For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో అందరూ ఎక్కువగా కోరుకునే స్నాక్ ఐటమ్స్ ఇవే...

వర్షాకాలంలో అదిరిపోయే స్నాక్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

|

వర్షాకాలం వచ్చిందంటే చాలు అందరూ వేడి వేడిగా ఏదైనా తినాలని ఆరాట పడుతూ ఉంటారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో.. ముఖ్యంగా చినుకులు పడుతున్న వేళ.. మరీ ముఖ్యంగా మనలో చాలా మందికి చిరుతిళ్ల వైపు మనసు లాగుతుంది.

Best Snack Items to Taste in Rainy Season

ఈ మాన్ సూన్(Monsoon) సీజన్లో ఎక్కువ మంది స్పైసీ స్నాక్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు. అలా అందరూ ఎక్కువగా స్పైసీ ఐటమ్స్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీకు దాదాపుగా తెలిసినవే ఉంటాయి. అయితే వాటి గురించి మరోసారి గుర్తు చేస్తున్నామంతే...

రుచికరమైన ... హనీ చిల్లీ పొటాటో రిసిపిరుచికరమైన ... హనీ చిల్లీ పొటాటో రిసిపి

వేడి వేడి సమోసా..

వేడి వేడి సమోసా..

సమోసా అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే దీన్ని వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అనే తేడా లేకుండా అన్ని కాలాల్లో స్నాక్ ఐటమ్ గా తింటూ ఉంటారు. ఇది ఒకప్పుడు కేవలం ఆలు స్టఫ్ త మాత్రమే లభించేది. కానీ ఇప్పుడు ఇందులోనూ అనేక వెరైటీలు వచ్చాయి. కార్న్ సమోసా, ఆనియన్ సమోసా, చికెన్ సమోసా, మటన్ సమోసా, నూడుల్స్ సమోసాతో పాటు ఇంకా అనేక రకాలు సమోసాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మెట్రో నగరాల్లో అయితే ఏకంగా 35 రకాల సమోసాలు లభిస్తున్నాయి. ఈ సమోసా చేయడానికి ప్రతి ఒక్కరూ మైదా పిండినే వాడతారు.

వేడి పకోడి..

వేడి పకోడి..

వర్షాకాలం వచ్చిందంటే చాలు మన ఇళ్లలో.. బజ్జీల దుకాణాల్లో పకోడి స్నాక్స్ ఐటమ్ గా రెడీ అయిపోతుంది. అయితే దీంట్లో కూడా చికెన్ పకోడి.. ఆనియన్ పకోడి, మిక్స్ పకోడి, లేటెస్ట్ గా మ్యాగీ పకోడి అంటూ కొత్త కొత్త వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇది భోజన ప్రియులను బాగా ఆకర్షిస్తోంది.

మొక్కజొన్న..

మొక్కజొన్న..

మొక్క జొన్న కంకులను మనలో చాలా మంది వర్షాకాలంలో కచ్చితంగా రుచి చూస్తారు. అంతేకాదు వీటి గింజలను తీసి గ్రైండ్ చేసి వాటితో గారెలు కూడా చేసుకుంటారు. అయితే ఇప్పుడు వీటిని స్వీట్ కార్న్ పేరుతో ప్రత్యేకంగా విక్రయిస్తున్నాయి. దీని మొక్కజొన్న పంటను ప్రత్యేకంగా సాగు చేసి మార్కెట్లో అమ్మితే.. వాటికి ఉప్పు, కారం మరియు నిమ్మకాయ రసం అద్దుకుని తినడం లేటెస్ట్ ట్రెండ్. చెబుతుంటూనే నోరూరుతోంది కదా.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా ఈ స్నాక్ ఐటమ్ ను టేస్ట్ చేసేయండి.

పాలక్ పులావ్ రిసిపి: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచిపాలక్ పులావ్ రిసిపి: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి

పల్లీలు..

పల్లీలు..

మనం చిన్నప్పటి నుండి ఇంటి దగ్గర లేదా స్కూల్, సినిమాలకు వెళ్లినప్పుడు లేదా ఇంకేదైనా టైమ్ పాస్ చేసే సమయంలో పల్లీలను స్నాక్స్ గా ఎక్కువగా తింటూ ఉంటాం. ఇక ఈ పల్లీలను కూడా రకరకాలుగా చిరుతిళ్లగా తీసుకుంటారు.

పునుగులు..

పునుగులు..

కోస్తా, ఆంధ్ర ప్రాంతంలో పునుగులు అంటే తెలియని వారుండదరు. వీటిని కాలాలకు అతీతంగా తింటూ ఉంటారు. సాయంకాలం అయ్యిందంటే చాలు చాలా మంది వేడి వేడి పునుగులు.. అందులో కాస్త అల్లం చట్ని లేదా కొబ్బరి చట్ని వేసుకుని తింటారు. వర్షాకాలంలో ఫుడ్ లవర్స్ ఇష్టమైన మెనూలో ఇది కచ్చితంగా ఉంటుంది.

PC :The Hindu

ఆలూ బజ్జీ..

ఆలూ బజ్జీ..

వర్షాకాలంలో భజ్జీలను కూడా చాలా మంది స్నాక్స్ ఐటమ్స్ గా తీసుకుంటారు. ముఖ్యంగా ఆలూ బజ్జీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీటిని మిర్చి బజ్జీ ఎలా చేసుకుంటామో.. అచ్చం అలానే తయారు చేస్తారు. కాకపోతే మిర్చికి బదులు బంగాళదుంపను వాడతారు. దీన్ని అందరూ శనగ పండితోనే తయారు చేస్తారు.

మిర్చి బజ్జీ..

మిర్చి బజ్జీ..

మనలో దీని పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మన చిన్నప్పుడు ఇళ్ల వద్ద తోపుడు బండ్ల నుండి పెద్ద పెద్ద హోటల్స్ వరకు ఈ మిర్చి బజ్జీని స్నాక్ ఐటమ్ గా తింటారు. చాలా మంది వర్షాకాలంలో ఈ బజ్జీలను ఇళ్లలో చేసుకుని వేడి వేడిగా తీసుకునేందుకు ఇష్టపడతారు.

వీటితో పాటు ముంత మసాల, బ్రెడ్ పకోడి, మినప గారెలు ఇంకా చాలా రకాల స్నాక్ ఐటమ్స్ తింటూ ఉంటారు.

English summary

Best Snack Items to Taste in Rainy Season

Here are the best snack items to taste in rainy season. Take a look
Story first published:Saturday, July 10, 2021, 17:43 [IST]
Desktop Bottom Promotion