Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గ్రీన్ మసాలాతో చేపల ఫ్రై : రుచి అద్భుతంగా ఉంటుంది
Fish Fry Green Masala in Telugu: సెలవుల్లో మీ ఇంట్లో ఎప్పుడూ చేపలు కొంటున్నారా? మీరు ఎప్పుడూ చేపలను ఒకే విధంగా వండుకుంటున్నారా? ఈ వారం మీరు రెగ్యులర్ గా చేసుకునే చేపల ఫ్రై కంటే కాస్త వరైటీగా ట్రై చేయండి. బోరుకొట్టకుండా ఉంటుంది?
అయితే చేపల ఫ్రైకి ఎప్పటిలాగే దుకాణంలో కొనే ఫిష్ ఫ్రై మసాలా కాకుండా ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోండి. ఇంట్లో తయారుచేసుకున్న మసాలాతో ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫ్రైని మళ్ళీ మళ్లీ ట్రై తయారుచేసుకోవాలని మీరు డిసైడ్ అయిపోతారు.
గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెసిపీ యొక్క సాధారణ వంటకం క్రింద ఉంది. చదివి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావల్సినపదార్థాలు:
* చేపలు: 1/2 kg
* ఉల్లిపాయలు - 10
* పచ్చిమిర్చి - 5
* కొత్తిమీర - 1 గుప్పెడు
* పుదీనా - 1 గుప్పెడు
* అల్లం - 1 చిన్న ముక్క
* వెల్లుల్లి - 6 రెబ్బలు
* మిరియాలు - 1/2 tsp
* జీలకర్ర - 1/2 tsp
* నిమ్మరసం - 1/2
* మిరపకాయలు - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - రుచికి సరిపడా
* కరివేపాకు - 2 రెమ్మలు
* నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేయు విధానం:
* ముందుగా చేపలను బాగా కడగాలి.
* తర్వాత మిక్సీ జార్ లో చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా,
పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర వేసి బాగా గ్రైండ్
చేసుకోవాలి.
* తర్వాత చేపలకు రుబ్బిన పేస్ట్ వేసి నిమ్మరసం, కారం పొడి, రుచికి
సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి కనీసం 1 గంట నాననివ్వాలి.
* తర్వాత స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి, అందులో వేయించడానికి
కావల్సినంత నూనె పోసి, వేడయ్యాక కరివేపాకు గుత్తి వేసి, దాని పైన చేప
ముక్కలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. చేప ముక్కలన్నీ ఇలాగే
వేయించుకుంటే రుచికరమైన గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెడీ.
Image Courtesy: Hyderabadi Ruchulu
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












