For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా గుడ్లు తినాలి ఎందుకంటే ...

గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా గుడ్లు తినాలి ఎందుకంటే ...

|

గర్భధారణ సమయంలో తల్లి ఆహారం కడుపు లోపల ఉన్న బిడ్డకు మేలు చేస్తుంది. ఈ కారణంగానే గర్భధారణ సమయంలో గర్భం ఉన్నంత కాలం మంచి ఆహారాన్ని తినాలని అంటారు.

గర్భిణీ స్త్రీకి గర్భధారణ సమయంలో అవసరమయ్యే ముఖ్యమైన ఆహారాలలో గుడ్లు ఒకటి. సమతుల్య ఆహారం అని పిలువబడే గుడ్డు గర్భిణీ స్త్రీలకు కూడా మంచిది. దీనిలోని అనేక రకాల పోషకాంశాలు తల్లి మరియు బిడ్డకు వివిధ రకాలుగా సహాయపడతాయి.

గర్భిణీ గుడ్డు తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి..

బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు గుడ్డు మంచిది

బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు గుడ్డు మంచిది

పిండం మెదడు అభివృద్ధికి గుడ్లు గొప్పవి. శిశువులలో సంభవించే నాడీ సంబంధిత సమస్యలను నివారించడం చాలా అవసరం. అందకు గుడ్లు గొప్పగా సహాయపడుతాయి. గుడ్లలో ఖనిజాలు, కోలిన్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడుతాయి

క్యాలరీలు

క్యాలరీలు

గర్భధారణ సమయంలో, తల్లి ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలి. శిశువు సరైన బరువుకు ఇది చాలా అవసరం. గుడ్లులోని కేలరీలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన మూలకం. ఒక గుడ్డులో 70 కేలరీలుఉంటాయి. గర్భధారణ సమయంలో గర్భిణీకి 100 నుండి 200 కేలరీలు అవసరమని పోషకాహార నిపుణులు చెబుతారు.

గుడ్డులో కాల్షియం పుష్కలం

గుడ్డులో కాల్షియం పుష్కలం

గర్భిణీలో గర్భధారణ సమయంలో నొప్పులు మరియు ఆస్టియో ఆర్థరైటిస్‌కు గుడ్లు సహాయపడతాయి. గుడ్డులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది మరియు విటమిన్ డి గ్రహించడానికి క్యాల్షియం చాలా అవసరం అవుతుంది

A,D, E, K విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి:

A,D, E, K విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి:

కొవ్వును కరిగించే ఈ నాలుగు రకాల విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ చాలా ముఖ్యమైన పోషకాహారం. ఇది బిడ్డ నార్మల్ గా పెరగడానికి సహాయపడుతుంది. కుడుపులో పెరుగుతున్న శిశువు శరీరంలో ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె, కళ్లు, మరియు ఇతర అవయవాల ఏర్పాటుకు ఇవి చాలా గొప్పగా సహాయపడుతాయి.

ఇతర పోషకాలు:

ఇతర పోషకాలు:

గుడ్లలో కంటి మరియు దృష్టి అభివృద్ధికి ముఖ్యమైన లుటీన్ మరియు జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా, విటమిన్ డి, విటమిన్ బి 12 మరియు విటమిన్ బి 2 వంటి విటమిన్లను కూడా గుడ్లు అందిస్తాయి.

పిండం IQ మెరుగ్గా ఉంటుంది

పిండం IQ మెరుగ్గా ఉంటుంది

పుట్టబోయే బిడ్డ యొక్క ఐక్యూ, లేదా ఇంటెలిజెన్స్ కి గుడ్డు మంచిదని నిరూపించబడింది. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శిశువు మెదడు అభివృద్ధి మరియు తెలివితేటలతో ముడిపడి ఉన్నాయి.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

గుడ్డు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది శిశువుకు గుండె సమస్యలతో బాధపడకుండా ఉండటానికి సహాయపడుతుంది. తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ఇది చాలా మంచి పోషకాహారం. గుండె సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలతో బిడ్డ పుట్టకుండా కాపాడటానికి గుడ్లు సహాయపడతాయి. ఇందులో సెలీనియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి 2, విటమిన్ డి మరియు విటమిన్ బి 12 వంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ బి 12 డీఎన్‌ఏ ఏర్పడటానికి చాలా ముఖ్యం. శిశువు జన్మించినప్పుడు, ఇది పరిసరాలతో ఉండటానికి మరియు అనారోగ్యాలను నివారించడానికి సహాయపడుతుంది. ఇది శిశువుకు గుండె సమస్యలతో బాధపడకుండా ఉండటానికి సహాయపడుతుంది. తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ఇది చాలా మంది

కొలెస్ట్రాల్ నియంత్రించడానికి:

కొలెస్ట్రాల్ నియంత్రించడానికి:

గర్భిణీలు రెగ్యులర్ గా గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నిక్షేపాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. గర్భిణీలు ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలను కలిగి ఉంటే గుడ్డులోని పచ్చసొన తినకుండా ఉండాలి.

శిశువు కోసం మాత్రమే కాదు, తల్లి కోసం కూడా గుడ్డు తినాలి

శిశువు కోసం మాత్రమే కాదు, తల్లి కోసం కూడా గుడ్డు తినాలి

గుడ్డు శిశువుకు మాత్రమే కాదు, తల్లికి కూడా చాలా మంచిది. శిశువుకు పాలిచ్చే తల్లులకు 550 మి.గ్రా కోలిన్ అవసరం. గర్భధారణ సమయంలో 450 మి.గ్రా కోలిన్ అవసరం అవుతుంది. పాలిచ్చే తల్లులకు గుడ్డులోని కోలిన్ మంచిది. మీ శరీర శక్తిని ఇవ్వడానికి గుడ్లు గ్రేట్ గా సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో అలసటను తగ్గించడానికి గుడ్లు మంచివని దీని అర్థం

English summary

Pregnant woman should eat egg

Pregnant woman should eat egg, Read more to know about,
Desktop Bottom Promotion