Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
చలికాలంలో బాడీలో వేడిని పెంచే మూంగ్ దాల్ హల్వా..ఎలా చేయాలో చూడండి
స్వీట్లు ఇష్టపడే చాలామంది రోజుకి కొత్త కొత్త వెరైటీ సీట్లు టేస్ట్ చేయాలనిపిస్తోంది. అయితే సీజన్ ని బట్టి రకరకాల స్వీట్లు తయారుచేస్తుంటారు. చలికాలంలో ఎక్కువగా తయారుచేసే స్వీట్లలో పెసరపప్పు హల్వా లేదా మూంగ్ దాల్ హల్వా ఒకటి. ఇది మనదేశంలో చాలా పాపులర్ స్వీట్. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ మూంగ్ దాల్ హల్వాని ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని తింటుంటారు.ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది.. నోటిలోకి వెళ్ళగానే ఇట్టే కరిగిపోతుంది. దీని తీపి చాలా సమయం పాటు నోట్లో ఉంటుందట. అంతే కాకుండా ఈ హల్వా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
మూంగ్ దాల్ హల్వా తరచుగా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో తయారు చేయబడినప్పటికీ శీతాకాలంలో దాని డిమాండ్ మరింత పెరుగుతుంది. ఈ స్వీట్ పూర్తి పోషకాహారం. ఈ మూంగ్ దాల్ హల్వా తయారు చేయడం చాలా సులభం. రుచికరమైన మూంగ్ దాల్ హల్వాని ఇంట్లో ఈజీగా తయారుచేయడానికి ఏం కావాలి,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మూంగ్ దాల్ హల్వా తయారీకి కావాల్సినవి
పెసరపప్పు - 1 కప్పు (4-5 గంటలు నానబెట్టి)
నెయ్యి - 1/2 కప్పు
పాలు - 1 కప్పు
చక్కెర - 1 కప్పు
ఖోయా - 1/2 కప్పు
యాలకుల పొడి - 1/4 టేబుల్ స్పూన్
తరిగిన డ్రై ఫ్రూట్స్ నట్స్ - బాదం, జీడిపప్పు, పిస్తా
తయారీ విధానం
పెసరపప్పు పప్పును 4-5 గంటలు నానబెట్టిన తర్వాత దానిని ఫిల్టర్
చేసి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఇది చాలా చిక్కగా ఉండకూడదని
గుర్తుంచుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1/2 కప్పు నెయ్యి వేసి మీడియం
మంటపై బాగా వేయించాలి. పప్పును 15-20 నిమిషాలు బంగారు రంగులోకి
వచ్చేదాకా వేయించాలి.
పప్పులో 1 కప్పు వేడి పాలు వేసి పాలు ఆరిపోయే వరకు ఉడికించాలి
ఇప్పుడు ఈ మిశ్రమంలో చక్కెర వేసి పూర్తిగా కరిగిపోయే వరకు ఉడికించాలి.
దీని తర్వాత యాలకుల పొడి వేసి, హల్వాను బాగా కలపాలి.
చివరగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి హల్వాను అలంకరించండి. ఇప్పుడు వేడి
వేడి మూంగ్ దాల్ హల్వాను ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












