Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
కురుక్షేత్ర యుద్ధం: మహాభారతంలోని కీలక ఘట్టాలు, అర్జునుడు, కర్ణుడి కథలు వెల్లడి -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!
బ్యాచిలర్ బ్రదర్స్..చికెన్ టిక్కాని ఈజీగా ఇలా చేసుకోండి
నాన్ వెజ్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది చికెన్. ఇతర మాంసాహారాలతో పోలిస్తే తక్కువ ధరకే చికెన్ లభిస్తుండటంతో చాలామంది నాన్ వెజ్ అంటే చికెన్ మాత్రమే అంటుంటారు. అయితే నాన్ వెజ్ ప్రియులు బటర్ చికెన్, చికెన్ మసాలా, చిల్లీ చికెన్చికెన్ టిక్కా వంటి రకరకాల వెరైటీలను తినేందుకు ఇష్టపడుతుంటారు.
అయితే చికెన్ టిక్కా చేయడానికి చాలా సమయం పడుతుందని, వండటానికి ఎక్కువ కష్టపడాలని చాలా మంది అనుకుంటారు కానీ ఈ స్పెషల్ డిష్ ను చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. బ్యాచిలర్స్ సెలవు రోజుల్లో రూమ్ లో దీనిని ఈజీగా రూమ్ లో కూర్చొని చేసుకొని ఆస్వాదించవచ్చు. అయితే ఈ చికెన్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
చికెన్ టిక్కా తయారీకి కావల్సినవి
బోన్ లెస్ చికెన్-1 కేజీ
చిక్ పెరుగు-1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్-2 స్పూన్ లు
పసుపు-1/2 టీస్పూన్ లు
ధనియాల పొడి-2 స్పూన్ లు
ఎర్ర మిరప పొడి- 1 టీస్పూన్
ఉప్పు-తగినంత
కాల్చిన శనగ పిండి- 2 స్పూన్
ఆవనూనె- తగినంత
కసూరి మెంతికూర- కావాల్సినంత
గరం మసాలా-1/2 స్పూన్
నిమ్మరసం- 2 స్పూన్ లు
చికెన్ టిక్కా తయారీ విధానం
-ముందుగా కడిగిన చికెన్ ముక్కలు, పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్,
ధనియాల పొడి, ఎర్ర కారం, ఉప్పు, వేయించిన శెనగపిండి, ఆవనూనె ,
నిమ్మరసం, గరం మసాలా పెద్ద గిన్నెలో తీసుకోవాలి.
-ప్రతిదీ బాగా కలపండి. కొన్ని గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి
-త్వరాత నాన్-స్టిక్ పాన్ వేడి చేయండి. పాన్ వేడి అయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను పాన్‌లో ఉంచండి. చికెన్ బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు.. పూర్తిగా ఉడికినంత వరకు రెండు వైపులా కనీసం 5 నుండి 8 నిమిషాలు అధిక వేడి మీద ఉడికించాలి. చికెన్ టిక్కా రెడీ అయిపోతుంది.
-ఉడికిన తర్వాత దాన్ని ఓ బౌల్ లోకి లేదా ప్లేట్ లోకి తీసుకోవాలి. వేడి వేడి చికెన్ టిక్కా తింటుంటే ఆహా అంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












