Latest Updates
-
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది? -
ఉగాది 2026-27 రాశి ఫలాలు..పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశికి రాజయోగం? ఏ రాశికి అవమానం? -
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే -
నోరూరించే హైదరాబాదీ పనీర్ కీమా.. చపాతీ, రోటీ,పూరీల్లోకి దీన్ని మించిన రుచి లేదు! -
ఈరోజు రాశి ఫలాలు (18.03.26): మీన రాశిలో చంద్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ధనలాభం!
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు!
రోజూ ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్ తిని బోర్ కొట్టిందా? మీకు మీ కుటుంబ సభ్యులకు ఒక సరికొత్త రుచిని పరిచయం చేయాలనుకుంటే ఎగ్ ఇడ్లీ ట్రై చేయండి. ఎగ్ ఇడ్లీ అనగానే మీరు కొద్దిగా ఆశ్చర్యపోవచ్చు. ఇది రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన రెసిపీ.
సాధారణంగా మనం చేసుకునే మినప ఇడ్లీలు, దోశల కంటే ఈ ఎగ్ ఇడ్లీలు ఎన్నో రెట్లు రుచిగా ఉంటాయి. పైగా ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వేడి వేడి అన్నంలో సాంబార్ లేదా పప్పు కలుపుకుని, వాటికి సైడ్ డిష్‌గా ఈ ఎగ్ ఇడ్లీలను నంజుకుని తింటే ఆ రుచే వేరు. ఒక్కసారి మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేశారంటే.. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరూ మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుని తింటారు.
ఎగ్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ పిండి: 2 కప్పులు
కోడిగుడ్లు: 5
ఉప్పు: రుచికి సరిపడా
కారం: మీ రుచికి తగినంత
మిరియాల పొడి: 1 టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి: అర టీ స్పూన్
కొత్తిమీర తరుగు: అర కట్ట
నూనె లేదా నెయ్యి: అర కప్పు
ఎగ్ ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఇడ్లీ పాత్రను పొయ్యి మీద పెట్టాలి. అందులో సుమారు 4 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి.
-ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకుని, వాటి గుంటల్లో కొద్దిగా నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యిని చేతితో బాగా రాయాలి. ఇలా చేయడం వల్ల ఉడికిన తర్వాత ఇడ్లీలు అంటుకోకుండా, మృదువుగా సులభంగా బయటకు వస్తాయి. ఈ ప్లేట్లను పక్కన పెట్టుకోండి.
-నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఒక్కో గుంటలో ఒక్కో కోడిగుడ్డును పగలగొట్టి వేయాలి. ఒకవేళ మీరు ఇడ్లీ పిండి వాడాలనుకుంటే, ముందుగా గుంటల్లో సగం వరకు ఇడ్లీ పిండి వేసి, దాని పైన గుడ్డు పగలగొట్టి వేసుకోవచ్చు. పిండి వద్దు అనుకునే వారు నేరుగా గుడ్డును మాత్రమే వేసుకోవచ్చు.
-ఇప్పుడు ఆ గుడ్ల పైన మీ రుచికి తగినట్లుగా కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా పొడిని తేలికగా, అన్ని వైపులా పడేలా చల్లుకోవాలి.
-అన్నీ సిద్ధం చేసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లను, జాగ్రత్తగా మరిగే నీళ్లున్న ఇడ్లీ పాత్రలో ఉంచాలి. పాత్రపై మూత పెట్టి, మంటను సిమ్ లో ఉంచి కనీసం 15 నిమిషాల పాటు నీటి ఆవిరి మీద బాగా ఉడికించాలి.
-15 నిమిషాల తర్వాత గుడ్డు బాగా ఉడికి, ఇడ్లీ ఆకారంలో ఉబ్బుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, ప్లేట్లను బయటకు తీయాలి. కాస్త చల్లారాక ఒక స్పూన్ సహాయంతో నెమ్మదిగా ఇడ్లీలను తీసి సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకోవాలి.
-గుమగుమలాడే వేడి వేడి ఎగ్ ఇడ్లీలు రెడీ. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని వీటిని నేరుగా తిన్నా అద్భుతంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












