అచ్చ తెలుగు ఆవకాయ పచ్చడి ఇదే, ఇలా చేసుకుని తింటే.. ముద్దముద్దలో మజా! సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?

మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్ళు చాలా ఫేమస్. ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది పచ్చళ్ళను వేసుకొని, స్టోర్ చేసుకొని మరీ తింటుంటారు. వర్షాకాలంలో పనుల్లో మునిగిపోయినప్పుడు కూరగాయలు ఏమీ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీటిని వినియోగిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్లలో మామిడికాయ పచ్చడి చాలా ఫేమస్. దీంతో పాటు నిమ్మకాయ, టమాటో, ఉసిరి ఇలాంటి పచ్చళ్ళు కూడా చాలా మాది వేసుకొని తింటారు. మామిడికాయ పచ్చడికి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది.

అయితే కాలం మారుతున్న కొద్దీ పచ్చళ్ళు వేసుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోతుంది. చాలా మంది ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకొని తింటున్నారు. అవి అంత రుచిగా ఉండకపోవడం పైగా ధర కూడా అధికంగా ఉండడం, ఎక్కువ రోజులు నిలువ ఉండకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈ స్టోరీలో పాతకాలంలో మా అమ్మమ్మలు, నానమ్మలు ఏ విధంగా పచ్చడి వేసుకునేవారో, ఆ విధంగా మామిడికాయ, నిమ్మకాయ పచ్చడి ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.

మామిడికాయ పచ్చడి వేసుకునే విధానం..

కావలసిన పదార్థాలు:

మామిడికాయ ముక్కలు: 1 కిలో
ఆవపిండి: 150 గ్రాములు
కారం: 150 గ్రాములు
ఉప్పు: 100 గ్రాములు
మెంతులు: 25 గ్రాములు
నూనె: 250 మి.లీ
వెల్లుల్లి రెబ్బలు: 10
కరివేపాకు: కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత వాటిపై ఉండే నీరు మొత్తం ఆరిపోయాకా.. దానిని ఒక గుడ్డతో మంచిగా నీటిగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఆ మామిడి కాయలను సరిగ్గా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. ముక్కలు కోసుకుని సమయంలో ముక్కలు నుజ్జు నుజ్జు అవ్వకుండా చూసుకోవాలి. అలా కోసి పెట్టుకున్న ముక్కలను ఒక తెల్ల బట్ట మీద వేసుకొని, ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలో తేమ ఎక్కువగా ఉంటే.. ఆ పచ్చడి త్వరగా పాడైపోతుంది. అందుకే జాగ్రత్తగా ఆరబెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెను శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. అందులో పచ్చడికి సరిపడా నూనె వేసుకోవాలి. ఆ నూనెను బాగా వేడి చేసుకోవాలి. అలాగే అందులో వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తరువాత ఆ నూనెలోనే వాటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె కొంచెం చల్లబడాలి. అప్పటి వరకు దానిని పక్కన పెట్టుకోవాలి.

Take a Poll

ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న ముక్కలకు.. మనం తయారు చేసి పెట్టుకున్న ఆవపిండి, కారం మిశ్రమాన్ని మామిడి ముక్కలపై వేసుకోవాలి. ఆ తరువాత ఆ మిశ్రమం ముక్కలకు పట్టుకునే విధంగా బాగా కలపాలి. ఆ మిశ్రమం అంతా ముక్కలకు దిట్టంగా పట్టుకున్న తరువాత.. దానిపై నుంచి వేడి చేసుకొని పెట్టుకున్న నూనెను వేసుకొని ఒక గరిటె తీసుకొని నూనె మొత్తం బాగా కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చడిని ఒక జాడి తీసుకొని అందులో పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. ఆ తరువాత మూడు రోజుల పాటు దానిని అలానే ఉంచేయాలి. మూడు రోజుల తరువాత పచ్చడి ఊరి తినడానికి సిద్ధంగా ఉంటుంది.

మామిడి కాయ పచ్చడి వేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మామిడికాయలు పుల్లగా ఉండాలి.
మసాలాలు తాజాగా ఉండాలి.
పచ్చడిని శుభ్రమైన జాడీలో నిల్వ చేసుకోవాలి.
పచ్చడిని ఎప్పుడూ పొడి చేతులతో తియ్యాలి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion