For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలు ఇచ్చేవారికి మరియు గర్భధారణ ధరించినవారికి ఎందుకు విటమిన్ డి ముఖ్యమో మీకు తెలుసా ?

పాలు ఇచ్చేవారికి మరియు గర్భధారణ ధరించినవారికి ఎందుకు విటమిన్ డి ముఖ్యమో మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

గర్భధారణ ధరించినవారికి మరియు పాలు ఇచ్చేవారికి విటమిన్ డి ఎందుకు ముఖ్యమైనదంటే, శరీరం తీసుకోవాల్సిన కాల్షియమ్, ఫాస్ఫేట్ ని నియంత్రిస్తుంది. ఈ రెండూ ఎముకలు ఏర్పడటానికి చాలా ముఖ్యం. అంతే కాకుండా విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోకపడుతుంది, కణజాల వృద్ధిని పెంపొందిస్తుంది, మంట కలిగినప్పుతూ స్పందించే గుణాన్ని నియంత్రిస్తుంది, కండరాల శక్తినిపెంచుతుంది మరియు హార్మోన్ల ఉత్పత్తి సరైన క్రమంలో జరిగేలా చూసుకుంటుంది.

మీరు గర్భధారణ సమయంలో మరియు పాలు ఇచ్చే సమయంలో అధిక మోతాదుల్లో విటమిన్ డి ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది బిడ్డ యొక్క విటమిన్ డి స్థాయిల పై కూడా ప్రభావం చూపుతుంది మరియు వారియొక్క వృద్ధిపై కూడా ప్రభావం చూపి, సరైన పద్దతిలో వృద్ధి చెందేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో విటమిన్ డి లోపం గనుక ఉన్నట్లయితే, బిడ్డలో కూడా విటమిన్ డి స్థాయిలు పుట్టే సమయంలో చాలా తక్కువగా ఉంటాయి.

Why Vitamin D is Important for Pregnancy and Breastfeeding

కొన్ని విపరీతమైన సందర్భాల్లో విటిమిన్ డి స్థాయిలు తక్కువ ఉండటం వల్ల వంకర కాళ్ళ వ్యాధి వంటి జబ్బులు తలెత్తే అవకాశం ఉంది. విటమిన్ డి స్థాయిలు మరీ తక్కువ గనుక ఉన్నట్లయితే, గర్భధారణ సమస్యలు తీవ్ర రూపం దాల్చవచ్చు. అటువంటి సమయంలో ప్రీఎక్లంప్సియా, ముందస్తు నొప్పులు, గర్భధారణ మధుమేహం మరియు ఇన్ఫెక్షన్ల వంటివి తీవ్రంగా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. గర్భధారణ సమయంలో విటమిన్ డి 3 ని గనుక స్త్రీలకు ఇచ్చినట్లయితే, పుట్టబోయే పిల్లల యొక్క ఎముకలు బాగా శక్తివంతంగా ఉంటాయని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రావని మరియు ఒత్తిడి పెరగకుండా నియంత్రిస్తుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. విటమిన్ డి ఎక్కడి నుండి వస్తుంది :

Why Vitamin D is Important for Pregnancy and Breastfeeding


సుర్యుడికి బహిర్గతం అవ్వడం ద్వారా :

సూర్యుడికి బహిర్గతం అవడం ద్వారా మన శరీరానికి కావాల్సినంత విటమిన్ డి ని సమకూర్చుకోవచ్చు. సాధారణంగా ఎండాకాలంలో సూర్యుడు విపరీతంగా ప్రకాశించేటప్పుడు, శరీరం తనకు కావాల్సిన విటమిన్ డి ని ఉత్పత్తి చేసుకొని దాచుకుంటుంది. రోజులో 20 నిమిషాల పాటు మీ ముఖాన్ని మరియు మోచేతుల్ని సూర్యుడికి బహిర్గతం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. సన్ స్క్రీన్ వాడటం వల్ల విటమిన్ డి ని పీల్చుకునే శాతం కొద్దిగా తగ్గుతుంది. కావున ఈ 20 నిమిషాల పాటు దానిని వాడకుండా ఉంటే మంచిది. అయితే సూర్య కిరణాలు, మరీ ఎక్కువగా మన చర్మంపై పై పడకుండా మనల్ని మనం రక్షించుకోవడం మంచిది. ఎందుకంటే, ఇలా చేయడం ద్వారా మనకు జరిగే నష్టాన్ని పూడ్చుకోవచ్చు. కాబట్టి 20 నిమిషాల కంటే ఎక్కువసేపు సూర్య కిరణాలకు బహిర్గతం అవ్వకండి.

ఎముకలను బలానికి టాప్10 విటమిన్ డి ఆహారాలుఎముకలను బలానికి టాప్10 విటమిన్ డి ఆహారాలు

Why Vitamin D is Important for Pregnancy and Breastfeeding

ఆహార పదార్ధాల ద్వారా :

మనం రోజు తీసుకొనే ఆహార పదార్ధాల ద్వారా కూడా విటమిన్ డి మనకు లభిస్తుంది. ఇలా సరైన మోతాదులో విటమిన్ డి ని తీసుకోవడం వల్ల గర్భవతికి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇద్దరికీ గర్భధారణ సమయంలో సమయంలో మరియు పాలు ఇచ్చే సమయంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆయిలీ చేప, మాంసం మరియు గుడ్డు పచ్చ సొన లో విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది.

గర్భధారణ సమయంలో మరియు పాలు ఇచ్చే సమయంలో విటమిన్ డి ని భర్తీచేసేందుకు :

అమెరికాలో విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విటమిన్ డి స్థాయిలు అక్కడి ప్రజల్లో రోజు రోజుకి పడిపోవడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది.


మీకు విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉండటానికి పురిగొలిపే కారణాలు ఏమిటంటే...

Why Vitamin D is Important for Pregnancy and Breastfeeding

నల్లటి చర్మాన్ని కలిగి ఉండటం

బాడీ మాస్ ఇండెక్స్ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం

చాలా కొద్ది సేపు మాత్రమే సూర్యరశ్మికి బహిర్గతం అవడం

విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం.

గర్భధారణ సమయంలో మరియు పాలు ఇచ్చే సమయంలో వాడే మల్టీ విటమిన్లలో సాధారణంగానే విటమిన్ డి లభిస్తుంది. కానీ, వీటిని వేసుకొనే ముందు ఒకసారి సరిచూసుకొని సరైనమోతాదులో విటమిన్ డి ని తీసుకుంటున్నారా అనే విషయాన్ని తెలుసుకోవసిన అవసరం ఉంది. గర్భం ధరించిన మరియు పాలు ఇచ్చే స్త్రీలు విటమిన్ డి ని భర్తీ చేయడానికి 400 ఐ యు విటమిన్ డి ని తీసుకోవాల్సి ఉంది. ఈ సంఖ్యను ప్రస్తుతం సమీక్షిస్తున్నారు మరియు అంతకంటే ఎక్కువగా తీసుకుంటేనే మంచిదని చాలామంది నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో విటమిన్ డి ని భర్తీ చేయడానికి వేటిని వాడాలి అనే విషయమై మీ యొక్క వైద్య నిపుణులను సంప్రదించండి.

విటమిన్ డి అధికంగా ఉండే 11 ఆహారపదార్థాలు విటమిన్ డి అధికంగా ఉండే 11 ఆహారపదార్థాలు

గర్భధారణ సమయంలో గర్భిణికి విటమిన్ డి స్థాయిలు సరైన మోతాదులోనే ఉన్నట్లయితే, పుట్టబోయే బిడ్డకు కూడా సమతుల్యతతో కూడిన విటమిన్ డి లభిస్తుంది మరియు వక్షోజాల ద్వారా ఇచ్చే పాల ద్వారా కావాల్సినమేర విటమిన్ డి వారికి అందుతుంది. అయితే గర్భధారణ సమయంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా గనుక ఉన్నట్లయితే, అటువంటి సమయంలో బిడ్డలో విటమిన్ డి స్థాయిలు భర్తీచేయడానికి ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. పాలిచ్చే సమయంలో మీకు గనుక విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండి బాధపడుతున్నట్లైతే, మీరు మీ యొక్క వైద్య నిపుణులను సంప్రదించి, బిడ్డ లో విటమిన్ డి భర్తీ చేయడానికి ఏమైనా వాడాలా అనే విషయాన్ని తెలుసుకోండి.

Why Vitamin D is Important for Pregnancy and Breastfeeding

పాలు ఇచ్చే సమయంలో మీరు విటమిన్ డి ని భర్తీ చేయడానికి వాడే పదార్ధాలను తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ బిడ్డకు అవసరమైన విటమిన్ డి పాల ద్వారా లభిస్తుంది. బిడ్డలు ఎవరైతే ఆరు నెలల లోపు ఉంటారో, అటువంటి వారు సూర్యరశ్మికి చాలా కొద్దిసేపు మాత్రమే బహిర్గతం అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో బిడ్డకు కావాల్సిన మేర విటమిన్ డి తల్లి పాల నుండి అందవల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గర్భధారణ సమయంలో మరియు పాలు ఇచ్చే సమయంలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండటం :

గర్భధారణ సమయంలో లేదా పాలు ఇచ్చే సమయంలో విటమిన్ డి స్థాయిలు మీలో తక్కువ ఉన్నాయని మీరు ఆందోళన చెందుతున్నట్లైతే, ఒకసారి మీరు ఆరోగ్య పరీక్ష చేయించుకోండి. ఒకవేళ ఆ పరీక్షలో మీకు విటమిన్ డి తక్కువ ఉందని నిర్ధారణ అయితే అటువంటి సమయంలో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి మరియు ఆ లోపాన్ని భర్తీచేయడానికి ఏమి వాడాలి అనే విషయాన్ని మీ యొక్క ఆరోగ్య నిపుణులు మీకు సూచిస్తారు.

కొన్ని సందర్భాల్లో కొంతమంది అవసరానికి మించి విటమిన్ డి ని శరీరంలోకి తీసేసుకుంటారు. శరీరంలో విటమిన్ డి అధికంగా ఉన్నట్లయితే దానిని శరీరం నుండి బయటకు పంపడం చాలా కష్టతరమైన పని. మీరు మరియు మీకు పుట్టబోయే బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండి, మీ శరీరాల్లో సరైన మోతాదులో విటమిన్ డి స్థాయిలు ఉండాలంటే, మీ యొక్క ఆరోగ్య నిపుణుడి సలహా తీసుకొని అందుకు కావాల్సిన పదార్ధాలను మరియు అవసరమైన మోతాదులను తెలుసుకొని అందుకు అనుగుణంగా మీరు వాటిని తీసుకోండి. విటమిన్ డి అధికంగా తీసుకోకుండా నిరోధించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే, విటమిన్ డి 3 సప్లిమెంట్ లభ్యమయ్యే అందుకు సంబంధించిన ఆహారం తీసుకోవడం మంచిది.

English summary

Why Vitamin D is Important for Pregnancy and Breastfeeding

Vitamin D deficiency during pregnancy puts your baby at risk of having low vitamin D stores at birth. In extreme cases, babies can develop rickets as a result of low vitamin D levels. Low levels of vitamin D have also been linked to an increased risk of pregnancy complications including pre­eclampsia, preterm labor, gestational diabetes and increased risk for infections. Research shows that supplementing with additional vitamin D3 in pregnancy promotes healthy bone-mass for children later in life and may help to prevent depression.
Story first published:Thursday, February 15, 2018, 11:46 [IST]
Desktop Bottom Promotion