గోదారొళ్ల స్పెషల్ పాల ముంజలు.. ఒక్కటి తింటే,ఇంకోటి అడుగుతారు,ఎలా ప్రిపేర్ చేయాలంటే?

మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన వంటలు ప్రసిద్ధి చెందినవిగా ఉన్నాయి. నెల్లూరులో చేపల పులుసు, తెలంగాణలో నాటుకోడి కూర.. గుంటూరులో మిరప బజ్జి ఇలా రకరకాల వంటకాలు రకరకాల ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినవిగా కొనసాగుతున్నాయి. అయితే గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన స్వీట్లలో ఒకటి 'పాల ముంజలు'. ఈ ప్రత్యేకమైన స్వీట్‌ను పచ్చికొబ్బరి, బెల్లంతో తయారుచేస్తారు. అలాగే నెయ్యి పరిమళం దానిని మరింత రుచికరంగా చేస్తుంది. పచ్చి కొబ్బరి మరియు బెల్లం కలిపి తయారుచేసే ఈ స్వీట్ పిల్లలు, పెద్దలు అందరినీ అలరిస్తుంది. దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ జీవితంలో దీనిని మర్చిపోలేరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పాలముంజలు చేసుకునే విధానం అందరికీ తలియకపోవచ్చు. అందుకే ఈ స్టోరీని పూర్తిగా చదివి.. పాల ముంజలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకోండి.

పాల ముంజల స్టఫింగ్ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు:

పచ్చికొబ్బరి ముక్కలు - 2 కప్పులు

బెల్లం తురుము - 1 కప్పు

నీళ్లు - ½ కప్పు

యాలకులు పొడి - 1 టీస్పూన్

నెయ్యి - 1 టీస్పూన్

పాల ముంజలపై పిండి తయారీ కోసం కావాల్సిన పదార్థాలు:

పాలు - 2 కప్పులు

చక్కెర - 2 టీస్పూన్లు

బొంబాయి రవ్వ - ½ కప్పు

బియ్యం పిండి - ½ కప్పు

ఉప్పు - చిటికెడు

తయారీ విధానం:

ముందుగా, ఒక మిక్సీలో పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి, ఒక గిన్నెలో పెట్టుకోండి.

స్టవ్ మీద కడాయి పెట్టి, ½ కప్పు నీళ్లు వేసి, అందులో బెల్లం తురుము వేసి కరిగించండి. బెల్లం కరిగిపోయిన తర్వాత, అందులో గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి వేసి బాగా కలపండి.

స్టఫింగ్ మిశ్రమం బాగా ముదిరిన తర్వాత, యాలకుల పొడి మరియు నెయ్యి వేసి బాగా కలపండి. తరువాత, ఈ మిశ్రమం చల్లారనివ్వండి.

బయటి కంటే డబల్ టేస్ట్‌తో చాక్లెట్ మిల్క్ షేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎలా అంటే?

చల్లారిన స్టఫింగ్ నుండి చిన్న చిన్న బాల్స్ తయారుచేసి, వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి.

తరువాత, మరో కడాయి తీసుకుని 2 కప్పుల పాలు, 2 టీస్పూన్లు చక్కెర వేసి వేడి చేయండి. పాలు పోగొట్టిన తర్వాత, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి.

ఈ పిండి దగ్గరపడిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన పిండి మీద నెయ్యి మర్చి, పిండితో పెద్ద నిమ్మకాయ ఆకారంలో ఉండలు చేసుకోండి.

తర్వాత, ఈ ఉండలలో పచ్చి కొబ్బరి బెల్లం స్టఫింగ్ పెట్టి నెమ్మదిగా మూసివేయండి. ఇలా అన్ని ఉండలను తయారుచేసి ప్లేట్లో పెట్టుకోండి.

చివరగా, స్టవ్ మీద కడాయి పెట్టి, ఆయిల్ వేడి చేసుకోండి. వేడి అయిన తర్వాత, మధ్యస్థ ఉష్ణోగ్రతలో పాల ముంజలు వేయించండి. రెండు నిమిషాలు వేయించి, గరిటెతో తిప్పుతూ వేయించండి.

పాల ముంజలు దోరగా వేయించిన తర్వాత, వాటిని ప్లేట్లోకి తీసుకోండి. ఇక, మిగిలిన పాల ముంజలను కూడా ఈ విధంగా వేయించుకుని, రుచికరమైన పాల ముంజలు అందరికి తినడానికి అందుబాటులో ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Monday, April 7, 2025, 9:10 [IST]
Desktop Bottom Promotion