For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ramzan Special:హైదరాబాదీ ఖీమా లుక్మీ సమోసా ఎలా చేయాలో చూసెద్దామా...!

రంజాన్ స్పెషల్ రెసిపి ఖీమా లుక్మీ సమోసా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

|

మనం చూస్తుండగానే ఉగాది పండుగ వెళ్లిపోయింది. అప్పుడే రంజాన్ మాసం ఉపవాస దీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల రోజుల పాటు మన తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వంటకాలతో పాటు స్పెషల్ రెసిపీలు అందరికీ నోరూరించేస్తుంటాయి. అందులో మొదటిది హలీమ్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

Ramzan Special : How to Make Lukhmi Kheema Samosa Recipe in Telugu

PC:Youtube

అయితే హలీమ్ తో పాటు మనల్ని చాలా ఈజీగా ఆకర్షించే మరో రెసిపీ కూడా ఉందని మీకు తెలుసా.. అదే ఖీమా లుక్మీ. ఈ రెసిపీ హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో రంజాన్ సమయంలో ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఈ సందర్భంగా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ ఖీమా లుక్మీ చూడటానికే సమోసాని పోలి ఉంటుంది. దీన్ని తయారు చేసే పద్ధతి కూడా ఇంచుమించు సమోసాలాగే ఉంటుంది. అందుకే దీన్ని నాన్ వెజ్ సమోసా అని కూడా పిలుస్తుంటారు. అయితే వీటి షేప్ లో మాత్రం చాలా స్పష్టమైన తేడా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా సమోసా ట్రై యాంగిల్ లో ఉంటే.. ఖీమా లుక్మీ మాత్రం చతురస్రాకారంలో ఉంటుంది. సమోసాలో మొత్తం శాఖాహార పదార్థలను నింపితే.. ఖీమా లుక్మీలో మాత్రం మటన్ ను వాడతారు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభమని మీకు తెలుసా..

ఖీమా లుక్మీ తయారీకి కావాల్సిన పదార్థాలు..

మైదాపిండి - 1కిలో
మటన్ - అరకిలో(చిన్నగా ఖీమా మాదిరిగా తరగాలి)
ఉల్లిపాయ - 1
పచ్చిమిరప -5
కొత్తిమీర - ఒక కట్ట
నిమ్మకాయ - 1
కారం - 2 స్పూన్లు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 2స్పూన్లు
పాలు - 1 కప్పు
ఉప్పు - తగినంత
మంచి నూనె - ఒక కప్పు
ఎగ్ వైట్ - 1
గరం మసాలా పౌడర్ - 1స్పూన్

తయారీ విధానం..

ముందుగా మైదాపిండిలో ఉప్పు, ఎగ్ వైట్, కొంచెం నూనె లేదా నెయ్యి, పాలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు వేస్తూ మెత్తని ముద్దగా చేసుకోవాలి. దీన్ని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఖీమా కర్రీని సిద్ధం చేసుకోవాలి. అనంతరం ఒక స్టౌ పై ఒక పాత్ర పెట్టుకుని, అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాస్త వేడి చేయాలి. వాటిలో మీరు కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేడి చేయాలి. ఆ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మటన్ ఖీమాని కూడా అందులో వేయాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఖీమాలో ఉన్న నీళ్లు పూర్తిగా ఇంకిపోయే వరకు దానిని వేడి చేసి తర్వాత అందులో కారం, జీలకర్ర పొి, గరం మసాలా పౌడర్.. వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి అవి ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి ఖీమా బాగా కలిపి.. స్టౌ మీద నుండి కిందకు దించి చల్లారనివ్వాలి. అంతే మీరు ఎదురుచూస్తున్న ఖీమా కర్రీ సిద్ధమైపోయినట్లు..

తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నపిండిని మరోసారి మెత్తగా చేసుకుని.. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను చపాతీ ఆకారంలో చేసుకోవాలి. వీటి మధ్యలో ఒక్కో స్పూన్ ఖీమా కర్రీని ఉంచి చివర్లను నీళ్లతో తడిపి చుట్టూ అతికించేయాలి. ఇందుకు చేతివేళ్లను లేదా ఫోర్క్ ను కూడా ఉపయోగించవచ్చు. దీనినే లుక్మీ అంటారు.

ఇలా రెడీ చేసుకున్న లుక్మీలను స్టౌపై ఒక పాత్ర పెట్టి, అందులో నూనె వేసి బాగా వేడి చేయాలి. అందులో వీటిని వేసి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే నోరూరించే మీ ఖీమా లుక్మీ రెఢీ అయిపోతుంది. దీన్ని సాయంత్రం వేళలో స్నాక్స్ లా ఎక్కువగా తీసుకుంటారు.

English summary

Ramzan Special : How to Make Lukhmi Kheema Samosa Recipe in Telugu

Here we are talking about the Ramzan Special : How to make lukhmi kheema samosa recipe in Telugu. Have a look
Desktop Bottom Promotion