రక్తహీనతకు చెక్ పెట్టే అమృతం లాంటి బీట్‌ రూట్ సాంబార్..అప్పడంతో తింటుంటే కేక

Posted By:

దక్షిణ భారతీయ వంటకాల్లో సాంబార్ కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎప్పుడూ రొటీన్ కూరగాయలతో కాకుండా, ఆరోగ్యాన్నిచ్చే బీట్‌ రూట్‌ తో సాంబార్ చేస్తే ఆ రుచే వేరు. బీట్‌ రూట్ అనగానే చాలామందికి దాని తీపి లేదా మట్టి వాసన నచ్చదు.

కానీ ప్రత్యేకమైన స్టైల్ లో చేసే బీట్‌ రూట్ సాంబార్ అమృతంలా ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, హిమోగ్లోబిన్ పెంచడంలో బీట్‌రూట్ దిట్ట. మరి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఈ సాంబార్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Amrutham on a Plate Step by Step Guide to Make Authentic Beetroot Sambar Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

-కందిపప్పు
-బీట్ రూట్
-నూనె
-పసుపు
-కారం
-ఉప్పు
-చింతపండు
-కరివేపాకు
-కొత్తిమీర
-ఉల్లిపాయ
-ఆవాలు
-జీలకర్ర
-పచ్చి శెనగప్పు
-మినపప్పు
-మెంతులు
-ధనియాలు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-ఇంగువ
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-టమాటో
-పచ్చి కొబ్బరి

Amrutham on a Plate Step by Step Guide to Make Authentic Beetroot Sambar Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా అరకప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి.

-నిమ్మకాయంత చింతపండుని నీటిలో నానబెట్టాలి.

-తర్వాత 200 గ్రాముల బీట్ రూట్ తీసుకొని పైన చెక్కును తీసేసి చిన్నచచిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నానబెట్టిన కందిపప్పు, బీట్ రూట్ ముక్కలు, పెద్ద పెద్ద క్యూట్స్ గా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు, పావు టీస్పూన్ పసుపు, 4 బొట్ల నూనె, 2 పచ్చిమిర్చి చీలికలు, 2 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంట మీద 4-5 విజిల్స్ రానివ్వాలి.

-ఇప్పుడు సాంబార్ రుచిని మరింత పెంచే ఓ ముద్ద తయారుచేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేవాక ఇందులో 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 చిటెకెళ్ల మెంతులు వేసి సన్నని సెగ మీద మెంతులు,పప్పులు ఎర్రబడే దాకా వేపుకోవాలి.

-పప్పులు రంగు మారాక అందులో అరటేబుల్ స్పూన్ బియ్యం వేసి వేయించాలి. పప్పులు వేగి,మిర్చి పొంగిన తర్వాత అందులో పావు కప్పు పచ్చికొబ్బరి ముక్కలు, 2 లవంగాలు,చిన్న దాల్చిన చెక్క వేసి రెండు నిమిషాలు వేయించి ప్టవ్ ఆపేయాలి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించినవన్నీ వేసి ఇందులోనే నానబెట్టిన చింతపండును నీళ్లతో సహా పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అంతే సాంబార్ ముద్ద రెడీ.

-ఇప్పుడు కుక్కర్ లో మెత్తగా ఉడికిన పప్పుని బీట్ రూట్ చెదిరిపోకుండా పైపైన మెదుపుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేశాక 1 ఎండుమిర్చి ముక్కలు, అర టీస్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిట్లిన తర్వాత పావు టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, 1 రెబ్బ కరివేపాకు, 1 టమాటో పెద్ద సైజు ముక్కలు(క్యూబ్స్),రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి.

-టమాటో ముక్కల పైన తోలు మెత్తబడిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న సాంబార్ ముద్ద, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. తర్వాత ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలిపి రెండు పొంగులు రానివ్వాలి.

-చివరగా 1 టేబుల్ స్పూన్ బెల్లం అందులో వేసి కలపాలి. ఉడుకుపట్టిన తర్వాత మెదుపుకున్న కందిపప్పు బీట్ రూట్ మిశ్రమాన్ని ఇందులో పోసి కలపాలి. ఇందులో రెండున్న కప్పుల నీళ్లు, కొత్తిమీర తరుగు వేసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద 10 నిమిషాలు బాగా మరగనిచ్చి స్టవ్ ఆపేయాలి. తర్వాత మూత తీస్తే కమ్మని బీట్ రూట్ సాంబార్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 19, 2025, 7:55 [IST]
Desktop Bottom Promotion