For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు కరోనా వస్తే.. ఎలా కాపాడాలో తెలుసా.. శిశువుకు కూడా కోవిద్-19 వస్తుందా?

|

కరోనా మహమ్మారి మన దేశంలో తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నా పెద్దా.. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది. ఇప్పటికే కోట్లాది మందికి సోకింది.. లక్షలాది మంది ఉసురు తీసింది.

ప్రస్తుతం భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే 3 లక్షలకు పైగా కేసులు కేవలం మన దేశంలో వచ్చాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలకు కరోనా పాజిటివ్ వస్తే.. వారికి పుట్టే శిశువులకు కూడా కరోనా సోకుతుందా? అసలు గర్భిణీ స్త్రీలకు కరోనా సోకితే ప్రమాదమా.. దీని పిల్లలకు ఏదైనా హాని జరుగుతుందా? కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా మీరు గర్భం పొందవచ్చు, ఇవన్నీ మీకు తెలుసా...పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా మీరు గర్భం పొందవచ్చు, ఇవన్నీ మీకు తెలుసా...

ఈ జాగ్రత్తలు పాటిస్తే..

ఈ జాగ్రత్తలు పాటిస్తే..

ఓ అధ్యయనం ప్రకారం, గర్భిణీ స్త్రీలు కరోనా నుండి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటిస్తే.. వారికి పుట్టే శిశువులకు కరోనా బారిన పడే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. నవజాత శిశువులు ప్రసవ సమయంలో, కరోనా తర్వాత రక్షించబడాలంటే.. ప్రెగ్నెన్సీ మహిళలు ఎక్కువ సమయం మాస్కులు ధరించాలని, తల్లి పాలిచ్చే సమయంలో పరిశుభ్రతను పాటించాలని నిపుణులు సూచించారు.

గర్భిణీ స్త్రీలపై కరోనా ప్రభావం..

గర్భిణీ స్త్రీలపై కరోనా ప్రభావం..

కరోనా వైరస్ మహమ్మారి మగవారి కంటే ఎక్కువగా గర్భిణీ స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేయదు. చాలా మంది మహిళలు జలుబు మరియు ఫ్లూ యొక్క తేలికపాటి లక్షణాలను అనుభవిస్తారు. ప్రసవానికి ముందు లేదా తర్వాత వైరస్ సంభవిస్తుందనేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. చైనాలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన మహిళలకు తమ పిల్లలకు కరోనా సోకిన ప్రమాదం ఎక్కడా కనిపించలేదు. ప్రెగ్నెన్సీ సమయంలో శిశువుకు వైరస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళలకు పుట్టిన పిల్లల్లో కోవిద్ ప్రభావం చూపినట్లు ఎక్కడా ఇంతవరకు కేసులు నమోదు కాలేదు.

గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి..

గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి..

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే.. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా తినడానికి ముందు ముఖం మీద చేతులు పెట్టడానికి ముందు చేతులను బాగా కడుక్కోవాలి. మీకు తుమ్ములు లేదా దగ్గు ఉంటే మోచేతులను అడ్డుగా పెట్టుకోండి. అనంతరం చేతులను మళ్లీ నీటిగా కడుక్కోవాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. ప్రజా రవాణా (ట్రైన్, బస్సు)ను ఉపయోగించొద్దు. రద్దీ ఉన్న ప్రాంతాలకు చాలా దూరంగా ఉండాలి. మీరు వాడిన టవ్వాళ్లు, సబ్బులు ఇతర వస్తువులను కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచండి. వ్యక్తిగత పరిశుభ్రతపై జాగ్రత్త వహించండి.

పసిబిడ్డకు ఎంత పాలు పట్టాలి, ఎంత నీరు త్రాగించాలి ?పసిబిడ్డకు ఎంత పాలు పట్టాలి, ఎంత నీరు త్రాగించాలి ?

కరోనా లక్షణాలు కనిపిస్తే..

కరోనా లక్షణాలు కనిపిస్తే..

ప్రెగ్నెన్సీ మహిళలకు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఏవైనా తీవ్రమైన ఇబ్బందులు ఉంటే.. మీకు కరోనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి మందులను ఉపయోగించొద్దు. డాక్టర్లు సూచించిన వాటిని మాత్రమే వాడాలి. కోవిద్-19 మహమ్మారి సమయంలో మానసిక ఒత్తిడిని నివారించాలి. మీరు ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువగా నడవండి. వీలైతే యోగా మరియు ధ్యానం చేయాలి.

రోగ నిరోధక శక్తి పెంచుకోండి..

రోగ నిరోధక శక్తి పెంచుకోండి..

కరోనా వైరస్ నివారణకు మీరు మీ బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పోషకమైన ఆహారాన్ని తినాలి. కరోనా సంక్రమణ నివారించడానికి విటమిన్ సి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, మీరు పసుపు పాలను తీసుకోవాలి. వీటిని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. మీ ఆహారంలో తులసి, నిమ్మ, అశ్వగంధ, అల్లం వంటివాటిని ఎక్కువగా తీసుకోండి.

సమస్యలు రాకుండా..

సమస్యలు రాకుండా..

గర్భిణీ స్త్రీలకు ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత మేర తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీ తగ్గొచ్చు. ఈ సమయంలో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. ప్రెగ్నెన్సీ మహిళలకు సపరేట్ గది, సపరేట్ బాత్ రూమ్ ను ఏర్పాటు చేస్తే మంచిది. అలాగే పరిశుభ్రమైన ఆహారం, కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఏదైనా అనారోగ్యసమస్య తలెత్తితే వెంటనే వైద్యుని చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసరం అయితేనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అంతవరకు వాట్సాప్ లేదా వీడియో కాల్ లో సంప్రదిస్తే ఉత్తమం. ఒకవేళ ఆసుప్రతికి వెళ్తే.. ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా బయటకు వచ్చేయాలి.

శిశువుకు సోకదు..

శిశువుకు సోకదు..

ప్రెగ్నెన్సీ సమయంలో కరోనా వైరస్ సోకిన మహిళలకు పుట్టే పిల్లలకు కోవిద్-19 సోకదు. దీనికి సంబంధించి ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే కోవిద్-19 సోకిన గర్భిణీ స్త్రీలలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. అయితే నెలలు నిండక ముందే ప్రసవిస్తే.. సంతానానికి సంబంధించి వైకల్యం వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

తల్లిపాలతో..

తల్లిపాలతో..

తల్లి పాలతో నవజాత శిశువులకు ఎంతో రక్షణగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. కేవలం ఈ పాలతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెప్పారు. అయితే డెలివరీ సమయంలో ఒక వ్యక్తి మాత్రమే గర్భిణీ మహిళ వద్ద ఉండేలా ఏర్పాట్లు చేసుకోండి. బయటి వారు ఎవరైనా వస్తే.. సామాజిక దూరం కచ్చితంగా పాటించండి.

English summary

Tested Positive for Covid-19 During Pregnancy? Here is what you should do in Telugu

Covid positive during pregnancy: Here's what you should be doing in case you are pregnant and Covid positive.