కిరణ్ అబ్బవరం ఫేవరేట్ ఫుడ్ ఇదేనట, సింపుల్‌గా మనం కూడా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు, ఎలా అంటే?

ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఫుడ్ అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. వారు ఆహారప్రియులు. ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు. అందులో మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు. ఇటీవల మంచి మంచి సినిమాలతో హిట్ అందుకుంటున్న కిరణ్ అబ్బవరం కూడా మంచి ఆహార ప్రియుడే. ఆయనకు కుష్కా అంటే చాలా ఇష్టమట. ఆ కుష్కా కోసం పోటీ పడి మరీ.. కొట్లాడుకునేవాళ్లమని చెప్పుకోచ్చాడు. అయితే కిరణ్ అబ్బవరంకు ఎంతో ఇష్టమైన ఈ కుష్కా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కుష్కా తయారీకి కావలసిన పదార్థాలు:

బాస్మతి బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 4 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
టమాటా - 1 (సన్నగా తరిగినది)
పుదీనా ఆకులు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
గరం మసాలా - 1 టీ స్పూన్
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
లవంగాలు - 4
యాలకులు - 2
షాజీరా - 1/2 టీ స్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - 4 కప్పులు

తయారీ విధానం:

ఈ కుష్కా తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఆ నానా బెట్టిన బియ్యంపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి, నూనె వేసుకోవాలి. అవి రెండు బాగా వేడయ్యే వరకు వేడి చేసుకోవాలి.

ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని వేయించుకోవాలి. మసాలా అంతా బాగా వేగాకా.. అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు రెండూ బాగా రంగు మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

ఇప్పుడు అందులో టమాటో, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మెత్త బడేవరకు వేయించుకోవాలి. అలాగే అందులో గరం మసాలా, ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. అనంతరం బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని, మీడియం మంట మీద బియ్యం ఉడికే వరకు ఉడికించుకోవాలి. బియ్యం ఉడికాక అయిదు నిమిషాల పాటు అలానే ఉంచేస్తే ఎంతో రుచికరమైన కుష్కా సిద్ధమైనట్లే.

కిరణ్ అబ్బవరంకు ఇష్టమైన కుష్కా ఆరోగ్య ప్రయోజనాలు:

కుష్కా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. దీనిని తింటే కడుపులో తేలికగా అనిపించడంతో పాటు సులభంగా జీర్ణం అవుతుంది.
ఇది త్వరగా తయారుచేయవచ్చు.
ఇందులో ఉపయోగించే మసాలాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
కుష్కాలో పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలు ఉండటం వలన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.

[ of 5 - Users]
Story first published: Thursday, March 20, 2025, 16:31 [IST]
Desktop Bottom Promotion