అరకు స్పెషల్ బొడ్డెంగి పురుగుల కూర, దీని ముందు మటన్ కూడా వేస్ట్.. ఎలా చేసుకోవాలంటే?

మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రకాల వంటలు ఉన్నాయి. బిర్యాని నుంచి ఆకు కూరల వరకు రకరకాల కూరలను మనవాళ్ళు చేసుకొని తింటారు. ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లోని గిరిజనలు వివిధ రకాల కూరలను, ఆరోగ్యాన్ని పంచె పురుగులను సైతం వండుకొని తింటుంటారు. అలాగే అరకు లోయ వంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలు సైతం ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు. వారి పరిసరాల్లో దొరికే ఆహార పదార్థాలతో వంటలు చేసుకొని బాగా ఇష్టంతో తింటుంటారు. అలాంటి వాటిల్లో ఒకటే బొడ్డెంగి పురుగుల కూర. అరకు లోయ వంటి ప్రాంతాల్లోని గిరిజనులు దేనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు శరీరానికి కావాల్సిన శక్తిని, పోషకాలను అందిస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. అయితే ఈ స్టోరీలో ఈ బొడ్డెంగి పురుగుల కూర ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

బొడ్డెంగి పురుగుల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు

బొడ్డెంగి పురుగులు: 250 గ్రాములు
ఉల్లిపాయలు: 2 మీడియం సైజు
టమోటాలు: 2 మీడియం సైజు
పచ్చిమిర్చి: 2-3
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
పసుపు: 1/2 టీ స్పూన్
కారం: 1 టీ స్పూన్
ధనియాల పొడి: 1 టీ స్పూన్
గరం మసాలా: 1/2 టీ స్పూన్
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా (గార్నిష్ చేయడానికి)

తయారుచేసే విధానం:

ముందుగా అడవి నుంచి సేకరించిన బొడ్డెంగి పురుగులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఆ పురుగులను మధ్యలో చీల్చి.. అందులోని ప్రోటీన్ కొవ్వు బయటికి వచ్చే విధంగా చేసుకోవాలి. ఇలా చేస్తే ఆ పురుగు సరిగ్గా ఉడకడంతో పాటు.. రుచికరంగా మారుతుందని అక్కడి ప్రజలు చెబుతుంటారు.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. దానిపై ఒక కడాయి పెట్టుకొని.. అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి బంగారు రంగులోకి మారిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన టమోటాలు, పచ్చిమిర్చి వేసి టమోటాలు మెత్తబడే వరకు ఉడికించాలి.

ఈ మసాలా కూర తింటే, నోట్లో నుంచి లాలాజలం ఏరులైపారాల్సిందే.. అద్భుతమైన రుచి.. ఎలా చేసుకోవాలంటే?

ఆ తరువాత అందులో పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగానే మసాలా వేయడం వలన ఆ రుచి సరిగ్గా పురుగులకు పట్టుకుంటుంది. ఇప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకున్న బొడ్డెంగి పురుగులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీరు వేసుకొని, కడాయి మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఆ తరువాత మూత తీసి చూస్తే కూర బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దానిపై కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే గిరిజనులకు ఎంతో ఇష్టమైన బొడ్డెంగి పురుగుల కూర సిద్ధమైనట్లే.

చిట్కాలు:

పురుగులను శుభ్రం చేసేటప్పుడు వాటి తలలను తీసివేయండి.
కూరను మరీ ఎక్కువసేపు ఉడికించవద్దు, లేదంటే పురుగులు గట్టిగా అవుతాయి.
మీ రుచికి అనుగుణంగా మసాలాల పరిమాణాన్ని మార్చుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు

ప్రోటీన్ లభిస్తుంది: బొడ్డెంగి పురుగులు ప్రోటీన్ కు మంచి మూలం. కండరాలు, కణజాలం వృద్ధికి ప్రోటీన్ చాలా అవసరం.
విటమిన్స్, మినరల్స్: వీటిలో ఐరన్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, రోగనిరోధక శక్తికి సహకరిస్తాయి.
కొవ్వులు: బొడ్డెంగి పురుగుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
ఫైబర్: వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, April 1, 2025, 8:35 [IST]
Desktop Bottom Promotion