అసలు ఆరోగ్యకరమైన వడలు అంటే ఇవే, ఫైబర్, ప్రోటీన్ పుష్కలం.. ఎలా చేసుకోవాలంటే?

పచ్చి బఠాణీలు తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. పచ్చి బఠానీల్లో ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని సుద్ధి చేయడంతో పాటు కండరాల పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చి బఠానీలతో ఎంతో మేలు జరుగుతుంది. అలాంటి బఠానీలతో వడలు చేసుకునే తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా తినలేని వ్యక్తులు ఇలాంటి వదలను లొట్టలేసుకుని మరీ తినేస్తారు. అయితే ఈ వడలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పచ్చి బఠానీలతో వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు

పచ్చి బఠాణీలు - 1 కప్పు
ఉల్లిపాయలు - 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 2-3 (సన్నగా తరిగినవి)
అల్లం - చిన్న ముక్క (సన్నగా తరిగినది)
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
కరివేపాకు - కొన్ని రెబ్బలు
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం:

  1. ముందుగా పచ్చి బఠాణీలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  2. రుబ్బుకున్న బఠాణీలను ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి, బియ్యప్పిండి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి.
  3. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, వాటిని వడల్లాగా వత్తుకోవాలి.
  4. ఒక కడాయిలో నూనె వేడి చేసి, వడలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
  5. వేయించిన వడలను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసుకోవాలి అంతే.
  6. వేడి వేడి పచ్చి బఠాణీ వడలు సిద్ధమైనట్లే. వాటిని కొబ్బరి చట్నీ లేదా టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
[ of 5 - Users]
Story first published: Sunday, February 23, 2025, 10:00 [IST]
Desktop Bottom Promotion