Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పుల్లగా కారంగా టేస్టీగా చింతకాయ పప్పు చారు రెసిపీ..!
ఆరోగ్యానికి వైటమిన్ సి చాలా ముఖ్యం. వైటమిన్ సీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయ్. వైటమిన్ సి వున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కరోనా సమయంలో వైద్యులు మనల్ని వైటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలని చెప్పిన విషయాన్ని మరువరాదు. ఇప్పటి ఇదే వైటమిన్ సి పుష్కలంగా వుండే వంటకం చింతకాయ పప్పుచారు రెసిపీని మీకోసం తీసుకొని వచ్చాం. చింతకాయలో వైటమిన్ సి, పప్పుల్లో ప్రొటీన్లు ఇక రెండూ కలిస్తే శరీరానికి మెండుగా పోషకాలు అందినట్టే. చింతకాయ పప్పుచారును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
చింతకాయ పప్పు చారు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్లు
కందిపప్పు, చింతకాయలు, పసుపు, కరివేపాకులు, పచ్చిమిరపకాయుల, నూనె, ఉప్పు, కారం, జిలకర, ఆవాలు, వెల్లుల్లి, ఎండిమిరకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఇంగువ, కరివేపాకులు.
చింతకాయ పప్పు చారు తయారు చేసే విధానం
ముందుగా కుక్కర్లోకి 200 గ్రాముల వరకు కందిపప్పును తీసుకోవాలి. ఈ పప్పును బాగా కడగాలి. ఎలాంటి చెత్తా లేకుండా జాగ్రత్త పడాలి. కడిగిన తరువాత ఇందులో రెండు కప్పుల నీళ్లను తీసుకొని పప్పును బాగా నానబట్టాలి. ఇలా కందిపప్పును నానబెట్టడం ద్వారా బాగా ఉడుకుతుంది. అరగంట తరువాత కందిపప్పును బాగా ఉడికించాలి. ఇందులో అరటీస్పూన్ పసుపుని, కొన్ని కరివేపాకులను వేసుకోవాలి, కట్ చేసిన నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నూనె పోసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ పై పెట్టాలి. పప్పు ఉడికేలోగా చింతకాయలను కడగాలి.
ఒక బౌల్లో 150 గ్రాముల వరకు చింతకాయలను తీసుకొని నీళ్లతో బాగా కడగాలి. బౌల్లో నీటిని మొత్తం నింపుకొని చింతకాయలను స్టవ్ పై ఉడికించాలి. చింతకాయపైన పొట్టు వేరు అయ్యేంత వరకు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి చింతకాయలు చల్లారేంత వరకు బౌల్‌ను పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు పప్పు కుక్కర్‌ను స్టవ్ పై నుంచి కిందకు దింపుకోవాలి. పప్పు బాగా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. పప్పు గుత్తితో పప్పు మెత్తగా రుబ్బుకోవాలి. చింతకాయలు ఉడకబెట్టిన బౌల్‌లోని నీటిని పక్కకు తీసుకోవాలి. మళ్లీ చింతకాయ బౌల్లో కొన్ని నీళ్లను పోసి చింతకాయలను బాగా పిసుకుతూ ఆ రసం బయటకు వచ్చేలా చేసుకోవాలి. ఈ చింతకాయ రసాన్ని పప్పులోకి తీసుకోవాలి. కుక్కర్లో పప్పు చారుకు సరిపడా నీళ్లను యాడ్ చేసుకోవాలి.
ఇందులో ఒక టీస్పూన్ కారాన్ని, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు రుచిగా వచ్చిందా లేదా సాంపుల్ టేస్ట్ చూడాలి. ఒక ఖాలీ ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెలో పోసుకోవాలి. నూనె వేడయిన తరువాత అదటీస్పూన్ జిలకర, అరటీస్పూన్ అవాలును యాడ్ చేసుకోవాలి. ఇందులో దంచిన వెల్లుల్లిపాయలను ఒక టీస్పూన్ వరకు తీసుకోవాలి. రెండు మూడు ఎండి మిరపకాయలను, రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో పావు టీస్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులను కూడా యాడ్ చేసుకోవాలి.
పోప్లో సన్నగా తరిగిన టమాటలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోప్ మొత్తం ఫ్రై అయిన తరువాత ఇందులో ఉడకబెట్టిన పప్పును పోసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ప్యాన్‌లోని పప్పును 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇక దీంతో మన చింతకాయ పప్పు చారు రెడీ అయినట్టే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












