బాదం హాల్వా రెసిపీ : బాదం హల్వాని తయారు చేయడం ఎలా?

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
బాదాం హల్వా రిసిపి | Badam Halwa Recipe | Almond Halwa Recipe | Boldsky

దేశవ్యాప్తంగా బాదం హల్వా అనే తీపి పదార్థం ప్రఖ్యాతి గాంచింది. పండుగలలో, వేడుకలలో, పెళ్లిళ్లలో, పేరంటాలలో ఇలా వివిధ సంతోషకర సందర్భాలలో బాదం హల్వాని తయారుచేసుకుంటారు.

బాదం, చక్కెర మరియు నేతిని ప్రధాన పదార్థాలుగా తీసుకుని తయారుచేసే ఈ బాదం హల్వా రుచి అమోఘంగా ఉంటుంది. నోట్లోని వేసుకోగానే కరిగిపోయే ఈ బాదం హల్వాను పిల్లల నుంచి పెద్దల వరకు అమితంగా ఇష్టపడతారు.

బాదంలతో తయారయ్యే ఈ బాదం హల్వాలో పోషకవిలువలు అమితంగా లభిస్తాయి. ఒకే సారి రెండు స్పూన్ల కంటే ఎక్కువ హల్వాని తినలేరు.

ఈ రుచిగల తీపిపదార్థాన్ని సులభంగానే ఇంటివద్దే తయారుచేసుకోవచ్చు. దీనిని తక్కువ సమయంలోనే తయారుచేసుకోగలం. అయితే, ఈ స్వీట్ ని తయారుచేసే క్రమంలో మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ మిశ్రమమనేది సరైన కన్సిస్టెన్సీకి వచ్చేలా చూసుకోవాలి. ఈ స్టెప్ ని సరిగ్గా పాటిస్తే అద్భుతమైన హల్వా తయారవుతుంది.

బాదం హల్వాను సులభంగా తయారుచేసుకునే విధానాన్ని తెలియచేసే వీడియో రెసిపీ ప్రత్యేకంగా మీ కోసమే. అలాగే, హాల్వాను తయారుచేసుకునే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ను కూడా మీకు వివరంగా ఇమేజెస్ తో పాటు తెలియచేస్తున్నాము.

బాదం హల్వా వీడియో రెసిపీ

badam halwa recipe
బాదం హల్వా రెసిపీ| ఆల్మండ్ హల్వా రెసిపీ| హోంమేడ్ బాదం హల్వా రెసిపీ| బాదం హల్వాను తయారుచేసే విధానం
బాదం హల్వా రెసిపీ| ఆల్మండ్ హల్వా రెసిపీ| హోంమేడ్ బాదం హల్వా రెసిపీ| బాదం హల్వాను తయారుచేసే విధానం
Prep Time
5 Mins
Cook Time
40M
Total Time
45 Mins

Recipe By: మీనా భండారి

Recipe Type: స్వీట్స్

Serves: 3-4

Ingredients
 • బాదం - 1 కప్పు

  చక్కెర - ½ కప్పు

  నీళ్లు - 5½ కప్పులు

  నెయ్యి - ½ కప్పు

  కుంకుమపువ్వు పోగులు - 7-8

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. వేడిచేసిన ప్యాన్ లో నాలుగు కప్పుల నీటిని జోడించండి.

  2. దాదాపు 2 నిమిషాల వరకు నీటిని మరగనివ్వండి.

  3. ఇప్పుడు బాదాం పప్పులను జోడించి ఒక లిడ్ తో ప్యాన్ ను కవర్ చేయండి.

  4. హై ఫ్లేమ్ లో దాదాపు 8 నుంచి పది నిమిషాల వరకు ఇలా కుక్ చేయండి.

  5. బాదం సరిగ్గా ఉడికిందో లేదో చెక్ చేయండి. ఇందుకు, ఒక బాదంను తీసుకుని బాదం చెక్కు సులభంగా వచ్చిందో లేదో చూడండి. ఒకవేళ బాదం చెక్కు సులభంగా వస్తే బాదాం సరిగ్గా ఉడికినట్టేనని అర్థం.

  6. స్టవ్ పైనుంచి ప్యాన్ ను తీసుకుని అందులోనున్న ప్యాన్ లో నున్నవాటిని ఒక బౌల్ లోకి బదిలీ చేయండి. ఆ తరువాత, అయిదు నిమిషాల వరకు ఆ బౌల్ లోని పదార్థాలని చల్లబడనివ్వండి.

  7. ఇప్పుడు, ఇంకొక బౌల్ లో ఒక కప్పుడు నీటిని తీసుకోండి.

  8. బాదంని ప్రెస్ చేసి బాదం చెక్కులను తొలగించండి. ఇలా చేయడం ద్వారా బాదం చెక్కులను త్వరగా తొలగించవచ్చు.

  9. బాదం చెక్కులను తొలగించిన తరువాత బాదం పప్పులను వేరొక బౌల్ లోకి బదిలీ చేయండి.

  10. ఇప్పుడు, బాదంలను ఒక మిక్సర్ జార్ లోకి తీసుకోండి.

  11. ఒక పావు కప్పుడు నీటిని జోడించి, బాదం పప్పులను చక్కటి పేస్ట్ లా నూరుకోండి. ఇప్పుడు, ఈ పేస్ట్ ని ఒక పక్కన పెట్టుకోండి.

  12. వేడిచేసిన ప్యాన్ లో ఒక పావు కప్పుడు నీటిని తీసుకోండి.

  13. ఇప్పుడు, చక్కెరని జోడించి బాగా కలపండి. చక్కెర కరిగిపోయేవరకు బాగా కలపండి.

  14. ఇందులో, కుంకుమ పువ్వు పోగులను జోడించండి.

  15. ఒక నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని మరగనివ్వండి. ఆ తరువాత, లో ఫ్లేమ్ కి మార్చండి.

  16. మరొక వేడిచేసిన ప్యాన్ లో నేతిని పోయండి.

  17. నేయి కరగగానే, బాదం పేస్ట్ ను జోడించండి.

  18. దాదాపు 8 నుంచి పదినిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి. ఈ మిశ్రమం అనేది గ్రాన్యులర్ కన్సిస్టెన్సీ కి వచ్చేవరకు ఇలా కలుపుతూనే ఉండాలి

  19. ఇప్పుడు, చక్కెర పాకాన్ని వేసి దాదాపు రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి. నేయి అనేది సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి.

  20. ఇప్పుడు, స్టవ్ మీద నుంచి ప్యాన్ ను తీసుకుని అందులోని హల్వాను ఒక బౌల్ లోకి మార్చండి.

  21. రూమ్ టెంపరేచర్ లో గాని లేదా చల్లగా గానీ బాదం హల్వాని వడ్డించుకోవచ్చు.

Instructions
 • 1. బాదం బాగా ఉడికిన తరువాత ఆ నీటిని వడగట్టి అప్పుడు బాదం చెక్కును తొలగించవచ్చు.
 • 2. బాదం పప్పులను ముందురోజు రాత్రి బాగా నానబెడితే బాదం చెక్కులు సులభంగా తొలగిపోతాయి.
 • 3. బాదం చెక్కులను తొలగించిన తరువాత బాదం పప్పులను నీటితో నిండిన బౌల్ లోకి మార్చితే బాదం రంగు మారకుండా ఉంటుంది.
Nutritional Information
 • సెర్వింగ్ సైజ్ - 1 టేబుల్ స్పూన్
 • కేలరీలు - 132
 • ఫ్యాట్ - 8 గ్రాముల
 • ప్రోటీన్ - 3 గ్రాములు
 • కార్బోహైడ్రేట్స్ - 15 గ్రాములు
 • షుగర్ - 14 గ్రాములు
 • ఫైబర్ - 1 గ్రాము

స్టెప్ బై స్టెప్ - బాదాం హల్వాను తయారుచేసే విధానం

1. వేడిచేసి ప్యాన్ లో నాలుగు కప్పుల నీటిని జోడించండి.

badam halwa recipe

2. దాదాపు 2 నిమిషాల వరకు నీటిని మరగనివ్వండి.

badam halwa recipe

3. ఇప్పుడు బాదాం పప్పులను జోడించి ఒక లిడ్ తో ప్యాన్ ను కవర్ చేయండి.

badam halwa recipe

4. హై ఫ్లేమ్ లో దాదాపు 8 నుంచి పది నిమిషాల వరకు ఇలా కుక్ చేయండి.

badam halwa recipe

5. బాదం సరిగ్గా ఉడికిందో లేదో చెక్ చేయండి. ఇందుకు, ఒక బాదంను తీసుకుని బాదం చెక్కు సులభంగా వచ్చిందో లేదో చూడండి. ఒకవేళ బాదం చెక్కు సులభంగా వస్తే బాదాం సరిగ్గా ఉడికినట్టేనని అర్థం.

badam halwa recipe

6. స్టవ్ పైనుంచి ప్యాన్ ను తీసుకుని అందులోనున్న వాటిని ఒక బౌల్ లోకి బదిలీ చేయండి. ఆ తరువాత, అయిదు నిమిషాల వరకు ఆ బౌల్ లోని పదార్థాన్ని చల్లబడనివ్వండి.

badam halwa recipe

7. ఇప్పుడు, ఇంకొక బౌల్ లో ఒక కప్పుడు నీటిని తీసుకోండి.

badam halwa recipe

8. బాదంని ప్రెస్ చేసి బాదం చెక్కులను తొలగించండి. ఇలా చేయడం ద్వారా బాదం చెక్కులను త్వరగా తొలగించవచ్చు.

badam halwa recipe

9. బాదం చెక్కులను తొలగించిన తరువాత బాదం పప్పులను వేరొక బౌల్ లోకి బదిలీ చేయండి.

badam halwa recipe

10. ఇప్పుడు, బాదంలను ఒక మిక్సర్ జార్ లోకి తీసుకోండి.

badam halwa recipe

11. ఒక పావు కప్పుడు నీటిని జోడించి, బాదం పప్పులను చక్కటి పేస్ట్ లా నూరుకోండి. ఇప్పుడు, ఈ పేస్ట్ ని ఒక పక్కన పెట్టుకోండి.

badam halwa recipe

12. వేడిచేసిన ప్యాన్ లో ఒక పావు కప్పుడు నీటిని తీసుకోండి.

badam halwa recipe

13. ఇప్పుడు, చక్కెరని జోడించి బాగా కలపండి. చక్కెర కరిగిపోయేవరకు బాగా కలపండి.

badam halwa recipe

14. ఇందులో, కుంకుమ పువ్వు పోగులను జోడించండి.

badam halwa recipe

15. ఒక నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని మరగనివ్వండి. ఆ తరువాత, లో ఫ్లేమ్ కి మార్చండి.

badam halwa recipe

16. మరొక వేడిచేసి ప్యాన్ లో నేతిని పోయండి.

badam halwa recipe

17. నేయి కరగగానే, బాదం పేస్ట్ ను జోడించండి.

badam halwa recipe

18. దాదాపు 8 నుంచి పదినిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి. ఈ మిశ్రమం అనేది గ్రాన్యులర్ కన్సిస్టెన్సీ కి వచ్చేవరకు ఇలా కలుపుతూనే ఉండాలి.

badam halwa recipe

19. ఇప్పుడు, చక్కెర పాకాన్ని వేసి దాదాపు రెండు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండాలి. నేయి అనేది సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి.

badam halwa recipe

20. ఇప్పుడు, స్టవ్ మీద నుంచి ప్యాన్ ను తీసుకుని అందులోని హల్వాను ఒక బౌల్ లోకి మార్చండి.

badam halwa recipe

21. రూమ్ టెంపరేచర్ లో గాని లేదా చల్లగా గానీ బాదం హల్వాని వడ్డించుకోవచ్చు.

badam halwa recipe
[ 3.5 of 5 - 85 Users]