For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Christmas Special : ఈ క్రిస్మస్ కేకులతో ఈ ఫెస్టివల్ ను హ్యాపీగా జరుపుకోండి...

క్రిస్మస్ కేక్ రెసిపీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఈ ప్రపంచంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. అందుకే ఇక్కడ అన్ని మతాల వారు అందరూ కలిసిమెలసి అన్నీ పండుగలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుంది.

Christmas Cake Recipes in Telugu

అ పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగకు అందరూ సిద్ధమవుతున్న వేళ.. చాలా చోట్ల క్రిస్మస్ ట్రీలు, అందమైన అలంకరణలు, నోరూరించే కేకులు కనిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా వంటి మహమ్మారి కారణంగా మార్కెట్లో లభించే కేకులను తెచ్చుకోవడం అంత మంచిది కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

Christmas Cake Recipes in Telugu

మరోవైపు డిమాండ్ పెరిగితే చాలా కేకుల్లో క్వాలిటీ అనేదే మనకు కనబడదు. అందుకే ఈ క్రిస్మస్ పండక్కి మనమే ఇంట్లో కేక్ తయారు చేసుకుని.. హెల్దీ రెసిపీలతో పండుగను సంతోషంగా జరుపుకుందాం. ఈ నేపథ్యంలో మన ఇంట్లోనే చక్కని కేకులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడే చూసేద్దాం రండి...

Christmas Special : ఈ క్రిస్మస్ కు ఇంట్లోనే ఈజీగా కేక్ ప్రిపేర్ చేసేద్దామా...

గుడ్డు లేని కేక్..

గుడ్డు లేని కేక్..

మీరు కోడిగుడ్డు లేకుండా క్రిస్మస్ కేక్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా.. మీ క్రిస్మస్ కేకును డ్రై ఫ్రూట్స్ సహాయంతో చేసుకునే వీలుంటుంది.

కావాల్సిన పదార్థాలు..

కావాల్సిన పదార్థాలు..

* మైదాపిండి - ఒక కప్పు

* పాల పౌడర్ - ఒక కప్పు

* పాలు - ఒక కప్పు

* చక్కెర - ఒక కప్పు

* వెనిలా ఎస్పెన్స్ - కొద్దిగా

* నెయ్యి - మూడు టీ స్పూన్లు

* బేకింగ్ సోడా - టీ స్పూన్

* బేకింగ్ పౌడర్ - టీ స్పూన్

* డ్రై ఫ్రూట్స్ - (వాల్ నట్స్, జీడిపప్పు, బాదం పప్పు)

తయారీ విధానం..

తయారీ విధానం..

ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కలిపి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత మైదా, పాలపౌడర్, చక్కెర, నెయ్యి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అన్నింటిని కలిపి.. పాలతో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన డ్రై ఫ్రూట్ ముక్కలన్నింటినీ అందులో వేసేసి కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టాలి. ఆపైన బటర్ పేపర్ వేసిన బేకింగ్ ట్రే తీసుకుని.. కొద్దిగా నూనె రాసి.. అందులో ఈ మిశ్రమం వేసుకోవాలి. అంతకంటే ముందు ఓవెన్ ని ప్రీహీట్ చేయాలి. 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ప్రీహీట్ చేసిన తర్వాత.. 45 నిమిషాల తర్వాత బయటకు తీసి.. మరో 10 నిమిషాల పాటు చల్లార్చితే మీరు కోరుకున్న కేక్ రెడీ అయిపోతుంది.

చాక్లెట్ కేక్..

చాక్లెట్ కేక్..

క్రిస్మస్ సమయంలో చాలా మంది ఎక్కువగా ఇష్టపడే కేక్ చాక్లెట్ కేక్. ఎందుకంటే దీని రుచి అన్నింటికంటే కొంత ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మీరు ఈ కేక్ తప్పనిసరిగా రుచి చూడాల్సిందే. ఈ సందర్భంగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

* కోడి గుడ్లు - 6

* మైదాపిండి - పావు కిలో

* చక్కెర - అరకిలో

* కోకో పౌడర్ - 100 గ్రాములు

* డార్క్ చాక్లెట్ - అరకిలో

* వెనిలా ఎస్సెన్స్ - టేబుల్ స్పూన్

* వెన్న - చిన్న క్యూబ్

* చాక్లెట్ - 200 గ్రాములు

తయారీ విధానం..

తయారీ విధానం..

తొలుత డార్క్ చాక్లెట్, వెన్న కలిపి దాన్ని ఒక మిశ్రమ పదార్థంగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మైదా, కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మరో పాత్రలో కోడిగుడ్డుతో చక్కెరను బాగా కలపాలి. ఆ తర్వాత చాక్లెట్ మిశ్రమంతో పాటు.. చాక్లెట్ తురుమును కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద.. 10 నిమిషాలు ప్రీహీట్ చేసిన ఓవెన్ లో 30 నిమిషాల పాటు దాన్ని బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు చల్లార్చాలి. అంతే మీరు కోరుకున్న చాక్లెట్ మడ్ కేకు సిద్ధమైనట్టే.

క్రిస్మస్ పుడ్డింగ్ రెసిపీ...క్రిస్మస్ పుడ్డింగ్ రెసిపీ...

రమ్ కేకు..

రమ్ కేకు..

ఈ రకమైన కేకును క్రిస్మస్ సమయంలో తయారు చేసుకోవడం సంప్రదాయంగా భావిస్తారు చాలా మంది క్రైస్తవ సోదరులు. ఈసారి మీరు దీన్ని ఇంట్లో తయారు చేయాలనుకుంటే మాత్రం దీనికి కొన్నిరోజుల ముందే డ్రై ఫ్రూట్లను రమ్ లో నానబెట్టాలి. ఆ తర్వాత దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు..

కావాల్సిన పదార్థాలు..

* మైదాపిండి - ఒక కప్పు

* రమ్ - అర కప్పు

* చక్కెర - ఒక కప్పు

* వెన్న - ఒక కప్పు

* బేకింగ్ పౌడర్ - టీస్పూన్

* పాలు - కొద్దిగా

* డ్రై ఫ్రూట్స్ - అర కప్పు

తయారీ విధానం..

తయారీ విధానం..

ముందుగా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే.. అంత ముందుగా.. రమ్ లో డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టి పెట్టుకోవాలి. సాధారణంగా వారం నుండి నెలరోజుల ముందు వీటిని నానబెట్టుకోవాలి. కేకు తయారీకి ముందు మైదా.. బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వెన్న, చక్కెర బాగా కలుపుకోవాలి. తర్వాత మైదాలో పాలు కలిపి.. మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. అందులో చక్కెర మిశ్రమంతో పాటు.. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత దీన్ని నూనె రాసిన మౌల్డ్ లో వేసి.. 15 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే చాలు.. మీరు కోరుకున్న రమ్ కేక్ రెడీ అయిపోతుంది.

English summary

Christmas Cake Recipes in Telugu

Check out the christmas cake recipes in telugu. Read on
Desktop Bottom Promotion