For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cheese Paratha: పిల్లలకు ఇష్టమైన చీజ్ పరోటా

చీజ్ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చీజ్‌ను పిల్లలు బాగా ఇష్టపడతారు. కొత్తగా, వెరైటీగా ఉండాలంటే చీజ్‌ను, పరాఠాలను కలిపి చీజ్ పరోటా ట్రై చేస్తే వెరైటీగా ఉండటమే కాకుండా రుచిగానూ పిల్లలకు ఇష్టంగానూ ఉంటుంది.

|

Cheese Paratha: చీజ్ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చీజ్‌ను పిల్లలు బాగా ఇష్టపడతారు. కొత్తగా, వెరైటీగా ఉండాలంటే చీజ్‌ను, పరాఠాలను కలిపి చీజ్ పరోటా ట్రై చేస్తే వెరైటీగా ఉండటమే కాకుండా రుచిగానూ పిల్లలకు ఇష్టంగానూ ఉంటుంది.

Cheese paratha parota recipe making in Telugu

చీజ్ పరోటాకు కావాల్సిన పదార్థాలు:

* గోధుమ పిండి - 120 గ్రాములు
* ఉప్పు - 1/4 టేబుల్ స్పూన్
* నూనె - 1 టేబుల్ స్పూన్
* చీజ్ - 1/2 కప్పు
* ఉల్లిపాయలు - 1/4 కప్పులు
* పచ్చిమిర్చి - 2
* మిరియాలు - 1/2 టేబుల్ స్పూన్
* నెయ్యి

Cheese paratha parota recipe making in Telugu

చీజ్ పరోటా తయారీ:;

1. పెద్ద గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, నూనె లేదా నెయ్యి కొన్ని నీల్లు పోసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.

2. కలుపుకున్న పిండిని అదే గిన్నెలో ఉంచి పైన వస్త్రాన్ని కప్పి 20 నుండి 30 నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి.

3. మరో గిన్నెలో సగ్గుబియ్యం, తురిమిన చీజ్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నల్ల మిరియాలు కలుపుకోవాలి.

4. పిండిని తీసుకుని రెండు బంతుల్లా తయారు చేసుకోవాలి. తర్వాత వాటిని రౌండ్‌గా తాల్చుకోవాలి.

Cheese paratha parota recipe making in Telugu

5. ముందుగా కలుపుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని రౌండ్‌గా తాల్చుకున్న పిండిపై పెట్టుకోవాలి.

6. మరో చపాతీ తీసుకుని దానిపై ఉంచి అంచులను వత్తుకోవాలి.

7. మిశ్రమం ఉంచిన పరోటాపై పిండి వేసి నెమ్మదిగా తాల్చుకోవాలి.

8. పరోటాను గుండ్రంగా తాల్చుకోవాలి.ట

9. చీజ్ నింపిన పరోటాను పెనంపై వేసి కాల్చుకోవాలి. దానికి రెండు వైపులా నెయ్యి పూస్తూ కాల్చుకోవాలి.

Cheese paratha parota recipe making in Telugu

10. మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి.

11. పరోటా చక్కగా కాలిందని నిర్ధారించుకున్న తర్వాత వేడి వేడిగా వడ్డించుకోవడమే.

చీజ్ పరోటాను పెరుగు, మామిడి పచ్చడి, టొమాటో కెచప్‌తో తింటే అద్భుతంగా ఉంటుంది.

Read more about: recipe వంటకం
English summary

Cheese paratha parota recipe making in Telugu

read on to know Cheese paratha parota recipe making in Telugu
Story first published:Tuesday, December 13, 2022, 12:45 [IST]
Desktop Bottom Promotion