Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
Egg Dum Biryani : గుడ్డుతో రుచికరమైన దమ్ బిర్యానీ..ఒకసారి రుచి చూస్తే మొత్తం మీరే లాగించేస్తారు
Spicy Egg Dum Biryani : మన రోజు వారి ఆహారంలో గుడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. రోజుకు ఒక గుడ్డు తినమని డాక్టర్లు, న్యూట్రీషియన్లు సూచిస్తుంటారు. గుడ్డులో ఉండే ప్రోటీన్లు పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుడ్డును వివిధ వరైటీల్లో వండుకుని తినడం అంటే చాలా మందికి ఇష్టం. గుడ్డుతో ఆమ్లెట్, వేపుడు, ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఎగ్ బుర్జీ ఎగ్ కుర్మా ఇలా రకరకాలుగా వండుకుని తింటాం.
అయితే ఈ రోజు మీ కోసం ఎగ్ దమ్ బిర్యానీని పరిచయం చేస్తున్నాం. ఎప్పుడూ చికెన్, మటన్ తో బిర్యానీ తయారుచేసుకోవడం కామన్. కాబట్టి ఈ వాళ ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేద్దాం. దీన్ని చాలా సులభంగా త్వరగా తయారుచేసుకోగల రుచికరమైన బిర్యానీ మరికెందుకు ఆలస్యం వెంటనే ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం. మీరు కూడా ట్రై చేసి, రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
కావల్సిన పదార్థాలు..
గుడ్లు: 5(ఉడికించి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 1 కప్పు (బాగా సన్నగా తరిగి నూనెలో వేసి బ్రౌన్ కలర్
వచ్చే వరకూ వేగించుకోవాలి)
పచ్చిమిర్చి 5 లేదా 6(మీ రుచికి సరిపడా పెంచుకోవచ్చు)
టమోటాలు : 2
పెరుగు : 1/2 cup
దాల్చిన చెక్క: అంగుళమంత
కారం పొడి: 1tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా: 1tsp
పసుపు : 1/4tsp
షాజీరా : 1tsp
లవంగాలు : 4
యాలకులు: 2
మరాఠి మొగ్గ: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tsp
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తిమిరీ, పుదీనా తరుగు : 1:1 కప్పు
నెయ్యి : కొద్దిగా
నూనె : 1/4కప్పు
తయారుచేయు విధానం:
ముందుగా గరం మసాలా పొడి తయారుచేసుకుందాం
మిరియాలు: 1/2tsp, జీలకర్ర : 1/2tsp, గసగసాలు: 1tsp, దాల్చిన చెక్క : చిన్న ముక్క, లవంగాలు: 5, యాలకులు: 3, అనాస పువ్వు: 1, జాపత్రి: 1, జీడిపప్పు పలుకులు: 1tbsp, ధనియాలు: 1tbsp
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు:
నానబెట్టిన బాస్మతీ బియ్యం: 1/2kg (2 గ్లాసులు)
నీళ్లు : 1 1/2 గ్లాసు
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 3
యాలకులు :2
షాజీరా : ఒక టీ స్పూన్
బిర్యానీ ఆకు: 1
ఉప్పు : రుచికి తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
తరిగిన పుదీనా: కొద్దిగా,
తరిగిన కొత్తిమీర: కొద్దిగా.
ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేయు విధానం..
1. ముందుగా మనం మసాలా పొడిని సిద్దం చేసుకోవాలి. దానికోసం సపరేట్
గా తీసుకున్న మసాలా దినుసులన్నీ లైట్ గా వేయించి చల్లార్చి మిక్సీ
జార్ లో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక బ్లౌల్లో తీసి పక్కన
పెట్టుకోవాలి.
2.తర్వాత అదే జార్లో టమోటో , పచ్చిమిర్చి ముక్కలు వేసి కచపచాగా
గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో పసుపు, ఉప్పు, కారం
వేసి మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి.
4. ఇక బిర్యానీ రైస్ కోసం ఒక గిన్నెలో ఒకటికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు
పోసి స్టౌ మీద పెట్టి వేడిచేయాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో రైస్
కోసం తీసిపెట్టుకున్న మసాలా దినుసులు అల్లం పేస్ట్, ఉప్పు, కొత్తిమీర,
పుదీనా తరుగు వేసి నీటిని మరిగించాలి.
5. ఎసరు మరిగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ను
వేసి 80శాతం ఉడికించుకోవాలి.
6. బియ్యం ఉడికేంతలోపే మరో స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఒక స్పూన్
నూనె వేసి వేడిచేయాలి.
7. ఇప్పుడు కాగే నూనెలో ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లకు చాకుతో
గాట్లు పెట్టి, నూనెలో వేసి వేగించుకోవాలి. గుడ్డు వేగేటప్పుడు
కొద్దిగా ఉప్పు, కారం, పసుపు కూడా జోడించి వేగించి పక్కన
పెట్టుకోవాలి.
8. ఇక అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడిఅయ్యాక మసాలా దినుసులు
వేసి వేయించాలి.తర్వాత అల్లం వెల్లుల్లిపేస్ట్ కూడా వేసి పచ్చివాసన
పోయే వరకు వేగించుకోవాలి.
9. అదే సమయంలో టమోటో పేస్ట్, పెరుగు మిశ్రమం వేసి నూనె పైకి తేలే వరకు
వేయించాలి.
10. ఇప్పుడు అందేలోనే ముందుగా వేగించి పెట్టుకున్న ఉల్లిపాయముక్కలు,
మసాలా పొడి , కొత్తిమీర, పుదీనా తరుగు ఇలా అన్నీ వేసి మరో 5 నిముషాలు
సన్నని మంట మీద వేగించుకోవాలి.
11. తర్వాత ముందుగా వేగించి పెట్టుకున్న గడ్లను అదేపాన్ లో కొన్ని
నీళ్ళు గుడ్లుతో పాటు స్టౌ మీద పెట్టి 5 నిముషా ఉడికించాలి. 5 నిముషాల
తర్వాత సగం గుడ్లను పక్కకు తీసుకుని సగం ఉడికిని బాస్మతి అన్ని, దాని
మీద కొత్తిమీర, పుదీనా తరుగు, వేయించిన బ్రౌన్ ఆనియన్ లేయర్స్ గా వేసి
గరిటతో సర్దుకోవాలి.
12. దీని మీద మసాలా మిశ్రమం మిగిలిన కోడిగుడ్లు మళ్ళీ లేయర్స్ గా
కొత్తిమీర, పుదీనా బ్రౌన్ ఆనియన్, చల్లుకుని నెయ్యి చిలకరించి దానీ
మీద పాలలో కలుపుకున్న ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు.
13. అంతే రైస్, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్, మసాలాలతో లేయర్ గా
గిన్నె మొత్తం నిపించిన తర్వాత పాన్ మీద మూత పెట్టి ఆవిరి మీద
ఉడికించుకోవాలి. ఎక్కువ మంట మీద 5 నిముషాలు ఉడికించిన తర్వాత, మరో
స్టౌ మీద దమ్ పాన్ లేదా ఐరన్ దోస పాన్ పెట్టి దానీ మీద ధమ్ అవుతున్న
గిన్నె పెట్టి మీడియం మంట మంది 5 నుండి 10 నిముషాలు దమ్ కానీంచి స్టౌ
ఆఫ్ చేసుకోవాలి.
అంతే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. దీన్ని పెరుగు రైతా లేదా మిర్చీకా సాలన్
తో వేడి వేడి గా వడ్డించండి. ఇలా చేసిన ఎగ్ దమ్ బిర్యానీని అందరూ చాలా
ఇష్టంగా తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













