For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి పండుగ రోజు ఈ భోగి వంటకాలతో అతిథులకు ఆతిథ్యం ఇద్దామా..!

|

బోగి (బోగి) పండుగ - ప్రతి సంవత్సరం మొదటిగా వచ్చే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండగను 3 రోజుల పాటు జరుపుకోవడం మన హిందు స్రంపదాయం. అందులో మొదటిగా వచ్చేది బోగి పండుగ. ఆంధ్ర, తెలంగాణాలో భోగితో సంక్రాంతి ప్రారంభం అవుతుంది. ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు.

ఈ బోగి పండుగ తెలుగు క్యాలెండర్ లో మార్గశి మాసం చివరి రోజున వస్తుంది. సాంప్రదాయకంగా బోగి పండుగ "వర్షానికి దేవుడు" అని పూజించబడే ఇంద్రుడి కోసం. ఈ పండుగ పంటకు సరిపడా వర్షాన్ని కురిపించినందుకుగాను ఇంద్రున్ని పూజిస్తారు.

ముఖ్యంగా ఈ బోగి రోజున ఇంద్రున్ని రాత్రి సమయంలో పూజింపడం ఆనవాయితి. ఇంద్రునికి ఇష్టమైన పాలు, అన్నంలో పంచదార కలిపి ఇంద్రునికి నైవేద్యం సమర్పించి ఈ సంవత్సరం అంతా మంచి వర్షాలతో పంటలు బాగా పండాలని, బోగ, భాగ్యాలు కలగానలి పూజిస్తారు. సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్ధం.

కానీ సాధారణంగా, ఈ ప్రత్యేకమైన రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను శుభ్రం చేస్తారు, ఇంట్లో మూల పడ్డ పాత వస్తువులు, పనికిరాని వస్తువులను బయటపడేస్తారు. గ్రామాలలో ప్రజలు పాత, అనవసరమైన వస్తువులను సేకరించి, గ్రామం మధ్యలో వేసి భోగి మంటలు వేస్తారు. అదే ఆంధ్రలో ఊరి వెలుపల చిట్లా కుప్పలు వేసి బోగి మంటలు వేస్తారు. అయితే ఈ మంటలను కనుమ రోజున వేయడం ఆంధ్రాలో ఆనవాయితి. అలాగే, ప్రజలు ఇళ్లకు రంగులు వేస్తారు, ముగ్గులు మరియు ముగ్గులకు కూడా రంగులు వేస్తారు. ప్రజలు నువ్వుల నూనెతో తలంటి స్నానం చేసి, పూజలు చేస్తారు. ఈ పూజలో దేవునికి మరియు ప్రత్యేకించి ఇంద్రుడికి నైవేద్యం కోసం పోలీ, వడ, పాయసం నైవేద్యం పెడతారు.

బోగి శుభాకాంక్షలు మరియు ఎకో ఫ్రెండ్లీ బోగి పండుగను జరుపుకుందాం. ఈ సందర్భంగా మీకోసం కొన్ని భోగి వంటకాలు...

భోగి వంటకాలు:

భోగి వంటకాలు:

ఇంట్లోనే పూరన్ పోలీ తయారీ ఎలా

పండగలప్పుడు చేసుకునే ప్రసిద్ధ పిండివంటకం పూర్ణం పోలీలు. బెల్లం- పప్పుల పూర్ణాన్ని మైదాపిండి మధ్యలో పెట్టి, రోటీలలాగా వత్తి చేసి వేయించి ఈ వంటకాన్ని చేస్తారు. బెలే హోలిగేని మహారాష్ట్రలో పూరన్ పోలీ అని కూడా అంటారు. దేశవ్యాప్తంగా కొద్దికొద్ది తేడాలతో చేసుకుంటారు. అందులో వేసే పదార్థాలు స్థానిక స్థలాన్ని బట్టి మారుతుంటాయి. కానీ చేసే పద్ధతి ఒకటే.

పాల పోలీలు(పాల బొబ్బట్లు):

పాల పోలీలు(పాల బొబ్బట్లు):

అన్నిరోజులూ ఒక ఎత్తు, పండగ రోజు ఒక ఎత్తు. 'పండక్కు ఏం చేస్తున్నారు, ఏంచేశారు వంటి ప్రశ్నలు ఈ సందర్భంలో సర్వసాధారణం. అందునా ఇది సంక్రాంతి. మరి ఈ స్వీట్లతో సంక్రాంతిని ఉత్సాహభరితం, సంతోషభరితం చేసుకోవటం అభిలషణీయమే కదా. బొబ్బట్లు సంప్రదాయ పిండివంటే కానీ ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ శ్రమలేకుండా వైవిధ్యభరితంగా బొబ్బట్లను ఎలా తయారుచేసుకోవాలో బోల్డ్ స్కై మీకు వివరిస్తోంది. పాల పోలీ ఒక ట్రెడిషనల్ స్వీట్ డిజర్ట్. దీని తయారీ రిసిపిని చూడటనికి ఇక్కడ క్లిక్ చేయండి

పాల పోలీలు(పాల బొబ్బట్లు)

కోకోనట్ మిల్క్-సేమియా పాయసం: సంక్రాంతి స్పెషల్

కోకోనట్ మిల్క్-సేమియా పాయసం: సంక్రాంతి స్పెషల్

హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి స్పెషల్‌ లక్ష్మీ పూజకు, రకరకాల పిండి వంటలు, స్వీట్స్‌తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్‌ చేసే ఈ పండుగకి కొన్ని రకాల స్వీట్స్‌ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు. అటువంటి స్వీట్‌ డిష్‌లో పిల్లలకెంతో ప్రీతికరమైన స్వీట్ సేమియా పాయసం మరి దీన్నిఎలా తయారుచేయాలో ఇక్కడ ఇచ్చిన లింక్ లో చూడండి.

కోకోనట్ మిల్క్-సేమియా పాయసం: సంక్రాంతి స్పెషల్

ఆంధ్ర స్టైల్ మసాలా వడ

ఆంధ్ర స్టైల్ మసాలా వడ

వడలో వివిధ రకాలు ఉన్నా ఆంధ్ర స్టైల్ మసాలా వడ అంటే నోరూరించాల్సిందే. సంక్రాంతి సందర్భంగా ఇంటికి వచ్చే అథితులతో పాటు ఇంట్లోవారికి అందించే ఆథిద్యం లో మసాలా వడ ఉండాల్సింది. అయితే ఈ వంటకాన్ని ఆంధ్ర స్టైల్లో ఎలా తయారుచేయాలో ఇక్కడ ఇచ్చిన లింక్ లో చూద్దం రండి.

ఆంధ్ర స్టైల్ మసాలా వడ

English summary

Bhogi Festival Recipes in telugu

Here is the list of Bhogi Festival Recipes in telugu. Read to know more..
Story first published:Wednesday, January 11, 2023, 15:47 [IST]
Desktop Bottom Promotion