For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు మీ డెలివరీ కోసం ఎపిడ్యురల్ ను కూడా ఎందుకు పరిగణించాలి

|

బిడ్డను కనటం అనే విషయం గురించి ఆలోచించినప్పుడల్లా మొదటగా మీ ఆలోచనల్లోకి వచ్చేది డెలివరీ సమయంలో వచ్చే నొప్పులు. పిల్లలని కన్న స్త్రీలు పురిటినొప్పులు ఎంత బాధాకరంగా ఉంటాయో చెప్పగలరు.

అలాగే మొదటిసారి గర్భం దాల్చిన ప్రతి యువతి త్వరలో ఎదుర్కోబోయే ఆ తీవ్ర నొప్పి గురించి ఎంతో ఆందోళనలో,భయంలో ఉంటారు. అదృష్టవశాత్తూ, ఆధునిక మెడిసిన్ ఈ నొప్పిని తగ్గించటానికి, మెరుగ్గా ఉపశమనం ఇవ్వటానికి కొన్ని పద్దతులు కనిపెట్టింది.

ఎపిడ్యురల్ అంటే పురిటినొప్పులు పడుతున్న తల్లికి ఇచ్చే పెయిన్ కిల్లర్ లాంటిది. ప్రాథమికంగా ఇది నడుము కింద నుంచి స్పర్శను తగ్గించివేసే ఒక అనస్థిటిక్ వంటిది. ఈ పద్ధతిలో మీకు నెప్పి అన్పించదు కానీ ముందుకి తోయడానికి సాయపడే సంకోచవ్యాకోచాలు పైపైన తెలుస్తుంటాయి. మీకు అవి కూడా అన్పించకుండా ఉంటే, మీ డాక్టర్ ఎప్పుడు ముందుకి తోయాలో చెప్తారు,వారి సూచనలు పాటించవచ్చు.

ఈరోజు, మనం ఎపిడ్యురల్ గురించి , నొప్పిలేని సుఖ ప్రసవానికి మంచి ఆప్షన్ ఎందుకు కాగలదో తెలుసుకుందాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఇతర మెడికల్ విధానంలాగానే, ప్రసవసమయంలో ఎపిడ్యురల్ చేయించుకోవటం వలన కూడా కొంత రిస్కు ఉంటుంది. ఇంకా తెలుసుకోవడానికి చదవండి.

- మీ ప్లాన్లలో ఆప్షన్ గా దీన్ని ఉంచుకోండి

- మీ ప్లాన్లలో ఆప్షన్ గా దీన్ని ఉంచుకోండి

సాధారణంగా గర్భవతులు ఎపిడ్యురల్ ద్వారా బిడ్డను కనడం సరైన పద్ధతి కాదు అనుకొంటారు. కొంతవరకూ అది నిజమే. మీ పాపాయిని ప్రపంచంలోకి తేవడానికి సహజపద్ధతే అన్నిటికన్నా మంచిది. కానీ విషయాలు అన్నివేళలా ప్లాన్ ప్రకారం జరగవు. మీ డెలివరీలో ఏమన్నా సమస్యలున్నా,మీరు నొప్పి ఇక అస్సలు భరించలేను అనుకున్నా మీరు వెంటనే ఎపిడ్యురల్ ఎంచుకోవచ్చు.

-ఎపిడ్యురల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది

-ఎపిడ్యురల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది

డెలివరీ సమయంలో ఇతర పెయిన్ రిలీఫ్ పద్ధతులు సరిగ్గా పనిచేయకపోవచ్చు కానీ ఎపిడ్యురల్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. చాలామంది అమ్మాయిలు డెలివరీ సమయంలో వారికే నొప్పి,ఏదీ తెలీదనే చెప్తారు. కొంతమంది తమ నొప్పి ఎపిడ్యురల్ తీసుకున్నాక భరించదగ్గదిగా మారిందని చెప్తారు.

-ఎపిడ్యురల్ తో మీరు అనుభవాన్ని పొందగలరు

-ఎపిడ్యురల్ తో మీరు అనుభవాన్ని పొందగలరు

ఎపిడ్యురల్ తీసుకున్నతర్వాత నొప్పి అస్సలు అన్పించకపోవచ్చు. కానీ డాక్టర్ మిమ్మల్ని ముట్టుకున్నది, మీ సంకోచవ్యాకోచాల వల్ల వత్తిడి అన్నీ తెలుస్తుంటాయి. తప్పకుండా బేబీ బయటకి రావటాన్ని ఫీలవ్వగలరు, ఇదే దీనిలో అన్నిటికన్నా మంచి విషయం,ఎందుకంటే మీరు తల్లయ్యే క్షణమే అన్నిటికన్నా విలువైనది.

-ఎపిడ్యురల్ తో మీరు మీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించగలరు

-ఎపిడ్యురల్ తో మీరు మీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించగలరు

ఎపిడ్యురల్ వల్ల కేవలం కింది భాగపు శరీరానికే ఏ చలనం ఉండదు. మీరు పూర్తిగా మెలకువగానే ఉండి,మీ చుట్టూ జరిగేవన్నీ చూస్తూంటారు. మీరు బిడ్డని బయటకి నెట్టవచ్చు, అందరితో మాట్లాడవచ్చు,అవసరమైతే నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. నొప్పితో కాకుండా బిడ్డ పుట్టే ప్రక్రియ మొత్తంలో ఆనందంగా భాగం పంచుకోవటం చాలా మంచి విషయం. సాధారణ అనస్థీషియా అయితే ఈ అద్భుతమైన అపురూపమైన క్షణాలన్నీ మిస్సవుతారు.

-డోసేజీని తగినట్టు మార్చుకోవచ్చు

-డోసేజీని తగినట్టు మార్చుకోవచ్చు

ఇప్పుడు దొరుకుతున్న పెయిన్ కిల్లర్లన్నీ శరీరంపై చక్కని ప్రభావం చూపించాలని ముందే నిర్ణయించబడిన డోసేజీతో దొరుకుతున్నాయి. మరోవైపు, ఎపిడ్యురల్ డోసేజీని మాత్రం పేషెంట్ నొప్పి ఆధారంగా, ఇతర కారణాల ఆధారంగా కూడా మార్చుకోవచ్చు. మీకు అస్సలు నొప్పే తెలియకూడదనుకుంటే మీ డాక్టర్ ను ఎపిడ్యురల్ డోసేజీని పెంచమని అడగవచ్చు, కొంచెం నొప్పులు భరించగలను అనుకుంటే, మినిమం ఎపిడ్యురల్ ను కోరవచ్చు.

-ఎపిడ్యురల్ వలన మీరు తీవ్రంగా అలసిపోరు

-ఎపిడ్యురల్ వలన మీరు తీవ్రంగా అలసిపోరు

బిడ్డను కనే సమయం చాలా సీరియస్ అలాగే చాలా తీవ్రంగా అలసిపోయే సమయం. ఇందులో ఉండే బాధ,నొప్పి ఈ అనుభవాన్ని మరింత చేదుగా మార్చవచ్చు. నొప్పులతో మీరెంత తీవ్రంగా అలసిపోతారంటే ఒక దశలో ఇక నెట్టలేరు కూడా. అలాంటప్పుడు డాక్టర్ బేబీని ఇతర పద్ధతులైన సిజేరియన్ సెక్షన్, ఫోర్సెప్స్, వ్యాక్యూమ్ డెలివరీలతో బయటకి తీస్తారు.అదే పురిటినొప్పులు మొదలైన దశలోనే ఎపిడ్యురల్ ఇస్తే, మీరు తక్కువగా అలిసిపోతారు, ఇంకా యాక్టివ్ గా బేబీని బయటకి నెట్టవచ్చు కూడా. దీని వల్ల మీ బేబీ పుట్టడానికి అనవసర విధానాలు తప్పుతాయి.

English summary

Why you should consider epidural for your delivery

Labor ward is one of the scariest places on earth for some moms to be. While some have an easy labor, others experience the most horrific one as there is immense pain in the womb. In such cases, an epidural which acts as an anesthetic is injected into the body. This slows down the pain and keeps the mother conscious.
Story first published: Thursday, July 26, 2018, 13:00 [IST]