మటన్ ఖైమా పులావ్..అబ్బబ్బా ఏం టేస్ట్ గురూ వాసనే పిచ్చెక్కిస్తది,ఎలా చేసుకోవాలంటే

Posted By:

ఖైమా పులావ్..దీన్ని ఖీమా పులావ్ అని కూడా అంటారు. నాన్ వెజ్ లో ఎన్ని వెరైటీలు ఉన్నా వాటన్నింటిలో ఖైమా పులావ్ టేస్టే సపరేటు. మాటల్లో వర్ణించలేని రుచి దీని సొంతం. చాలామంది దీన్ని తినడం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏ రెస్టారెంట్ లో ఇది బాగుంటుందా అని వెతుక్కొని మరీ తింటుంటారు. వీకెండ్ వచ్చిందంటే చాలు కొన్ని ఫ్యామీలీలు ఖీమా పులావ్ కోసం చాలా దూరం ప్రయాణించి రెస్టారెంట్లకు వెళ్లి దీన్ని ఆస్వాదిస్తుంటారు.

వాస్తవానికి రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో ఇంట్లో కుక్కర్ లోనే మటన్ ఖీమా పులావ్ ని సులభంగా తయారుచేసుకోవచ్చు. ఖీమా పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

మటన్ ఖీమా పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు

-ఆయిల్
-నెయ్యి
-బాస్మతి బియ్యం
-మటన్ ఖైమా
-ఉల్లిపాయ
-కారం
-ఉప్పు
-జీలకర్ర పొడి
-గరం మసాలా
-ధనియాల పొడి
-యాలకలు
-బిర్యానీ ఆకు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-షాజీరా
-నల్ల ఇలాచీ
-కొత్తిమీర తరుగు
-పుదీనా తరుగు

Take a Poll

మటన్ ఖీమా పులావ్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేసి అందులో 1 నల్ల ఇలాచి, 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకలు, 1 టీస్పూన్ షాజీరా, 1 ఉల్లిపాయ చీలికలు వేసి వేపుకోండి.

-అందులోనే ఒక స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేపుకోండి.

-తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ బాగా వేపుకోండి.

-ఇప్పుడు అందులో పావు కిలో శుభ్రం చేసిన మటన్ ఖీమా వేసి తక్కువ మంట మీద 3 నిమిషాలు కలుపుతూ కుక్ చేయండి.

-తర్వాత అందులో అరకప్పు నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంట మీద 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

-దాదాపు నీరు ఇగిరిపోయాక అందులో కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి అందులో 300 ml వాటర్ పోసి కలపండి.

-తర్వాత అందులో గంటసేపు నానబెట్టిన పావు కేజీ బాస్మతి బియ్యాన్ని వేసి కలిపి మూతపెట్టండి.

-పెద్ద మంట మీద 2 విజిల్స్ వచ్చే దాకా కుక్ చేస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచండి. తర్వాత మూత తీస్తే వేడి వేడి ఖీమా పులావ్ రెడీ.

ప్రయోజనాలు

మటన్ ఖీమా పులావ్ అనేది రుచికరమైన, పోషకమైన వంటకం. మటన్ ఖీమాలో ఐరన్, జింక్, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో,రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కండరాల పెరుగుదల, మరమ్మత్తుకు ఇది అవసరం. ఇది ఎముకలను బలపరుస్తుంది, రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మటన్ ఖీమా పులావ్ ను మితంగా తినడం చాలా ముఖ్యం..ఎందుకంటే ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion