For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Lack Of Concentration: పిల్లలు ఏ పనిపైనా కాన్సన్‌ట్రేట్ చేయలేకపోతున్నారా, అయితే ఇలా చేయండి

ఎవరికైనా ఏకాగ్రత చాలా ముఖ్యం. వయస్సుతో సంబంధం లేకుండా కాన్సన్‌ట్రేషన్‌ లేకపోతే ఏ పని కూడా సరిగ్గా చేయలేం. అది చదువైనా మరేదైనా పని అయినా ఏకాగ్రత పెట్టకపోతే పనులు సాగవు. చదువుకునే పిల్లల్లో ఏకాగ్రత మరీ మరీ ముఖ్యం.

|

Lack Of Concentration: ఎవరికైనా ఏకాగ్రత చాలా ముఖ్యం. వయస్సుతో సంబంధం లేకుండా కాన్సన్‌ట్రేషన్‌ లేకపోతే ఏ పని కూడా సరిగ్గా చేయలేం. అది చదువైనా మరేదైనా పని అయినా ఏకాగ్రత పెట్టకపోతే పనులు సాగవు. చదువుకునే పిల్లల్లో ఏకాగ్రత మరీ మరీ ముఖ్యం.

ways to help your child strengthen their concentration in Telugu

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఏకాగ్రత గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. పిల్లలు ఆటలు, సరదా కార్యకలాపాలపై పెట్టినంత శ్రద్ధ చదువుపై, చదువు సంబంధిత అంశాలపై పెట్టరు. పిల్లలు వారికి ఆసక్తి లేని పనుల పట్ల ఏకాగ్రత కనబరచలేరు. అయితే ఏకాగ్రత పెంచుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి.

ఏకాగ్రత వయస్సుతో పాటు భిన్నంగా ఉంటుంది. 2 ఏళ్ల వయస్సు పిల్లలు 4-6 నిమిషాల పాటు ఒక పనిపై దృష్టి పెట్టగలరు. 6 ఏళ్ల వయస్సు పిల్లలు 10-12 నిమిషాల పాటు, 12 ఏళ్ల పిల్లలు 25-35 నిమిషాల పాటు ఏకాగ్రత పెడతారు. మీ పిల్లలు ఇంతకంటే తక్కువ సమయం పాటు ఏకాగ్రత పెడుతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న చిట్కాల వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెంచవచ్చు.

1. స్పష్టంగా, సరళంగా చెప్పాలి

1. స్పష్టంగా, సరళంగా చెప్పాలి

పిల్లలకు చెప్పేటప్పుడు చాలా సరళమైన పదాలు వాడాలి. సూటిగా చెప్పాలి. స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. చిన్న చిన్న పదాలు వాడుతూ వారితో మాట్లాడాలి. అప్పుడే వారికి అవి గుర్తుండిపోతాయి. వారి వయస్సుకు తగ్గ పనులు చెప్పాలి. గది మొత్తం శుభ్రం చేయమని చెప్పడం కంటే ఒక్కో వస్తువు ఎక్కడెక్కడ పెట్టాలో చెబుతూ పోవాలి.

2. ఒక్కసారి ఒక్క పని మాత్రమే

2. ఒక్కసారి ఒక్క పని మాత్రమే

పిల్లలకు ఒకేసారి రెండు మూడు పనులు అప్పజెప్పవద్దు. మల్టీటాస్కింగ్ చేసేంతగా వారు అభివృద్ధి చెందిఉండలేరు. కాబట్టి పనిపై ఏకాగ్రత పెట్టాలంటే వారికి ఒకేసారి ఒక పని మాత్రమే చెప్పాలి. అది చదువు అయినా, ఆట అయినా ఇంట్లో పని ఏదైనా. అలా అయితేనే వారు పనిపై ఏకాగ్రత పెట్టగలరు. పనిని శ్రద్ధగా పూర్తి చేయగలరు.

3. బ్రేక్ ఇవ్వాల్సిందే

3. బ్రేక్ ఇవ్వాల్సిందే

విరామం అనేది పని నుండి విశ్రాంతి తీసుకునే సమయం. తిరిగి శక్తిని పుంజుకోవడానికి నిర్దేశించిన సమయం. చదువు అయినా, వేరే ఏదైనా పని అయినా విశ్రాంతి ఇవ్వడం మర్చిపోవద్దు. రోజంతా వారికి ఏదేదో చెప్పే బదులు కాస్తం విరామం ఇస్తే వారికి వారు ఆలోచించగలరు.

4. స్క్రీన్ టైం తగ్గించండి

4. స్క్రీన్ టైం తగ్గించండి

పిల్లల ఏకాగ్రత సామర్థ్యాన్ని ప్రభావితం చేసే విధంగా రోజంతా డిజిటల్ స్క్రీన్‌లకు అతుక్కోకుండా చూసుకోండి. నెమ్మదిగా సమయాన్ని తగ్గించండి. ఇతర కార్యకలాపాలను ప్రోత్సహించండి. పిల్లల కోసం స్క్రీన్ లేని బెడ్ రూం ఉండేలా చూసుకోండి.

5. వారు ఎలా నేర్చుకోగలరో గుర్తించండి

5. వారు ఎలా నేర్చుకోగలరో గుర్తించండి

ఒక్కో పిల్లాడు ఒక్కోలా ఉంటారు. ప్రతి అంశంలోనూ భిన్నంగా ఉంటారు. ఒక పనిని ఒకలా చెబితే కొందరికి అర్థం అవుతుంది. మరికొందరికి మరో రకంగా చెబితే అర్థం అవుతుంది. మీ పిల్లాడికి ఎలా చెబితే విషయాలు అర్థం అవుతాయో తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. అది వారి బాధ్యత.

English summary

ways to help your child strengthen their concentration in Telugu

read on to know ways to help your child strengthen their concentration in Telugu
Story first published:Monday, December 12, 2022, 17:15 [IST]
Desktop Bottom Promotion