Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
హెసరు కాలు ఉస్లి రెసిపిః పెసరపప్పు పొడికూర ఎలా తయారుచేయాలి
దక్షిణాది భోజన పద్ధతిలో సాధారణంగా అల్పాహార సమయంలో లేదా చిరుతిళ్ళగానో చేసుకునే వంటకం హెసరు కాలు ఉస్లి. నవరాత్రి వంటి పండగల సమయాల్లో, ఈ ఉస్లిని దేవునికి నైవేద్యంగా పెట్టి, ఉపవాసాలు ముగించాక తింటారు. నానబెట్టిన పెసరపప్పును ఉడికించి,అందులో వేయించి వేసిన దినుసులతో కలిపి వండుతారు.
ఇందులో ఉండే అధిక ప్రొటీన్, ఫైబర్ వల్ల అల్పాహారానికి సరిగ్గా సరిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పక తింటారు. తల్లులు పిల్లలకు స్కూలు తర్వాత చిరుతిండిగా దీన్ని చేసి పెడతారు. పెసరపప్పు నానబెట్టగానే, ఇక దీన్ని తయారుచేయటం తేలిక.
ఇది ఇంట్లోనే పెద్దనైపుణ్యం లేకుండానే చేసుకోవచ్చు. అందుకని దీన్ని మీరు ఇంట్లోనే తయారుచేసుకోవాలనుకుంటే, చిత్రాలు, వీడియోతో కూడిన ఇదిగో మా వ్యాసం, చదవండి.

Recipe By: అర్చన వి
Recipe Type: పక్క వంటకం
Serves: 2కి
-
జీలకర్ర - 3/4వ చెంచా
పచ్చిమిర్చి ( తరిగినది) - 1 మధ్య సైజు
అల్లం (తరిగినది) - 1/4వ అంగుళం
నూనె - 1 చెంచా
ఆవాలు - 1 చెంచా
ఇంగువ - 1/4వ చెంచా
కరివేపాకు - 6-10
ఉడికించిన హెసరు కాలు ( పెసరపప్పు) - 100గ్రాములు
ఉప్పు రుచికి
కొత్తిమీర (తరిగినది) - 2 చెంచాలు
నిమ్మరసం - అరచెక్క నిమ్మకాయ రసం
కొబ్బరి కోరు - 1/2 కప్పు
-
1. అరచెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లంను రోటిలో తీసుకోండి.
2. మెత్తగా రుబ్బండి.
3. వేడి కడాయిలో నూనె వేయండి.
4. ఆవాలు, పావు చెంచా జీలకర్ర వేసి వేయించండి.
5. ఇంగువ, కరివేపాకు కూడా జతచేయండి.
6. ఇందాక రుబ్బిన పేస్ట్ ను వేసి బాగా కలపండీ.
7. మొత్తం వేగాక, నానబెట్టి ఉడికించిన పెసరపప్పును వేసి బాగా కలపండి.
8. ఉప్పు,కొత్తిమీర వేసి బాగా కలపండి.
9. స్టవ్ ఆపేసి, నిమ్మరసం, కొబ్బరికోరును వేయండి.
10. అంతా కలిపి ఇక వడ్డించండి.
- 1. పెసలను ముందు రాత్రే నానబెట్టుకోండి.
- 2. పెసరపప్పును కుక్కర్ లో ఒక విజిల్ వచ్చేవరకూ అంతే నీళ్ళు పోసి ఉడికించండి.
- 3. విజిల్ వెంటనే తీసేయాలి. అలా అయితేనే పెసలు ఎక్కువగా ఉడకకుండా ఉంటాయి.
- వడ్డించే పరిమాణం - 1కప్పు
- క్యాలరీలు - 95 కాలరీలు
- కొవ్వు - 2.5 గ్రాములు
- ప్రొటీన్ - 5.1 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 13.3 గ్రాములు
- ఫైబర్ - 4.1 గ్రాములు
స్టెప్ బై స్టెప్ - హెసరు కాలు ఉస్లి తయారీ ఎలా
1. అరచెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లంను రోటిలో తీసుకోండి.



2. మెత్తగా రుబ్బండి.

3. వేడి కడాయిలో నూనె వేయండి.

4. ఆవాలు, పావు చెంచా జీలకర్ర వేసి వేయించండి.



5. ఇంగువ, కరివేపాకు కూడా జతచేయండి.


6. ఇందాక రుబ్బిన పేస్ట్ ను వేసి బాగా కలపండీ.



7. మొత్తం వేగాక, నానబెట్టి ఉడికించిన పెసరపప్పును వేసి బాగా కలపండి.


8. ఉప్పు,కొత్తిమీర వేసి బాగా కలపండి.



9. స్టవ్ ఆపేసి, నిమ్మరసం, కొబ్బరికోరును వేయండి.



10. అంతా కలిపి ఇక వడ్డించండి.


Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications