చలికాలంలో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినే మటర్ పరోఠా..ఎలా చేసుకోవాలంటే

Posted By:

చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది మటర్ పరోఠా తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో దీనిని ఎక్కువగా తింటారు. రైతా,చట్నీ,పచ్చడితో గానీ ఈ పరోఠాలు తింటే టేస్ట్ అదిరిపోతుంది. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతారు. అయితే ఈ మటర్ పరోఠా తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

మటర్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి-1
బఠానీలు-1 కప్పు
పచ్చిమిర్చి(కట్ చేసినది)-1
ఉప్పు-రుచికి సరిపడా
ఆయిల్-1 టేబుల్ స్పూన్
బటర్- 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి-1/2 టేబుల్ స్పూన్
గరం మసాలా-1/4టేబుల్ స్పూన్
జీలకర్ర-1 టేబుల్ స్పూన్
అల్లం-1 ఇంచు
నీరు-తగినంత
పసుపు,కారం-1/2 టేబుల్ స్పూన్

మటర్ పరోటా తయారీ విధానం
-పిండిపై ఉప్పు చల్లి మొత్తగా కలిపి పక్కన పెట్టుకోండి
-స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేసి అందులో జీలకర్ర, పసుపు పొడి, అల్లం, -పచ్చిమిర్చి వేసి వేయించండి
-ఇప్పుడు బఠానీలు కూడా అందులో వేయండి.
-10 నిమిషాల తర్వాత ఇతర మసాలాలు కూడా అందులో వేయండి
-బఠానీలు మెత్తబడే వరకు వేయించి మంట ఆపేయండి
-పిండిని మెత్తని బాల్స్ లా విభజించి, వాటిని మటర్ మిశ్రమంతో నింపండి
-దానిని రోల్ చేసి వేడి పెనం మీద వెన్న వేసి కాల్చండి.
-వేడి వేడి మటర్ పరోటా రెడీ. దీనిని రైతా లేదా పచ్చడితో తింటే టేస్ట్ అదిరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Monday, November 25, 2024, 18:35 [IST]
Desktop Bottom Promotion