For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పలు రకాల హలీమ్ లను మీ ఇంట్లో ఇలా చేసుకోండి.. అదరిపోద్ది.. లొట్టలేసుకుంటూ తింటారు

రంజాన్ మాసం వస్తోందంటే ముసల్మానులంతా ఉపవాసాలకు సిద్ధమవుతూ ఉంటారు. అయితే మిగతావారంతా హలీమ్ తినడానికి సిద్ధపడుతూ ఉంటారు. దుకాణాలు తెరిచీ తెరవగానే వాటి ముందు క్యూ కడుతుంటారు. లొట్టలేసుకుంటూ హలీమ్ తింటారు

By Arjun Reddy
|

ప్రేమకి కులం, మతం ఉండవంటారు. ప్రేమకే కాదు... ఫుడ్ కీ కూడా ఉండదు అని ఓ వంటకం నిరూపించింది. ఒక మతానికి చెందిన పవిత్ర ఆహారమైనా... ప్రతి మతం వారికీ ప్రీతిపాత్రమయ్యింది. ప్రపంచమంతటా తన పేరు మారుమోగేలా చేసుకుని ఏ ఆహారమూ సంపాదించనంత కీర్తిని మూటగట్టుకోవడం దానికే చెల్లింది. ఇంతకీ ఏమిటది? ఇంకా చెప్పాలా... అర్థమైపోలేదూ... హలీమ్. అవును. ఇది వంటకాలకే రారాజు. రుచుల్లో మహారాజు.

లొట్టలేసుకుంటూ

లొట్టలేసుకుంటూ

రంజాన్ మాసం వస్తోందంటే ముసల్మానులంతా ఉపవాసాలకు సిద్ధమవుతూ ఉంటారు. అయితే మిగతావారంతా హలీమ్ తినడానికి సిద్ధపడుతూ ఉంటారు. దుకాణాలు తెరిచీ తెరవగానే వాటి ముందు క్యూ కడుతుంటారు. లొట్టలేసుకుంటూ హలీమ్ ని లాగించేస్తుంటారు. మరి వివిధ రకాల హలీమ్ లను ఎలా తయారు చేయాలో చూద్దామా.

మటన్ హలీమ్

మటన్ హలీమ్

కావాల్సినవి : మటన్ : అర కేజీ, గోధుమరవ్వ : 250 గ్రా., నెయ్యి : 100 గ్రా., బ్రౌన్ ఆనియన్ : 50 గ్రా., పచ్చిమిర్చి : 6, మిరియాలు : 10 గ్రా., కరివేపాకు : 2 రెమ్మలు, షాజీరా : 10 గ్రా., దాల్చినచెక్క : 10 గ్రా., బిర్యానీ ఆకు : 4, నిమ్మకాయ : 1, జీడిపప్పు : 50 గ్రా., కారం : నాలుగు టీస్పూన్స్, ఇలాయిచీ పొడి : అర టీస్పూన్ , పసుపు : పావు టీస్పూన్, పుదీనా : ఒక కట్ట, కొత్తిమీర : ఒక కట్ట, ఉప్పు : తగినంత

మటన్ హలీమ్

మటన్ హలీమ్

కావాల్సినవి : మటన్ : అర కేజీ, గోధుమరవ్వ : 250 గ్రా., నెయ్యి : 100 గ్రా., బ్రౌన్ ఆనియన్ : 50 గ్రా., పచ్చిమిర్చి : 6, మిరియాలు : 10 గ్రా., కరివేపాకు : 2 రెమ్మలు, షాజీరా : 10 గ్రా., దాల్చినచెక్క : 10 గ్రా., బిర్యానీ ఆకు : 4, నిమ్మకాయ : 1, జీడిపప్పు : 50 గ్రా., కారం : నాలుగు టీస్పూన్స్, ఇలాయిచీ పొడి : అర టీస్పూన్ , పసుపు : పావు టీస్పూన్, పుదీనా : ఒక కట్ట, కొత్తిమీర : ఒక కట్ట, ఉప్పు : తగినంత

తయారీ ఇలా

తయారీ ఇలా

ముందుగా గోధుమ రవ్వని అరగంటపాటు నీటిలో నానబెట్టాలి. మటన్‌ని బాగా కడిగి పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి వేసి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టాలి. పెద్ద గిన్నెలో నెయ్యి వేయాలి. దీంట్లో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి దోరగా వేయించాలి.

ఉడికించుకున్న మటన్

ఉడికించుకున్న మటన్

ఇవి వేగాక.. ఇందులో ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకోవాలి. కాసేపటి తర్వాత నానబెట్టిన రవ్వ, జీడిపప్పు వేసి తగినంత నీళ్లు పోస్తూ రవ్వ ఉడికేవరకు బాగా కలుపుతూ ఉండాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి కలుపుతుండాలి. బాగా ఉడికిందనుకున్న తర్వాత దించేయాలి.

 మిక్సీ చేసుకోవాలి

మిక్సీ చేసుకోవాలి

కాసేపు చల్లారనిచ్చి ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరో గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, బ్రౌన్ ఆనియన్, రుబ్బుకున్న మటన్ మిశ్రమం వేయాలి. కాసేపు అలాగే ఉంచి నిమ్మరసం, ఇలాయిచీ పొడి వేసి దించుకోవాలి. పైన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్‌తో గార్నిష్ చేసి తినడమే.

ఫిష్ హలీమ్

ఫిష్ హలీమ్

కావాల్సినవి : చేపలు : అర కేజీ, గోధుమరవ్వ : 250 గ్రా., నెయ్యి : 100 గ్రా., బ్రౌన్ ఆనియన్ : 50 గ్రా., పచ్చిమిర్చి : 6, మిరియాలు : 10 గ్రా., కరివేపాకు : 2 రెమ్మలు, షాజీరా : 10 గ్రా., దాల్చినచెక్క : 10 గ్రా., బిర్యానీ ఆకు : 4, నిమ్మకాయ : 1, జీడిపప్పు : 50 గ్రా., కారం : నాలుగు టీస్పూన్స్, ఇలాయిచీ పొడి : అర టీస్పూన్, పసుపు : పావు టీస్పూన్, పుదీనా : ఒక కట్ట, కొత్తిమీర : ఒక కట్ట, ఉప్పు : తగినంత

ఫిష్ హలీమ్ తయారీ ఇలా

ఫిష్ హలీమ్ తయారీ ఇలా

రవ్వను అరగంట పాటు నీటిలో వేసి నానబెట్టాలి. చేపలను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీంట్లో పసుపు, కారం, ఉప్పు, వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి వేయించాలి. ఇందులో చేప ముక్కలను వేసి కలుపుతూ ఉండాలి.

చేపల మిశ్రమాన్ని వేసి

చేపల మిశ్రమాన్ని వేసి

దీంట్లోనే నానబెట్టిన రవ్వ, జీడిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోస్తూ రవ్వ ఉడికేవరకు బాగా కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు ఉప్పు, కారం వేసి మరికాసేపు ఉడికించాలి. దీన్ని దించేసి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో నెయ్యి వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, బ్రౌన్ ఆనియన్ వేసి దోరగా వేయించాలి. చేపల మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపాలి. నిమ్మరసం, ఇలాయిచీ పొడి వేసి దించేయాలి. చివరగా కొత్తిమీర, పుదీనా అందంగా గార్నిష్ చేయాలి. వేడివేడిగా లాగిస్తే టేస్టీగా ఉంటుంది.

రొయ్యల హలీమ్

రొయ్యల హలీమ్

కావాల్సినవి :

రొయ్యలు : 500 గ్రా., గోధుమరవ్వ : 250 గ్రా., నెయ్యి : 100 గ్రా., బ్రౌన్ ఆనియన్ : 50 గ్రా., పచ్చిమిర్చి : 6, మిరియాలు : 10 గ్రా., కరివేపాకు : 2 రెమ్మలు, షాజీరా : 10 గ్రా., దాల్చినచెక్క : 10 గ్రా., బిర్యానీ ఆకు : 4, నిమ్మకాయ : 1, జీడిపప్పు : 50 గ్రా., కారం : నాలుగు టీస్పూన్స్, ఇలాయిచీ పొడి : అర టీస్పూన్, పసుపు : పావు టీస్పూన్, పుదీనా : ఒక కట్ట, కొత్తిమీర : ఒక కట్ట, ఉప్పు : తగినంత

రొయ్యల హలీమ్ తయారీ ఇలా

రొయ్యల హలీమ్ తయారీ ఇలా

రవ్వను అరగంట పాటు నానబెట్టాలి. రొయ్యలను బాగా కడిగి.. ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసి మారినేట్ చేయాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేసి షాజీరా, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు మారినేట్ చేసిన రొయ్యలు వేసి బాగా కలుపుతుండాలి. కాసేపు అలాగే ఉంచి నానబెట్టిన రవ్వ వేసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి.

వేడిగా తింటేనే టేస్టీ

వేడిగా తింటేనే టేస్టీ

బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి కాసేపు ఉంచి దించేయాలి. చల్లారాక దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, బ్రౌన్ ఆనియన్ దోరగా వేయించాలి. ఇవి వేగాక.. రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపాలి. పావుగంట పాటు ఇలా చేసి నిమ్మరసం, ఇలాయిచీ పొడి కలిపి దించేయాలి. కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు పై నుంచి వేయాలి. దీన్ని వేడిగా తింటేనే టేస్టీగా ఉంటుంది.

వేడిగా తింటేనే టేస్టీ

వేడిగా తింటేనే టేస్టీ

బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి కాసేపు ఉంచి దించేయాలి. చల్లారాక దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, బ్రౌన్ ఆనియన్ దోరగా వేయించాలి. ఇవి వేగాక.. రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపాలి. పావుగంట పాటు ఇలా చేసి నిమ్మరసం, ఇలాయిచీ పొడి కలిపి దించేయాలి. కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు పై నుంచి వేయాలి. దీన్ని వేడిగా తింటేనే టేస్టీగా ఉంటుంది.

చికెన్ హలీమ్

చికెన్ హలీమ్

కావాల్సినవి : చికెన్ : అర కేజీ, గోధుమరవ్వ : 250 గ్రా., నెయ్యి : 100 గ్రా., బ్రౌన్ ఆనియన్ : 50 గ్రా., పచ్చిమిర్చి : 6, మిరియాలు : 10 గ్రా., కరివేపాకు : 2 రెమ్మలు, షాజీరా : 10 గ్రా., దాల్చినచెక్క : 10 గ్రా., బిర్యానీ ఆకు : 4, నిమ్మకాయ : 1, జీడిపప్పు : 50 గ్రా., కారం : నాలుగు టీస్పూన్స్, ఇలాయిచీ పొడి : అర టీస్పూన్, పసుపు : పావు టీస్పూన్, పుదీనా : ఒక కట్ట, కొత్తిమీర : ఒక కట్ట, ఉప్పు : తగినంత

చికెన్ హలీమ్ తయారీ ఇలా

చికెన్ హలీమ్ తయారీ ఇలా

చికెన్‌ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి ఉంచాలి. రవ్వలో నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. దీంట్లో చికెన్ ముక్కలు వేసి కలుపాలి. కాసేపటి తర్వాత నానబెట్టిన గోధుమ రవ్వ వేసి జీడిపప్పు, తగినన్ని నీళ్లు పోస్తూ రవ్వ ఉడికే వరకూ బాగా కలుపుతుండాలి.

మిక్సీలో వేసి రుబ్బుకోవాలి

మిక్సీలో వేసి రుబ్బుకోవాలి

రవ్వ, చికెన్ బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి మరికాసేపు కలుపాలి. బాగా ఉడికిందనుకున్న తర్వాత దించేయాలి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. మరొక గిన్నెలో నెయ్యి వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్ వేసి వేగాక రుబ్బిన చికెన్ మిశ్రమాన్ని వేసి మళ్లీ కలుపుతుండాలి. సన్నని మంట మీద కాసేపు ఉంచి నిమ్మరసం, ఇలాయిచీ పొడి వేసి దించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్‌తో అలంకరించి వేడివేడిగా తింటుంటే సూపర్ టేస్ట్ అనకమానరు.

వెజ్ హలీమ్

వెజ్ హలీమ్

కావాల్సినవి : ఆలుగడ్డలు : 50 గ్రా., బీన్స్ : 50 గ్రా., క్యారెట్ : 50 గ్రా., బేబీకార్న్ : 50 గ్రా., గోధుమ రవ్వ : 250 గ్రా., నెయ్యి : 100 గ్రా., బ్రౌన్ ఆనియన్ : 50 గ్రా., పచ్చిమిర్చి : 6, మిరియాలు : 10 గ్రా., కరివేపాకు : 2 రెమ్మలు, షాజీరా : 10 గ్రా., జీడిపప్పు : 50 గ్రా., పాలు : అర లీటరు, నిమ్మకాయ : 1, దాల్చినచెక్క : 10గ్రా., బిర్యానీ ఆకు : 2, పుదీనా : ఒక కట్ట, కొత్తిమీర : ఒక కట్ట, పసుపు : పావు టీస్పూన్, కారం : అర కప్పు , ఉప్పు : తగినంత

వెజ్ హలీమ్ తయారీ ఇలా

వెజ్ హలీమ్ తయారీ ఇలా

గోధుమ రవ్వను అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. పచ్చిమిర్చి, బేబీకార్న్, క్యారెట్, బీన్స్‌లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో నెయ్యి వేసి దీంట్లో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకొన్న క్యారెట్, బీన్స్, బేబీకార్న్, ఆలూ, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, బ్రౌన్ ఆనియన్, జీడిపప్పు, పుదీనా వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన రవ్వని వేసి పాలు పోయాలి.

English summary

how to make haleem recipe

how to make haleem recipe
Desktop Bottom Promotion