For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆరోగ్యకరమైన ఆమ్లెట్లను మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?

తెలుగులో ఆరోగ్యకరమైన ఆమ్లేట్ల వంటకాల గురించి తెలుసుకుందాం.

|

ప్రస్తుతం మనలో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. తక్కువ సమయంలోనే వంటలను తయారు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వంటి కాలంలో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ రుచికరంగా.. ఆరోగ్యకరంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది చికెన్, మటన్, కోడిగుడ్లను ఎక్కువగా తినేస్తున్నారు.

Healthy Omlette Recipes in Telugu

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మనలో ఆమ్లెట్లంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే మీరు ఇప్పటివరకూ కేవలం మసాలా ఆమ్లెట్ లేదా ఉల్లి ఆమ్లెట్ వంటివి మాత్రమే చూసుంటారు లేదా ఆలు ఆమ్లెట్ లేదా చికెన్ ఆమ్లెట్ లాంటి పేర్లను మాత్రమే వినుంటారు. కానీ ఆమ్లెట్లలో బోలెడన్ని రకాలున్నాయని మనలో చాలా మందికి తెలియనే తెలియదు. అంతేకాదు అవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయట. ఈ స్టోరీ చూస్తే ఆమ్లెట్లలో ఇన్ని రకాలున్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆమ్లెట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

రొయ్యలతో ఆమ్లెట్..

రొయ్యలతో ఆమ్లెట్..

రొయ్యలతో ఆమ్లెట్ ఎలా చేస్తారని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో ఈ రెసిపీ చాలా ఫేమస్. చిన్న చిన్న రొయ్యలను బాగా ఫ్రై చేయించి.. కోడిగుడ్డుతో మిక్స్ చేసి పైన కాస్త పచ్చిమిరప వేస్తే.. దాని నుండి వచ్చే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి.. కచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది.

ఆఫ్రికన్ ఆమ్లెట్..

ఆఫ్రికన్ ఆమ్లెట్..

మనలో చాలా మంది ఆమ్లెట్ అంటేనే రోటీన్ గా మసాలా, ఉల్లి వంటివి వేసి సింపుల్ గా, వేగంగా తయారు చేస్తుంటారు. అయితే ఈసారి ఆఫ్రికన్ ఆమ్లెట్ రెసిపీని ఓసారి ట్రై చెయ్యండి. ఇది తయారు చేయడానికి ముందుగా మటన్ ముక్కలను చిన్నగా ముక్కలుగా కట్ చేసి.. వాటికి మసాలా అద్ది.. తర్వాత కోడిగుడ్డు సొనతో కలిపి ఆమ్లెట్ వేయండి. దీని తయారీతో ఓ వైవిధ్యమైన టేస్ట్ వచ్చేస్తుంది.

ఇండినేషియా ఆమ్లెట్..

ఇండినేషియా ఆమ్లెట్..

ఈ ఆమ్లెట్ గురించి చాలా మందికి తెలియదు. ఇది ఇండోనేషియాలో బాగా ఫేమస్. బీన్స్, కర్డ్ మిక్స్ చేసిన ఆమ్లెట్ పై చల్లుకుంటే చాలు.. ఇది ప్యాన్ కేక్ మాదిరిగా కనిపిస్తుంది. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

మగ్ ఆమ్లెట్..

మగ్ ఆమ్లెట్..

ఆమ్లెట్ అంటే మనం ఎప్పుడైనా ఏదైనా పెన్నంలో చేయడాన్నే చూస్తుంటాం. అయితే ఆమ్లెట్ ని మగ్ లో తయారు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? దీన్ని ఎలా తయారు చేయాలంటే.. ఆమ్లెట్ ని మగ్ లో ఉడికించి వేడి చేయడమే దీని ప్రత్యేకత. ఇలా వండుకుంటే ఆమ్లెట్ టేస్టే వేరుగా ఉంటుంది.

చీజ్ ఆమ్లెట్..

చీజ్ ఆమ్లెట్..

సాధారణంగా ఆమ్లెట్ ను పెన్నంలో వేసినప్పుడు నూనెతో ఫ్రై చేస్తూ ఉంటాం. అయితే ఆమ్లెట్ ని నూనెతో ఫ్రై చేసే బదులు.. ఈసారి చీజ్ తో ఫ్రై చెయ్యండి. అలా ఫ్రై చేసిన ఆమ్లెట్ పై కాస్త ఆనియన్స్ వేయండి. అంతే దీని టేస్ట్ సూపర్ గా ఉంటుంది.

దాల్ ఆమ్లెట్..

దాల్ ఆమ్లెట్..

దాల్ ప్లస్ ఎగ్. ఇలాంటి రెసిపీ గురించి మీరు ఇప్పటివరకు అస్సలు వినుండకపోవచ్చు. అయితే ఇలాంటి వాటిని కలిపి కొంతమంది తింటుంటారు. మూంగ్ దాల్ ను బాగా కలుపుకుని.. కోడిగుడ్డును కలిపి ఫ్రై చేయండి. దీని వల్ల మీరు ఒక కొత్త టేస్ట్ చేయొచ్చు.

మష్రుమ్ ఆమ్లెట్..

మష్రుమ్ ఆమ్లెట్..

మష్రుమ్ (పుట్టగొడుగులు) తో ఆమ్లెట్ ఎలా వస్తుందనుకుంటున్నారా? అయితే మీరు ఈసారి వీటితో ఆమ్లెట్ ను ట్రై చేసి చూడండి. దీని కోసం ముందుగా మష్రుమ్ ను బాగా వేయించండి. ఆ తర్వాత గుడ్డు సొనతో వాటిని బాగా కలిపి ఫ్రై చేయండి. అంతే మీకు ఒక కొత్తరకం ఆమ్లెట్ టేస్ట్ చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది.

చెర్రీ టొమాటో ఆమ్లెట్

చెర్రీ టొమాటో ఆమ్లెట్

ఇది కూడా వెరైటీ రెసిపీ కాంబినేషన్. దీని తయారీ కోసం ముందుగా చెర్రీ టొమాటోలను గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత గుడ్డు సొనతో మిక్స్ చేయాలి. ఆ తర్వాత దానిపై కొద్దిగా మిరియాలను వేసి ఆమ్లెట్ వేస్తే ఆ టేస్ట్ సూపర్ గా ఉంటుంది.

English summary

Healthy Omelette Recipes in Telugu

Here we talking about the healthy omlette recipes in Telugu. Read on
Desktop Bottom Promotion