Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
రవ్వ,సేమియాతో క్రిస్పీ దోశ..15 నిమిషాల్లోనే చేసుకోవచ్చు..ఎలాగంటే..
దక్షిణ భారతదేశంలో పొద్దున్నే ఏ హోటల్ కి వెళ్లినా దొరికే ఆహారపదార్థం దోశ. చాలామంది తమ ఇళ్లల్లో పొద్దున్నే చేసే బ్రేక్ ఫాస్ట్ లో ఇదే ప్రధానమైనది. క్త్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందిన తమిళ సాహిత్యంలో దోశను పోలిన వంటకం గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. చరిత్రకారుడు పి. తంకప్పన్ నాయర్ ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి పట్టణంలో దోశ ఉద్భవించిందని చెబుతారు. దోశ తినని తెలుగువారుండరు. అయితే దోశలో బోలెడు వెరైటీలు ఉంటాయి. నీర్ దోశ,అడై దోశ నీర్ దోశ ఎగ్ దోశ, నెయ్యి దోశ, పేపర్ దోశ, పనీర్ దోశ, చీజ్ దోశ, మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, పెసర దోశ ఇలా బోలెడు వెరైటీలు ఉంటాయి.
సేమియాతో చేసే దోశ ఎప్పుడైనా తిన్నారా? సేమియా దోశ అనేది అప్పటికప్పుడు తయారుచేసుకునే దోశ. ఇది సేమియా,రవ్వ,బియ్యపు పిండితో తయారుచేస్తారు. దీనిని చాలా త్వరగా,ఈజీగా తయారుచేసుకోవచ్చు. దీనికి పులియబెట్టనవసరం కూడా లేదు. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి అయినా లేదా నైట్ డిన్నర్ లో కూడా మంచి ఆప్షన్. సేమియా దోశ తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సేమియా దోశ తయారీకి కావలసిన పదార్థాలు
-సేమియా-అరకప్పు
-రవ్వ-అరకప్పు
-బియ్యం పిండి-అరకప్పు
-ఉల్లిపాయ-1
-పచ్చిమిర్చి తరుగు-1 టేబుల్ స్పూన్
-జీలకర్ర-1 టేబుల్ స్పూన్
-ఉప్పు-రుచికి సరిపడా
-నీళ్లు-4 కప్పులు
-కరివేపాకు
-టమాటో
-క్యారెట్
-అల్లం
-కొత్తిమీర
-ఆయిల్
-రవ్వ
ఆంధ్రా స్పెషల్ చింతచిగురు గుత్తివంకాయ కూర..వాసనకే ముత్తాతలు కూడా దిగొస్తారు..ఎలా చేయాలో చూడండి
సేమియా దోశ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో సేమియా వేసి వేయించుకోవాలి. ఆయిల్ లేకుండానే వేయించాలి.
-తర్వాత ఓ గిన్నెలో వేయించిన సేమియా,బియ్యం పిండి,రవ్వ,జీలకర్ర, ఉప్పు,4 కప్పుల నీళ్లు పోసి కలిపి మూతపెట్టి పావుగంట సేపు పక్కనపెట్టుకోండి
-తర్వాత మూత తీసి అందులో ఎండుమిర్చి పొడుం,టమాటో ముక్కలు,ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు,కరివేపాకు తరుగు, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలపాలి.
-తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టి వేడి చెయ్యాలి. పెనం వేడెక్కాక బాగా కలిపిన పిండిని 1 గరిటతో దోశలా పోసుకుకోవాలి. దాని మీద ఆయిల్ చుక్కలు వేసి బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకొని పెనం మీదనుంచి తీసేయాలి. అంతే సేమియా దోశ రెడీ. నచ్చిన చట్నీతో దీనిని ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










