Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
సమ్మర్ లో సమ్మగా..కమ్మగా రాగి ఊతప్పం..శరీరంలో వేడి తగ్గిస్తుంది..
Ragi Uttapam Recipe రాగి ఊత్తప్పం ఆరోగ్యకరమైనది మరియు రుచికరమైనది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే రాగుల్లో ఎక్కువగా ప్రోటీన్, ఐరన్, ఖనిజాలు మరియు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా పాతకాలపు వంటకం. రాగి దోసెనే కాస్త వరైటీగా మరింత మందంగా సాఫ్ట్ గా ఉల్లి పచ్చిమిర్చితో తయారుచేసుకునే ఓ ప్రత్యేక వంటకం ఇది.
వేసవి కాలంలో వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో రాగులు ఉత్తమం. అంతే కాదు ఆయుర్వేదం ప్రకారం, రాగులు శరీరంలో విషవ్యర్థాలను తొలగిస్తుంది. రాగులు ప్రోటీన్ మరియు ఖనిజాలకు స్టోర్హౌస్ వంటిది. శాఖాహారులకు మంచి ప్రోటీన్ అందిస్తుంది. ఇది బ్రేక్ ఫాస్ట్ లో పోషకాలను పెంచుతుంది.
రాగులుట్ గ్లూటెన్ రహిత ధాన్యం. రాగుల్లో కాల్షియం, ప్రొటీన్ మరియు డైటరీ ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. దీని ఉపయోగం మన శరీరంలో కాల్షియం లోపాన్ని తీర్చడానికి సహాయపడుతుంది. రాగులు తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా రాగులతో తయారుచేసిని వంటలు శరీరంలో రక్త కొరతను దూరం చేసుకోవచ్చు. సాధారణంగా రాగి ముద్ద మరియు రాగి రొట్టి, రాగి దోసె తింటారు. వీటికి బదులుగా మీరు రాగి రాగి ఊత్తప్పాన్ని కూడా ప్రయత్నించవచ్చు. ఇది చాలా రుచికరమైన మరియు పోషకమైనది. బరువు తగ్గాలనుకునే వారు కూడా దీన్ని తినవచ్చు. ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ది బెస్ట్ రిసిపి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం. దీన్ని మీరు కూడా ప్రయత్నించి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
రాగి ఉత్తప్ప చేయడానికి కావలసిన పదార్థాలు-
* 1/2 కప్పు మిల్లెట్
* 1/3 కప్పు బియ్యం
* 1/4 కప్పు మినప్పప్పు
* 1 టొమాటో 3-4
* పచ్చిమిర్చి 4-6 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
* ఉల్లిపాయలు 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
* మెంతి గింజలు 2-3 టేబుల్ స్పూన్లు
* కొత్తిమీర ఆకులు 2-3 టేబుల్ స్పూన్లు
* నూనె సరిపడా
* ఉప్పు రుచికి సరిపడా
రాగి ఉత్తప్పను ఎలా తయారు చేయాలి?
* రాగి ఉత్తప్ప చేయడానికి, ముందుగా మిల్లెట్ మరియు బియ్యాన్ని
శుభ్రం చేయండి.
* తర్వాత మినపప్పు మరియు మెంతి గింజలను వేసి, వటిని కూడా నీళ్ళు పోసి
శుభ్రంగా కడిగి వాటన్నింటినీ వేర్వేరు కంటైనర్లలో సుమారు 5-6 గంటలు
నానబెట్టండి.
* తర్వాత మొదటగా మినపప్పు,మెంతి మిశ్రమాన్ని మిక్సర్ జార్ లో వేసి
మెత్తగా పేస్ట్ చేయాలి.
* దానిని మరో పాత్రలో పోసి, అదే జార్ లో రాగులు మరియు బియ్యాన్ని వేసి
రుబ్బుకోవాలి. దీన్ని ముందుగా గ్రైండ్ చేసిన పప్పులో కలపండి.
* ఇది సుమారు 8 గంటలు పులియనివ్వండి. పిండి బాగా పులిసిన తర్వాత
రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
* ఇప్పుడు టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును
కొద్దికొద్దిగా వేయాలి.
* నాన్-స్టిక్ పాన్ వేడి చేసి, కొద్దిగా నూనె రాసి, అది వేడెక్కిన
తర్వాత, దోస పిండిని ఒక గేరెటడు వేసి వృత్తాకారంలో వేయండి. ఊతప్పంను
మీడియం మంటలో ఉడికించాలి.
* మూత పెట్టి రెండువైపులా ఉడికిస్తే రాగి ఉత్తప్ప రుచిగా ఉంటుంది.
దీన్ని కొబ్బరి చట్నీతో వేడిగా ఆస్వాదించండి.
Image courtesy
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











