దోశను మించిన టిఫిన్ ఇది.. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు, ఇంట్లో ఎలా చేసుకోవాలంటే?

ఉదయాన్నే టిఫిన్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఇడ్లీ, దోష, బోండా, పూరి మాత్రమే. కానీ మీరెప్పుడైనా ఊతప్పం ట్రై చేశారా?. ఊతప్పం అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన అల్పాహారం. ఇది దోస పిండితో తయారు చేస్తారు. కానీ దీనికి ఉల్లిపాయలు, టమోటాలు, మిరియాలు, కొత్తిమీర వంటి కూరగాయలు వేసుకుంటారు. అసలు ఈ ఊతప్పం ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

దోస పిండి - 2 కప్పులు
ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
టమోటా - 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 2 (చిన్నగా తరిగినది)
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా తరిగినది)
ఉప్పు - రుచికి తగినంత
నూనె - కాల్చడానికి తగినంత

తయారీ విధానం:

ఒక గిన్నెలో దోస పిండి, ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తరువాత పెనం వేడి చేసి నూనె వేయాలి.

ఇప్పుడు పిండిని పెనంపై వేసి పలుచగా పరచాలి. అనంతరం ఊతప్పం ఒక వైపు బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. దీంతో పాటు ఊతప్పంను మరోవైపు తిప్పి కాల్చాలి. ఆ తరువాత ఓ ప్లేట్‌లో తీసుకోవాలి. ఇలా పిండితో మొత్తం ఊతప్పం వేసుకోవాలి. అనంతరం వేడి వేడిగా చట్నీతో లేదా సాంబార్తో సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన ఊతప్పం సిద్ధమైనట్లే.

[ of 5 - Users]
Desktop Bottom Promotion