టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి లేకుండా సాంబార్‌.. ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు!

సాంబార్ అనేది ఒక వంటకం మాత్రమే కాదు. అదొక ఎమోషన్ కూడా. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో దీనిని ఇష్టపడని వారుండరు. ఇంట్లో భోజనం నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్ల వరకు ప్రతి దాంట్లో సాంబార్‌ ఉండాల్సిందే. మటన్, చికెన్ తిన్నా లభించని ఆనందం.. సాంబార్ తింటే లభిస్తుంది. కొన్ని కూరగాయలు, మసాలాలు, కొన్ని దినుసులతో దీనిని తయారు చేస్తారు.

అయితే కొందరు ఆరోగ్య ప్రియులు సాంబార్‌లో ఎక్కువగా క్యాలరీలు ఉంటాయని దూరం పెడుతూ ఉంటారు. వారికోసం టమాటో, ఉల్లిపాయ, మిరపకాయ లేకుండా సాంబార్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరించాము. ఇందులో తక్కువ క్యాలరీలు, తక్కువ ఫ్యాట్ ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు:

> ఒక కప్పు కందిపప్పు
> ఒక కప్పు విడదీసిన నల్ల పప్పు
> ఒక కప్పు పెసర పప్పు
> ఒక టీ స్పూన్ పసుపు పొడి, ధనియాల పొడి
> ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి
> ఒక టీ స్పూన్ కారం
> సరిపడా నూనె
> అర టీ స్పూన్ గరం మసాలా
> సరిపడా ఉప్పు
> ఒక కప్పు నీరు
> సరిపడా కొత్తిమీర

తయారీ విధానం

టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి లేకుండా సాంబార్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న పప్పులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి.. దానిపై కుక్కర్ పెట్టి, అందులో పప్పుకి సరిపడా నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. పప్పు, నీరు మరిగాక.. స్టవ్ ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి సుమారు 45 నిమిషాల పాటు పప్పును బాగా ఉడికించుకోవాలి.

తరువాత అందులో పసుపు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సరిపడా ఉప్పు, వేసుకొని కక్కర్ మూత పెట్టుకొని, ఒక విజిల్ వేసే వరకు ఉడికించుకోవాలి. దీంతో మనం వేసిన మసాలా దినుసులన్నీ పప్పుకు బాగా పట్టుకుంటాయి. తరువాత పప్పును దించుకొని బాగా మెత్తగా కలుపుకొని పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు.

అంతే, ఘుమఘుమలాడే సాంబార్ సిద్ధమైనట్లే. దీనిని ఒక బౌల్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఇంకా తినడానికి సిద్ధమైపోతుంది.

దీనివల్ల ఉపయోగాలు

టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి లేకుండా చేసే సాంబార్ సాంప్రదాయకమైన సాంబార్. దీనిని తినడం వల్ల కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అదే సమయంలో ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఈ పద్దతిలో చేసుకునే సాంబార్‌లో తక్కువ మోతాదులో క్యాలరీలు, కొవ్వు శాతం ఉంటుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారు సాంబార్‌ను మిస్ కాకుండా దీనిని తయారు చేసుకొని తినొచ్చు.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 16, 2024, 12:48 [IST]
Desktop Bottom Promotion