For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy New Year 2022 : కొత్త ఏడాది వేళ ఇంట్లోనే కేకును ఈజీగా చేసేయండి...

కొత్త సంవత్సరంలో ఇంట్లోనే ఈజీగా కేకును ఎలా తయారు చేయొచ్చో తెలుసుకుందాం.

|

కొత్త సంవత్సరం వస్తుందనగానే ప్రతి ఒక్కరిలోనూ కచ్చితంగా ఎంతో కొంత ఎగ్జైట్ మెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా మనలో చాలా మంది డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి కరెక్టుగా పన్నెండు గంటల సమయంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.

Home made New year cake recipes in Telugu

అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అలాంటి పరిస్థితి మనకు కనబడకపోవచ్చు. ఈ సమయంలో బేకరీలలో దొరికే కేకులకు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ధరలు కూడా అమాంతరం పెరిగిపోతూ ఉంటాయి. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా బయట తయారైన వాటిని ఇంటికి తెచ్చుకోవడం కూడా అంత శ్రేయస్కరం కాదు.

Home made New year cake recipes in Telugu

ఇలాంటి సమయంలో న్యూ ఇయర్ టైమ్ లో కేక్ కట్ చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్న వారి కోసం.. ఇంట్లోనే చాలా ఈజీగా.. అది కూడా అతి తక్కువ ఖర్చుతో న్యూ ఇయర్ కేకుని ఎలా తయారు చేయాలో మేము మీకు తెలియజేయబోతున్నాం. అది మీ ఇళ్లలోనే స్వయంగా కేకులను ఓవెన్ లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

రుచికరమైన ... మటన్ గీ రైస్ రిసిపిరుచికరమైన ... మటన్ గీ రైస్ రిసిపి

కావాల్సిన పదార్థాలు..

కావాల్సిన పదార్థాలు..

* మైదాపిండి - ఒకకప్పు

* గుడ్లు - 3

* చక్కెర - 3/4 కప్పు

* బేకింగ్ పౌడర్ - అర టీ స్పూన్

* వంట సోడా - అర టీ స్పూన్

* ఉప్పు - అర టీ స్పూన్

* నూనె - అర కప్పు

* పాలు - అర కప్పు

* వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూన్

* డ్రై ఫ్రూట్స్ - ఒక కప్పు

* టూటీ ఫ్రూటీస్ - ఒక కప్పు

వీటి సహాయంతో మనం ఇంట్లో ఈజీగా కేకును తయారు చేసుకోగలం.

కేక్ తయారీ విధానం..

కేక్ తయారీ విధానం..

ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని.. అందులో 1/4 కిలో ఉప్పు లేదా ఇసుకతో కుక్కర్ లోపలి భాగమంతా పరచుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఆ కుక్కర్ ని దాదాపు 10 నుండి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉంచాలి.

మిశ్రమాన్ని బాగా కలపాలి..

మిశ్రమాన్ని బాగా కలపాలి..

ఇంకోవైపు ఒక బౌల్ లో ఒక కప్పు మైదాపిండి, ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ మూడు ఒకదానితో మరొకటి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

మరో పాత్రలో..

మరో పాత్రలో..

మరో బౌల్ లో మూడు గుడ్లను పగులగొట్టి అందులో వేయాలి. తర్వాత వాటిలోకి అర టీ స్పూన్ ఉప్పు, అర కప్పు నూనె, ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఒక కప్పు చక్కెర, అర కప్పు పాలు వేసుకుని.. వీటిని బాగా కలుపుకోవాలి.

ముద్దలుగా ఉండకుండా..

ముద్దలుగా ఉండకుండా..

ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా, బేకింగ్ పౌడర్, వంట సోడాల మిశ్రమాన్ని నెమ్మదిగా వేసుకుంటూ వెళ్లాలి. తర్వాత మొత్తం కలుపుకోవాలి. మొత్తంగా చూస్తే.. రెండు కలిసి తయారైన మిశ్రమాన్ని చిక్కగా తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే.. మీరు కలిపిన మిశ్రమం ఎక్కడా ముద్దలుగా రాకుండా చూసుకోవాలి. దీన్నే కేక్ బ్యాటర్ అంటారు.

కలర్ ఫుల్ గా కనబడాలంటే..

కలర్ ఫుల్ గా కనబడాలంటే..

ఇలా తయారైన కేక్ బ్యాటర్ లోకి టూటీ ఫ్రూటీస్ వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి కేక్ తయారీ పూర్తయ్యాక దీనిని చూస్తే ఇది చాలా కలర్ ఫుల్ గా కనబడుతుంది.

మరో పాత్రను తీసుకుని..

మరో పాత్రను తీసుకుని..

ఆ తర్వాత మరొక పాత్రను తీసుకుని.. దానిలో కొంచెం నూనెను డ్రాప్స్ గా వేసుకుని.. ఆ ఆయిల్ తో కేక్ పాత్ర లోపలి భాగాన్ని మొత్తం పూతలాగా పూయాలి. అలా చేసిన తర్వాత కొంచెం మైదా పిండిని కూడా తీసుకోవాలి. దానిని కొంచెం చల్లుకోవాలి. కేక్ బేక్ అయిన తర్వాత ఆ పాత్రలో నుండి బయటకు తీయడానికి ఈజీగా కావడానికి ఇలా చేయాలి. అలాగే కేక్ కూడా ఈ పాత్రలో అతుక్కోకుండా ఉంటుంది.

రంధ్రాలు లేకుండా..

రంధ్రాలు లేకుండా..

ఆ తర్వాత కేక్ బ్యాటర్ ని.. ఆ కేక్ పాత్రలో పోసుకోవాలి. బ్యాటర్ మొత్తాన్ని కేక్ పాత్రలో పోసుకున్న తర్వాత.. ఎక్కడా చిన్న రంధ్రం లేకుండా చూసుకోవాలి. ఇక ఆ బ్యాటర్ పై రకరకాల డ్రై ఫ్రూట్స్ ముక్కలను టాపింగ్స్ గా కూడా వేసుకోవచ్చు. ఇక అప్పటికే వేడి చేసి ఉంచిన కుక్కర్ లోపలున్న ఉప్పుపైన ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన ఈ కేక్ పాత్రని ఉంచుకోవాలి.

విజిల్ పెట్టకూడదు..

విజిల్ పెట్టకూడదు..

ఇక మీరు కేక్ పాత్రని లోపల పెట్టాక.. కుక్కర్ మూతని పెట్టేయాలి. అయితే కుక్కర్ కి విజిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. కుక్కర్ మూత పెట్టిన తర్వాత.. ఒక పది నిమిషాల పాటు హై ఫేమ్ లో మంట పెట్టాలి. ఆ తర్వాత ఒక అరగంట పాటు.. మీడియం ఫేమ్ లో బేక్ చేయాలి.

కెక్ రెఢీ..

కెక్ రెఢీ..

అలా 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. కుక్కర్ మూత తీసి చూస్తే.. మనకు కావాల్సిన కేక్ రెడీ అయ్యుంటుంది. ఇక ఆ కేక్ పాత్రని జాగ్రత్తగా కుక్కర్ నుండి బయటకు తీసి.. ముఖ్యంగా ఆ కేక్ పాత్ర నుండి మరింత జాగ్రత్తగా ఒక ప్లేటులో బోర్లిస్తే.. మీరెంతగానో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కేక్ రెఢీ అయినట్లే.

మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ కొత్త సంవత్సరం వేళ స్వయంగా మీ చేతులతో చేసిన కేక్ ని కట్ చేసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి.

English summary

Home made New year cake recipes in Telugu

Here we talking about the home made new year cake recipes in Telugu. Read on
Desktop Bottom Promotion