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తున్నారు. అలాగే సంతానోత్పత్తికి సంబంధించిన కొన్ని పరిస్థితులకు కూడా వీటిని ఉపయోగించి చికిత్స చేయవచ్చు.
6) వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి :
గర్భనిరోధక మాత్రలను వాడాలని నిర్ణయించుకున్న ఆడవాళ్లందరికీ ఇది ఒక చేదు నిజం. మీరు ఈ మాత్రలను వాడటం వల్ల రొమ్ములలో పరిపక్వత లేకపోవడం, వాంతులు, వికారం, మైగ్రేన్ల వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే అవకాశముంది. ఈ మాత్రలను సరైన రీతిలో వాడకపోవడం వల్ల మీరు ఆకస్మికంగా బరువు పెరగటం లేదా తగ్గటం కూడా జరుగుతాయి.
7) గర్భధారణను తొందరగా పొందలేరు :
ఒకవేళ మీరు గర్భం పొందడానికి ఈ మాత్రలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నప్పుడు, మీరు త్వరగా గర్భవతి కాలేరు. మీ శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరడానికి మరికొంత సమయం అవసరమవుతుంది. మీ శరీరతత్వాన్ని బట్టి ఆ సమయం కొన్ని రోజులు పట్టవచ్చు (లేదా) కొన్ని నెలలు పట్టవచ్చు.
8) ఇవి మీరు వాడే ఇతర మందుల మీద ప్రభావం చూపిస్తుంది :
ఇతర ఔషధాలను లేదా మందులు వాడడానికి ముందు మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది, ఎందుకంటే మీరు వినియోగించే ఈ మందులు గర్భస్రావ మాత్రాలకు అడ్డంకిగా మారి వాటి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి.
9) అత్యవసరంగా వాడే గర్భనిరోధక మాత్రలు - ప్రభావవంతమైనవి కావు:
మీరు రెగ్యులర్గా ఈ గర్భనిరోధక మాత్రలను వాడనట్లైతే, సురక్షితం కాని లైంగిక సంబంధమును కలిగి ఉన్నప్పుడు మీరు తప్పక ఈ గర్భనిరోధక మాత్రలను వెంటనే తీసుకోవాలి. అయినప్పటికీ, అవి సమర్థవంతమైనవి పనిచేయకపోవచ్చు, కాబట్టి వాటిపైన మనము ఆధారపడకూడదని గమనించాలి.
10) అవి రొమ్ము క్యాన్సర్కు కారణం కావు:
ఈ రకమైన గర్భనిరోధక మాత్రలు మహిళలలో రొమ్ము కేన్సర్కు కారణమవుతాయని చాలా పుకార్లు ప్రబలంగా ఉన్నాయి. ఆ పుకార్లు నిజాలు కావన్న ఆధారాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సరియైన పద్ధతిలో ఈ గర్భనిరోధక మాత్రలను వాడటం వల్ల మహిళలకు తీవ్రమైన నష్టాలను కలిగించవని దాని అర్థం.