పంజాబ్ స్పెషల్ 'కుల్చా'..అదుర్స్ అంతే..మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

Posted By:

నార్త్ ఇండియాలో కుల్చా అనేది చాలా ఫేమస్ వంటకం. మనదేశంలోని చాలా ప్రాంతాల్లో కుల్చా లభిస్తుంది. అయితే పంజాబ్ లోని అమృతసర్ లో లభించే కుల్చా టేస్ట్ మాత్రం సపరేటు. ఇది ఒక రకమైన ఫ్లాట్‌ బ్రెడ్.. దీనిని సాధారణంగా మైదా పిండితో తయారు చేస్తారు. వివిధ రకాల కూరగాయలు లేదా పనీర్‌తో నింపుతారు. దీని ప్రత్యేకమైన రుచి, తయారీ విధానం వల్ల ఇది దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది.

బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా స్నాక్‌గా కూడా దీనిని తినవచ్చు. అమృతసర్ ఫేమస్ కుల్చాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దాని తయారీకి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కుల్చా తయారీకి కావలసిన పదార్థాలు

ఉడికించిన బంగాళాదుంపలు - 3-4
ఉల్లిపాయ - 1 చిన్నది
పచ్చిమిర్చి - 1-2
మైదా పిండి - 2 కప్పులు
గోధుమ పిండి - 1 కప్పు
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
పాలు లేదా నీరు - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కారం - రుచికి సరిపడా
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
బేకింగ్ సోడా - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - 1 టీస్పూన్
పెరుగు - 1/4 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
గరం మసాలా - 1/4 టీస్పూన్
ఎండిన మామిడి పొడి (ఆమ్చూర్) - 1/2 టీస్పూన్
కసూరి మెంతి - 1 టీస్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు

కొన్ని రోజుల్లోనే శరీరంలో అద్భుతాలు చేసే జొన్న దిబ్బ రొట్టె..షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు,ఎలా చేయాలంటే

కుల్చా తయారీ విధానం

-ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, చక్కెర వేసి బాగా కలిపాక పెరుగు, నూనె లేదా నెయ్యి వేసి పిండితో బాగా కలపాలి.

-ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా పాలు లేదా నీరు పోస్తూ మెత్తని పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు.

-పిండిని తడి గుడ్డ కప్పి కనీసం 1-2 గంటలు నాననివ్వాలి. ఎక్కువసేపు నానితే కుల్చాలు మరింత మృదువుగా వస్తాయి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

-ఇప్పుడు అందులోనే బాగా ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆమ్చూర్, కసూరి మెంతి, కారం,ఉప్పు వేసి బాగా కలపాలి.

-చివరగా కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. కూరను పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు నానిన పిండిని మరోసారి కొద్దిగా మెదిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

-ఒక్కో ఉండను తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చిన్న పూరీలా ఒత్తుకోవాలి.

-తయారుచేసుకున్న బంగాళాదుంప కూరను మధ్యలో పెట్టి అంచులు మూసి ఉండలా చేసుకోవాలి.

-మళ్ళీ కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చేత్తో లేదా కాస్త మందంగా రోకలితో ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తకూడదు.

-ఒక పెనంని బాగా వేడి చేయాలి.

-ఒత్తిన కుల్చాను పెనం మీద వేసి మీడియం మంట మీద ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత తిప్పి వేయాలి.

-రెండు వైపులా కొద్దిగా నూనె లేదా నెయ్యి వేస్తూ బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.

-కుల్చాలు బాగా పొంగేలా మూత పెట్టి కూడా కాల్చుకోవచ్చు. అంతే వేడి వేడి కుల్చా రెడీ.

-నెయ్యి లేదా వెన్నతో అద్ది చనా మసాలా, పెరుగు, ఊరగాయ, ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, April 8, 2025, 7:06 [IST]
Desktop Bottom Promotion