For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Homemade Christmas Cake: ఇంట్లోనే ఈజీగా క్రిస్ మస్ కేక్ చేసేయండి...

ఇంట్లోనే చాలా సులభంగా క్రిస్ మస్ కేక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడే చూసెయ్యండి.

|

మరి కొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నారు. అంతేకాదు అందరూ 2021కి గుడ్ బై చెప్పబోతున్నాం. అదే సమయంలో 2022 కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు..

Homemade Christmas Cake Recipe details in Telugu

ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక క్రిస్మస్ పండుగ రోజున కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకోవడానికి అందరూ చాలా ఉత్సాహం చూపుతారు. అందుకే ఈ పండుగ వేళ బేకరీలలో కేక్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ కి తగ్గట్టుగానే స్పెషల్ కేక్స్ అంటూ.. ధరలు పెరిగిపోతుంటాయి. మరికొందరు తెలివిగా ఒకటి కొంటే మరొకటి ఉచితం లేదా రెండు కొంటే ఒకటి ఉచితం వంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తారు. ఇలాంటి సమయంలో మీరు కేక్ కట్ చేయాలనుకుంటే.. మీ వద్ద బడ్జెట్ తక్కువగా ఉంటే.. ముఖ్యంగా కరోనా వంటి పరిస్థితుల్లో ఇంట్లోనే కేక్ తయారు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ ఇంట్లో చాలా ఈజీగా, చాలా తక్కువ ఖర్చుతో కొత్త సంవత్సర కేకును ఎలా తయారు చేసుకోవాలో మేం మీకు చెబుతాం.. మీ ఇంట్లో ఎలాంటి ఓవెన్ లేకుండానే కేక్ తయారీ ప్రక్రియ ఎలాగో మేం తెలియజేస్తాం. ఇంకెందుకు ఆలస్యం.. ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా తయారు చేయాలో చూసెయ్యండి...

కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు..

కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు..

మైదాపిండి - ఒక కప్పు, గుడ్లు - 3, చక్కెర -3/4 కప్పు, బేకింగ్ పౌడర్ - 1.5 టీ స్పూన్, వంట సోడా -1/2 టీ స్పూన్, ఉప్పు - 1/2 టీ స్పూన్, నూనె - 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ - 1/2టీ స్పూన్, పాలు - 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ - ఒక కప్పు, టూటీ ఫ్రూటీస్ - ఒక కప్పు

కేక్ ప్రిపేర్ చేయండిలా..

కేక్ ప్రిపేర్ చేయండిలా..

ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులో 1/4 కిలో ఉప్పు లేదా ఇసుకతో కుక్కర్ లోపలి భాగం మొత్తం వేయండి. అలా వేసిన తర్వాత ఆ కుక్కర్ ను సుమారు 10 నుండి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్(మంట)లో ఉంచాలి.

ఆ తర్వాత ఒక గిన్నెను తీసుకుని.. అందులో ఒక కప్పు మైదాపిండి, ఒకటిన్నర టీస్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ మూడు ఒకదానితో మరొకటి బాగా కలుపుకోవాలి.

అనంతరం మరో పాత్ర తీసుకుని.. అందులో మూడు గుడ్లను పగులగొట్టి అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అర టీ స్పూన్ ఉప్పు.. అర కప్పు నూనె, ఒక టీ స్పూన్ వెనిలా ఎస్సెన్స్, ఒక కప్పు చక్కెర, అరకప్పు పాలు వేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి.

వీటినన్నింటినీ మిక్స్ జార్ లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేయాలి.. అప్పుడు ఇది చక్కని పేస్టులా మారిపోతుంది.

పాత్రకి అతుక్కోకుండా..

పాత్రకి అతుక్కోకుండా..

ఈ మిశ్రమంలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా, బేకింగ్ సోడా పౌడర్, వంట సోడాల మిశ్రమాన్ని నెమ్మదిగా వేసుకుంటూ వెళ్లండి. అదే సమయంలో బాగా కలుపుకుంటూ పోవాలి. మొత్తానికి ఇవి రెండు కలిసి తయారైన మిశ్రమం చిక్కగా రావాలి. ఇందులో ఎక్కడ కూడా ముద్దలనేవి రాకుండా చూసుకోవాలి. దీన్నే కేక్ బ్యాటర్ అంటారు.

ఇప్పుడు కేక్ ను బేక్ చేయడానికి ఓ ప్రత్యేకమైన కేక్ పాత్రను తీసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకుని.. ఆ నూనెతో కేక్ పాత్ర లోపలిభాగాన్ని మొత్తం పూతలాగా పూయాలి. అలా పూతలాగా పూసిన తర్వాత, కొద్దిగా మైదా పిండిని కూడా తీసుకోవాలి. దానికి ఒక పూత మాదిరిగా చల్లాలి. కేక్ బేక్ అయిన తర్వాత దానిని పాత్రలో నుండి బయటికి తీయడానికి సులువుగా ఉండేందుకు మాత్రమే, ఈ పిండి చల్లుతారు. అంతేకాదు ఆ పాత్రకి అతుక్కోకుండా ఉంటుంది కూడా.

రకరకాల డ్రై ఫ్రూట్స్ ముక్కలను

రకరకాల డ్రై ఫ్రూట్స్ ముక్కలను

ఆ తర్వాత కేక్ బ్యాటర్ ని ఆ కేక్ పాత్రలో పోసుకోవాలి. బ్యాటర్ మొత్తాన్ని కేక్ పాత్రలో పోసుకున్న తర్వాత ఎక్కడా కూడా చిన్న రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. ఇక ఆ బ్యాటర్ పై రకరకాల డ్రై ఫ్రూట్స్ ముక్కలను టాపింగ్స్ కూడా వేసుకోవచ్చు. ఇక అప్పటికే వేడి చేసి ఉంచిన కుక్కర్ లోపలున్న ఇసుక లేదా ఉప్పుపైన ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన ఈ కేక్ పాత్రను ఉంచండి.

కేక్ పాత్రను లోపల పెట్టిన తర్వాత, కుక్కర్ మూతని పెట్టేయాలి. అయితే ఇక్కడ మీరు ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. కుక్కర్ కి విజిల్ మాత్రం పెట్టకూడదు. కుక్కర్ మూత పెట్టిన తర్వాత 10 నిమిషాల పాటు ఎక్కువ మంట(హై ఫ్లేమ్) ఉంచాలి. ఆ తర్వాత అరగంట పాటు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేయాల్సి ఉంటుంది.

ఇంట్లోనే కేక్ రెడీ..

ఇంట్లోనే కేక్ రెడీ..

అనంతరం 40 నిమిషాల తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని.. కుక్కర్ మూత తీసి చూస్తే మనకు కావాల్సిన కేక్ సిద్ధమై ఉంటుంది. అప్పుడు ఆ కేక్ పాత్రని జాగ్రత్తగా కుక్కర్ నుండి బయటకు తీసి.. ముఖ్యంగా ఆ కేక్ పాత్ర నుండి మరింత జాగ్రత్తగా ఒక ప్లేటులో బోర్లిస్తే.. మనం తినడానికి ఎదురుచూస్తున్న కేక్ రెడీగా ఉంటుంది.

ఇలా మన ఇంట్లోనే మనం ఎలాంటి ఇబ్బందీ లేకుండా చాలా సులభంగా.. త్వరగా కేక్ ను తయారు చేసుకోవచ్చు. కేక్ ఈజీగా ఎలా చేయాలో చూశారు కదా.. ఈ క్రిస్మస్ వేళ లేదా న్యూ ఇయర్ కి మీరు కూడా ఇంట్లోనే కేక్ రెసిపీ ట్రై చేసి.. అందరినీ ఆశ్చర్యపరచండి.

English summary

Homemade Christmas Cake Recipe details in Telugu

Here we are talking about the homemade christmas cake recipe details in Telugu. Have a look
Desktop Bottom Promotion