Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Kerala special sulaimani tea: కేరళ స్పెషల్ 'సులేమని టీ'..పొట్ట తేలికైపోతుంది..ఇలా చేయాలి
టీ(tea)లో అనేక రకాలు ఉంటాయి. ఒక్కో ఏరియాలో ఒక్కో స్టైల్ లో టీని తయారుచేస్తుంటారు. అయితే కేరళలో ఎక్కడికెళ్లినా ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటది సులేమని టీ(sulaimani tea). దీని టేస్ట్ అద్భుతంగా ఉండటంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఈ సులేమని టీ మేలు చేస్తుంది. భోజనం చేశాక అయినా లేదా రోజులో ఎప్పుడైనా ఈ టీ తాగితే పొట్ట అంతా తేలికగా అవుతుంది. పొట్టను తేలికపరిచే ఈ సులేమని టీ కోసం ఇప్పుడు కేరళ దాకా వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. సులేమని టీ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సులేమని టీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-నీళ్లు
-చక్కెర
-రెడ్ లేబుల్ నేచురల్ కేర్
-పుదీనా
-నిమ్మరసం
సులేమని టీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ గిన్నె పెట్టి అందులో 1 లీటర్ నీళ్లు పోసి బాగా మరిగించాలి.
-నీళ్లు బాగా తెర్లకాగుతున్నప్పడు అందులో 2 ఇంచుల దాల్చిన చెక్క,5-6లవంగాలు వేసి ఒక నిమిషం మరగనిస్తే ఫ్లేవర్స్ అన్నీ నీళ్లల్లోకి దిగుతాయి.
-తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి మరో 2 నిమిషాలు మరిగించండి.
-తర్వాత ఇందులో రెడ్ లేబుల్ నేచురల్ కేర్(Red Label Natural care)3 టేబుల్ స్పూన్లు వేసి మంటను హై ప్లేమ్ మీద ఉంచి 2-3 నిమిషాలు మరిగించండి.
-తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెలో కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకులు వేయండి. ఇందులోనే కొంచెం నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు అలా వదిలేయండి.
-తర్వాత గ్లాస్ లో పోసుకొని ఈ సులేమని టీని ఆస్వాదించడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












