For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Top Searched Recipe 2022: నోట్లో నీరూరించే పనీర్ పసంద్

2022 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన వంటకం కూడా పనీర్ దే కావడం విశేషం. ఆ వంటకం పేరు పనీర్ పసంద్. భారత దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన టాప్ వంటకం ఇదే.

|

Top Searched Recipe 2022: పనీర్ ఆహార పదార్థాలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పనీర్‌తో చేసే వెరైటీ వంటకాలకు చాలా మంది ఫ్యాన్స్. పనీర్ తో చేసే పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్, పనీరు భుర్జీ ఇలా చాలా రకాలు పనీర్‌తో చేసుకోవచ్చు.

Top searched recipe in 2022 google list paneer pasand recipe in Telugu

2022 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన వంటకం కూడా పనీర్ దే కావడం విశేషం. ఆ వంటకం పేరు పనీర్ పసంద్. భారత దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన టాప్ వంటకం ఇదే.

Top searched recipe in 2022 google list paneer pasand recipe in Telugu

పనీర్ పసంద్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

* పనీర్ - 25 గ్రాములు
* కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
* అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూన్
* సన్నగా తరిగిన జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
* సన్నగా తరిగిన బాదం - 2 టేబుల్ స్పూన్లు
* సన్నగా తరిగిన ఎండుద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు
* నూనె - 200 గ్రాములు
* టొమాటో - 4 మీడియం సైజువి
* పచ్చిమిర్చి - 4
* క్రీమ్ - ఒక కప్పు
* కసూరి మేతి - 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
* ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
* కాశ్మీరీ కారం - 1/2 టేబుల్ స్పూన్
* పసుపు - 1/4 టేబుల్ స్పూన్
* గరం మసాలా - 1/4 టేబుల్ స్పూన్
* ఉప్పు - తగినంత

Top searched recipe in 2022 google list paneer pasand recipe in Telugu

పనీర్ పసంద్ తయారీ విధానం:

1. పనీర్‌ను అర అంగుళం మందంతో ట్రయాంగిల్‌లో కట్ చేసుకోవాలి.

2. కార్న్‌ఫ్లోర్‌లో కొన్ని నీళ్లు పోసి చిక్కని పిండిలా తయారు చేసుకోవాలి.

౩. పనీర్‌లో స్టఫ్‌ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష పదార్థాలను కలిపి పెట్టుకోవాలి.

4. అన్నింటిని కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని పనీర్‌లో నింపి పెట్టుకోవాలి.

5. తర్వాత గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ పిండిలో పనీర్ శాండ్‌విచ్‌ను ముంచి లేత గోధుమరంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి.

గ్రేవీ తయారీ:
1. ముందుగా టమాటాలను, పచ్చిమిర్చి బాగా గ్రైండ్ చేసుకోవాలి.

2. మరో గిన్నె తీసుకుని అందులో నూనె వేడి చేసుకోవాలి.

3. వేడెక్కిన నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంగువ, పసుపు, కొత్తి మీర వేసి వేయించుకోవాలి.

4. ఇప్పుడు టమాటా, చిల్లీ పేస్టు వేసుకోవాలి.

5. కశ్మీరీ కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.

6. గ్రేవీ దగ్గరకు వచ్చేంతు వరకు ఆగి ఇప్పుడు గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి.

7. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పనీర్ శాండ్‌విచ్‌ను గ్రేవీలో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.

అంతే నోరూరించే పనీర్ పసంద్ సిద్ధం అయినట్లే.

Read more about: recipe వంటకం
English summary

Top searched recipe in 2022 google list paneer pasand recipe in Telugu

read on to know Top searched recipe in 2022 google list paneer pasand recipe in Telugu
Story first published:Monday, December 12, 2022, 14:46 [IST]
Desktop Bottom Promotion