ఉడిపి స్టైల్ టమోటో దోసె : బ్రేక్ ఫాస్ట్ కు భలే రుచిగా ఉంటుంది

Posted By:

Udupi Tomato Dosa మీరు రోజూ ఒకేరకమైన దోసె తిని బోరుకొడుతోందా? ఉదయం పూట ఇంట్లో దోసె ఎక్కువగా చేసేవారైతే ఈ రోజు కాస్త వరైటీగా గా దోసె తయారుచేసుకోండి. అందుకోసం ఒకసారి ఉడిపి టొమాటో దోసె చేసుకోండి. ఈ టొమాటో దోసె రవ్వ దోసెను పోలి ఉంటుంది.

ముఖ్యంగా ఇంట్లో దోసె పిండి లేనప్పుడు దోసె వేసుకోవాలంటే ఈ దోసె చేసి తినొచ్చు. ఈ టొమాటో దోసె కోసం కొబ్బరి చట్నీ గొప్ప సైడ్ డిష్ చేస్తుంది. మరీ ముఖ్యంగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు.

ఉడిపి టమాటా దోసె ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉడుపి టొమాటో దోస చాలా సింపుల్ రిసిపి. 10 నిమషాల్లో తాయారుచేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావల్సిన పదార్థాలు:
* టొమాటోలు - 2
* చిన్న ఉల్లిపాయలు - 5-6
* వెల్లుల్లి - 4
* గోధుమ పిండి - 1/4 కప్పు
* బియ్యం పిండి - 1/2 కప్పు
* మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - రుచి ప్రకారం
* కొత్తిమీర - కొద్దిగా
* జీలకర్ర - 1/2 tsp
* నీరు - పిండి కలుపుకోవడానికి సరిపడా
* నూనె -తగినంత

తయారుచేయు విధానం:
* ముందుగా టొమాటోను మిక్సీ జార్ లో ముక్కలుగా చేసుకోవాలి.
* తర్వాత అందులో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి.
* తర్వాత ఒక బౌల్లో 1/4 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యప్పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
* తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి బాగా రుబ్బుకోవాలి.
* తర్వాత ఒక గిన్నెలో గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమాన్ని పోసి, అందులో సన్నగా తరిగిన కొత్తిమీర మరియు 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి, రవ్వ దోసలా పిండి కలుపుకోవడం కోసం అవసరమైన నీరు వేసి బాగా కలపాలి.
* చివరగా స్టౌ మీద పాన్ పెట్టి అందులోకి చెంచా కలిపిన పిండిని రవ్వ దోశలా కాల్చి నూనె వేసి బంగారు రంగు వచ్చేవరకు ఉడికించుకుంటే రుచికరమైన ఉడిపి టమాటా దోసె రెడీ.
Image Courtesy: Dindigul Food Court

[ of 5 - Users]
Story first published: Saturday, September 14, 2024, 10:07 [IST]
Desktop Bottom Promotion