For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పిండంతో మెదడు ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది?

  |

  మానవ జీవితంలో అత్యంత ఉత్సుకత కలిగించే విషయాలలో, మనిషి పుట్టుక మరియు పరిణామం ముందు వరుసలో ఉంటాయి. ఒక అండం మరియు శుక్రకణం యొక్క కలయిక, ఒక అందమైన జీవికి రూపం ఇస్తుంది. ఒక చిన్న గుడ్డు పరిమాణంలో ప్రారంభమయ్యే ప్రాణం, పూర్తి ప్యాకేజీగా, ఒక మనిషి వలె జీవించడానికి అవసరమైన అన్ని అవయవాలతో అభివృద్ధి జరగడం ఎంతో ఆశ్చర్యకరం. సూక్ష్మరూపంలో మొదలయ్యే జీవం, కాలక్రమేణా పెరిగి తన ఆకారాన్ని సంతరించుకుంటుంది.

  మనందరికీ తెలిసినట్టు, మన శరీరమంతటికి మెదడు ముఖ్యమైన అవయవం. మన శరీర అవయవాల యొక్క నియంత్రణ మరియు సమన్వయానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా మెదడు తీసుకుంటుంది. మనం కడుపులో ఎదిగే బిడ్డ గురించి మాట్లాదుతున్నపుడు, ముఖ్యంగా మాట్లాడుకోవలసిన విషయం మెదదు ఎదుగుదలను గురించే!

  When Does The Brain Develop In A Fetus

  కడుపులో ఎదుగుతున్న పిండం యొక్క మెదడు ఎదుగుదలలో వివిధ దశలు, వాటికి అనుగుణంగా మీరు తీసుకోవలసిన ఆహారం, మీ జీవనశైలి తీరుకు సంబంధించిన అంశాల గురించి ఇప్పుదు మనం, ఈ వ్యాసం ద్వారా తెలుసుకోబోతున్నాం.

  తెలుసుకోవాలనుకుంటే ఆలస్యం చేయకుండా చదివేయండి మరి!

  • మొదటి త్రైమాసికం - మూడవ నెల

  మనలో ఎలా అయితే నాడీ వ్యవస్థ అనేక సంఖ్యలో ఉండే న్యూరాన్ల కలయిక వలన ఏర్పడుతుందో, అలాగే గర్భస్థ పిండంలో జరిగే, ఏ క్రియ అయినా న్యూరాన్ల మధ్య సమాచారం అందించుకోవడం ద్వారానే జరుగుతుంది. మొదటి త్రైమాసిక ఆఖరి నెలలో, ప్రత్యేకమైన నాడీ కణాలు ఏర్పడి అవి పిండం గుండా ప్రయాణించి, నాడీ వ్యవస్థ నిర్మాణానికి పునాది వేస్తాయి.

  మొదటి త్రైమాసికం చివర్లో, మీ శిశువులో సరైన నాడీ సమన్వయం ఏర్పడి, కాళ్ళను, చేతులను ఆడించడం మొదలుపెడుతుంది. అలా కదులుతూ తనకు సౌకర్యవంతమైన రీతిలో గర్భంలో స్థిరపడుతుంది.

  When Does The Brain Develop In A Fetus

  • రెండవ త్రైమాసికం

  ఎదుగుదల దృష్ట్యా మాట్లాడితే, మొత్తం గర్భస్థ దశలో, రెండవ త్రైమాసికం అత్యంత చురుకైన కాలంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనే, గర్భస్థ శిశువులో సహజ ప్రతిచర్యలు ఆరంభమవుతాయి. దీనికి పర్యవసానంగా బిడ్డ ఉమ్మనీరు మింగడం ప్రారంభిస్తుంది, తద్వారా తన శరీరానికి అవసరమైన పోషణ తల్లి నుండి లభిస్తుంది.

  అదే సమయంలో ఛాతీ కండరాలలో సంకోచ వ్యాకోచాలు మొదలై, బిడ్డ ఊపిరి తీసుకోనే ప్రయత్నం మొదలుపెడుతుంది. ఇదంతా పిండం యొక్క అభివృద్ధి చెందుతున్న మెదడు మార్గనిర్దేశం అనుసారం జరుగుతుంది. రెండవ త్రైమాసికం చివర్లో బిడ్డ యొక్క నరాలలో మైలిన్ పొర ఏర్పడుతుంది. మైలిన్ వలన విభిన్న నాడీ కణాల మధ్య సమాచార బదిలీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఈ సమయంలోనే, పిండం యొక్క మెదడు వెన్ను,ఎముక పైన స్థిరపడుతుంది.

  మెదడు అప్పటికి ఇంచుమించుగా పూర్తి పరిపక్వతతో ఉంటుంది. కేవలం మస్తిష్క వల్కలం మాత్రం ఏర్పడవలసి ఉంటుంది. ఈ సమయానికి కల్లా శిశువు పూర్తి రెప్ప ఆర్పడం, కలలు కనడం వంటి సమన్వయంతో కూడుకున్న కార్యకలాపాలు సాగిస్తుంది. వాతావరణంలోని తీవ్రమైన చప్పుళ్లకు స్పందిస్తుంది. ఈ సమయాని కల్లా శిశువులో నిద్రవేళలు నిర్వచించబడతాయి. శిశువు నిద్రవేళలు మీ నిద్రవేళలతో జత కుదరడమనేది మీ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. దీనిని ఎవరూ అంచనా వేయలేరు.

  When Does The Brain Develop In A Fetus

  • మూడవ త్రైమాసికం

  మీ గర్భధారణ యొక్క ఆఖరి నెలలలో, శిశువులో న్యూరాన్ల సంఖ్య మరియు డెండ్రైట్ల అల్లిక వేగంగా పెరుగుతుంది. ఈ సందర్భలోనే, మెదడు చలన నియంత్రణ యొక్క భాద్యత తీసుకుంటుంది. చిన్నమెదడులో శీఘ్ర అభివృద్ధి చోటుచేసుకుంటుంది. దీనివలన మెదడు పరిమాణం మూడింతలు పెరుగుతుంది.

  ఇవేకాకుండా, ఈ దశలో శిశువు మెదడులోని, ఆలోచనలు, జ్ఞాపకశక్తి మరియు భావోద్వేగాలను నియంత్రించే మస్తిష్క వల్కలం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ భాగం, గర్భధారణ యొక్క 8వ మరియు 9వ నెలలలో అభివృద్ధి చెందినప్పటికి, బిడ్డ జన్మించేటప్పుడు మాత్రమే పనిచేయనారంభిస్తుంది.

  ఈ త్రైమాసికంలో శిశువు యొక్క మెదడు మీరు నిర్మాణం, నునుపుగా ఉండటం నుండి పెద్దవారి మెదడుకు మల్లే గాడీలు కలిగి ఉన్నట్టుగా మారుతుంది.

  • ఈ వ్యాసంలో పిండం యొక్క మెదడు అభివృద్ధి గురించి చెప్పినట్లు, గర్భధారణ తొలినాళ్లలో మొదలై చివరినాళ్ళకి పూర్తవుతుంది. ఇటువంటి పరిస్థితి ఉన్నందున , గర్భం ధరించిన నాటి నుండి చివరి వరకు రోజుకు 400 mg ఫోలేట్ తీసుకోవలసిన అవసరం ఉంది.

  విటమిన్ బి మరియు ఫోలిక్ యాసిడ్ల కలియికలోని ఫోలేట్, శిశువు యొక్క కణాభివృద్ధి, డి.ఎన్.ఏ మరియు కణజాల అభివృద్ధికి దోహదపడుతుంది. కనుక గర్భధారణ సమయంలో విటమిన్లు తీసుకోవడం తప్పనిసరి. మీ శిశువులో మెదడు యొక్క అభివృద్ధికి, కేవలం ఈ టెబ్లేట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం మాత్రమే సరిపోదు.

  పచ్చని ఆకుకూరలతో నిండి ఉన్న సమతులాహారం తీసుకోవడం తీసుకోవడం అత్యవసరం. మీ శిశువు యొక్క మెదడు సరిగా అభివృద్ధి చెందాలంటే,ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల( మరీ ముఖ్యంగా డి.హెచ్.ఏ)ను కూడా మీ దైనందిన ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

  కనుక డి.హెచ్.ఏతో నిండి ఉన్న గుడ్లు, సముద్రపు నాచు, సాల్మొన్, ట్రౌట్ మరియు కాడ్ వంటి చేపలను ఆహారంలో తీసుకోండి. ఇవి మీ చిన్నారిలో మెదడు ఎదుగుదలకు అత్యవసర పోషకాలను, అవసరమైన పరిస్థితులు కల్పించి సమగ్రాభివృద్ధికి దోహదపడతాయి.

  English summary

  When Does The Brain Develop In A Fetus

  One of the most fascinating things about human life is the story of birth and evolution. The union of a simple egg and a sperm leads to something as beautiful as life itself. What starts of as something in the size of an egg grows and develops into a complete package that has all the essential organs that a normal functional adult will need (only that it is initially in miniature form and it eventually grows up to take its shape).
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more