Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఇడ్లీ, దోశల్లోకి చట్నీ,సాంబార్ కాదు..ఈ కుర్మాతో తింటే ఎన్నైనా అలా పోతుంటాయి..ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా మనం ఇడ్లీ లేదా దోశలను కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో తింటూ ఉంటాం. ఇడ్లీ, దోశల్లోకి రొటీన్ చట్నీలు, సాంబార్ కాకుండా అప్పుడప్పుడు వెజిటబుల్ కుర్మా చేసుకోవడం వల్ల నాలుకకు కొత్త రుచి దొరుకుతుంది, శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.
ఇది చపాతీ లేదా పూరీలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. సులభంగా జీర్ణమయ్యే ఇడ్లీతో, పీచు పదార్థం ఉన్న కుర్మాను జత చేయడం అనేది ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక మంచి అలవాటు. ఈ వెజిటేబుల్ కుర్మా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పుట్నాల పప్పు(శెగనపప్పు)
-బంగాళాదుంపలు
-టమోటాలు
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-కరివేపాకు
-పచ్చి కొబ్బరి ముక్కలు
-సోంపు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-నూనె
-బిర్యానీ ఆకు
-లవంగాలు
-యాలకలు
-దాల్చిన చెక్క
-కారం
-వేయించిన జీలకర్ర పొడి
-వేయించిన ధనియాల పొడి
-పసుపు
-ఉప్పు
-గసగసాలు
-మిరియాలు
-రాతి పువ్వు
తయారీ విధానం
-ముందుగా మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు(తినే శెనగపప్పు), 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీస్పూన్ మిరియాలు, 4 లవంగ మొగ్గలు, 4 యాలకలు, అర కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా రాతి పువ్వు, కొంచెం నీళ్లు పోసి వెన్న అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో చిన్న బిర్యానీ ఆకు, 2 యాలకలు, 2 లవంగాలు, అర ఇంచు దాల్చిన చెక్క వేసి వేపాక 1 టీస్పూన్ సోంపు వేసి వేయించాక 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడితే చాలు.
-3-4 నిమిషాలు వేపితే చాలు ఉల్లిపాయల్లోని పచ్చి వాసన పోతుంది. అప్పుడు 2 రెబ్బల కరివేపాకు, పావు కప్పు క్యూబ్స్ గా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, మధ్యలోకి చీరిన 2 పచ్చిమిరపకాయలు వేసి 2 నిమిషాలు వేయించాలి.
-తర్వాత అందులో అర టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాక అందులో అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, అర టీస్పూన్ వేపిన జీలకర్ర పొడి, అర టీస్పూన్ వేపిన ధనియాల పొడి వేసి కలిపి కొద్దిగా నీళ్లు కూడా పోసి వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో ముందుగా వెన్నలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో ఒకటిన్నర కప్పుల వేడి వేడి నీళ్లు పోసి 3-4 నిమిషాలు వేపితే పచ్చివాసన పోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
-తర్వాత అందులో పండిన టమాటోల పెద్ద ముక్కలు వేసి కలిపి 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఎక్కువగా వేయించనక్కర్లేదు.
-తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు వేసి ఒకటింబావు కప్పు వేడి నీళ్లు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి పెద్ద మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి.
-ఆవిరి దానంతట అది పోయిన తర్వాత మూత తీసి ఉప్పు, కారం చెక్ చేసుకోండి. కారం ఎక్కువ అయితే కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోండి.
-ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి 2 నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లుకొని కలిపి స్టవ్ ఆపేయండి. అంతే సూపర్ టేస్టీ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












